పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'సలార్' రెండు భాగాలుగా రాబోతుందని ఇటీవల మేకర్స్ టీజర్ తో రివిల్ చేసిన విషయం తెలిసిందే. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పార్ట్ వన్ సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. పార్ట్ 1 రిలీజ్ అయిన వెంటనే 'సలార్ పార్ట్ 2' ని వీలైనంత త్వరగా ముగించేందుకు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కసరత్తులు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే.. ఎన్టీఆర్ 31 ప్రాజెక్ట్ పై ప్రభావం చూపే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. నిజానికి ‘సలార్’ విడుదలైన వెంటనే ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకెళ్లాల్సి ఉంది. కానీ ‘సలార్’ రెండు భాగాలుగా ప్లాన్ చేయడంతో ఎన్టీఆర్ తో ప్రాజెక్ట్ ఇప్పట్లో మొదలయ్యే అవకాశాలు కనిపించడం లేదని అంటున్నారు.


ప్రస్తుతం ఎన్టీఆర్ 'దేవర' షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తయ్యాక ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో ప్రాజెక్టుని స్టార్ట్ చేస్తాడా? లేక మరికొద్ది నెలలు ఎన్టీఆర్ ని వెయిట్ చేయిస్తాడా? అన్న ప్రశ్న ఇప్పుడు తారక్ అభిమానులను వేధిస్తోంది. అయితే ఈ విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 'సలార్' పార్ట్ 2 ను 2024 వేసవి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. ఇప్పటికే ‘సలార్’ పార్ట్ 2 మెజారిటీ షూటింగ్ కూడా పూర్తయినట్టు తెలుస్తోంది. అంతే కాదు 'సలార్' పార్ట్ వన్ రిలీజ్ సమయంలోనే దర్శకుడు ప్రశాంత్ నీల్ ‘సలార్’ పార్ట్ 2 షూటింగ్‌ను స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. తద్వారా 'సలార్' పార్ట్ 2ను అనుకున్న సమయానికి విడుదల చేయొచ్చనేది ఆయన ప్లాన్ అని తెలుస్తోంది.


దీని ప్రకారం ఎన్టీఆర్ 'దేవర' విడుదలయ్య సమయానికి ప్రశాంత్ నీల్ 'సలార్' పార్ట్2 షూటింగ్ని ముగిస్తారు. ఆ తర్వాత ఇటు ప్రశాంత్ అటు ఎన్టీఆర్ #NTR31 ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ వచ్చిన ఇబ్బందల్లా కొరటాల శివ 'దేవర' షూటింగ్ 2023 లోనే పూర్తి చేసి విడుదల చేస్తాడా అనేదే? ఒకవేళ ‘దేవర’ షూటింగ్ కనుక ఆలస్యమైతే అది కాస్త #ఎన్టీఆర్ 31 ప్రాజెక్ట్ పై ప్రభావం చూపుతుంది. కానీ సలార్ పార్ట్ 2 వల్ల #ఎన్టీఆర్31 ప్రాజెక్ట్ కి ఎలాంటి ఇబ్బంది లేదని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. మరి కొరటాల శివ ఏం చేస్తాడో చూడాలి? ఇక ఎన్టీఆర్ దేవర విషయానికొస్తే.. కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా లెవెల్ లో ఈ ప్రాజెక్టు తెరకెక్కుతోంది.


ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ ఈ సినిమాతో వెండితెరకు హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. సైఫ్ అలీ ఖాన్ విలన్ గా కనిపించనున్న ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ బ్యానర్లపై కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మూవీ టీమ్ ఇటీవలే అండర్ వాటర్ ఫైట్ సీక్వెన్స్ ని చిత్రీకరించారు. హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ కి కెన్నీ బేట్స్ లాంటి సాంకేతిక నిపుణులు పనిచేయడం విశేషం. అనిరుద్ రవిచంద్రన్ సంగీతమందిస్తున్న ఈ సినిమా 2024 ఏప్రిల్ 5 వేసవి కానుకగా విడుదల కానుంది.


Also Read : మహేష్ బాబు సినిమాలో ఛాన్స్ కొట్టేసిన చీజ్ బజ్జీ పాప - ఇంతకీ ఎవరీ అమ్మాయి?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial