Kalki 2898 AD New Release Date Announcement on April 17th: ప్రభాస్‌ 'కల్కి 2989 ఏడీ' రిలీజ్‌పై ఇంకా క్లారిటీ రాలేదు. ఎప్పుడో సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా షూటింగ్‌ ఆలస్యం, వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ వల్ల వాయిదా పడింది. ఇక మే 9న మూవీ విడుదల ఫిక్స్‌  అంటూ మూవీ టీం అనౌన్స్‌మెంట్‌ ఇచ్చింది. ఈసారి మూవీకి ఎన్నికలు అడ్డు పడ్డాయి. దేశవ్యాప్తం మేలో ఎన్నికల హడావుడి ఉండటం ఈ సినిమా వాయిదా వేయగా తప్పలేదు. ఇక కొత్త రిలీజ్‌ డేట్‌ కోసం మూవీ లవర్స్‌ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మే 30న కల్కి కొత్త రిలీజ్‌ డేట్‌ ఉండే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతుంది.

ఆ రోజే బిగ్ అప్డేట్

అయితే దీనిపై మూవీ టీం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ క్రమంలో త్వరలో కల్కి టీం నుంచి కొత్త రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌మెంట్‌ రానుందంటూ తాజాగా ఓ అప్‌డేట్‌ వచ్చింది.ఏప్రిల్‌ 17న కల్కి కొత్త రిలీజ్‌పై ప్రకటన రానుందంటూ నెట్టింట ప్రచారం జరుగుతుంది. అంతేకాదు ఇప్పటి వరకు ప్రచారంలో ఉన్న విడుదల తేదీ మే 30 కూడా మారే అవకాశం ఉందంటున్నారు. మేలో కాకుండా ఈ సినిమాను జూన్‌లో రిలీజ్ చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారంట మరో కొత్త తేదీ తెరపైకి వచ్చింది. జూన్‌ 20న కల్కిని రిలీజ్‌ చేసేందుకు మూవీ టీం చర్చిస్తుందట. ఆ దిశగా సన్నాహాలు చేస్తున్నట్టు ఇన్‌సైడ్‌ సినీ సర్కిల్లో టాక్‌. మరి దీనిపై క్లారిటీ రావాలంటే ఏప్రిల్‌ 17 వరకు వేచి చూడాల్సింది.

కాగా మే 9 నుంచి కల్కి వాయిదా పడిందనేది నిజం. మరి కొత్త రిలీజ్‌ డేట్‌పై నాగ్‌ అశ్విన్‌ అండ్‌ టీం ఏం ప్లాన్‌ చేసిందనేది ఏప్రిల్‌ 17 తర్వాతే తెలుస్తుంది. ఇక ఈ లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం కల్కి మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటుంది. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీలో వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌కి పెద్దపీట వేశారు. అయితే ఇప్పుడు ఇదే మూవీ ఆలస్యానికి మరింత కారణం అంటున్నారు. ఇంకా వీఎఫ్‌ఎక్స్‌ కాలేదని, దీనికి చాలా టైం పడుతుందట. మే 30లోగా మూవీని రెడీ చేయడమే కష్టమే అని, అందుకే జూన్‌ 20 ఫిక్స్‌ చేయాలని నాగ్‌ అశ్విన్‌ అండ్‌ భావిస్తుందని ఇన్‌సైడ్‌ సినీ సర్కిల్లో టాక్‌. 

కాగా 'కల్కి 2989 ఏడీ'ని దాదాపు రూ. 400 కోట్ల నిర్మాణ వ్యయంతో తెరకెక్కిస్తున్నట్లు టాక్. సైన్స్ ఫిక్షన్ అండ్ ఫాంటసీ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో భారీ తారాగణం నటిస్తోంది. యూనివర్సల్‌ యాక్టర్‌, లోకనాయకుడు కమల్‌ హాసన్‌ ఇందులో విలన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌, దిశా పటానీ, మలయాళ స్టార్‌ హీరో దుల్కర్‌ సల్మాన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక బాలీవుడ్‌ బ్యూటీ క్వీన్‌ దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇందులో దిశా పటానీ కీ రోల్‌తో పాటు సెకండ్‌ హీరోయిన్‌గా కనిపించనుందని సమాచారం. ఈ మధ్యే విదేశాల్లో దిశా, ప్రభాస్‌ మధ్య ఒక రొమాంటిక్‌ సాంగ్‌ చిత్రీకరించినట్టు తెలిసింది. అంతేకాదు సెట్స్‌లోని వీరిద్దరు ఫోటోలను దిశ తన సోషల్‌ మీడియాలో ఖాతాలో కూడా షేర్‌ చేసింది. అలాగే రీసెంట్‌గా ప్రభాస్‌తో సెల్ఫీ దిగి ఫోటోను పంచుకుంది.