'కెజిఎఫ్', 'కెజిఎఫ్ 2' సినిమాలతో రాకింగ్ స్టార్ యష్ (Yash) పాన్ ఇండియా స్టార్ అయ్యారు. 'టాక్సిక్'తో ఆయన్ను పాన్ గ్లోబల్ స్టార్ చేసేలా కృషి చేస్తున్నారు కెవిఎన్ ప్రొడక్షన్స్ పతాకం మీద వెంకట్ కె. నారాయణ. ఆయన సహ నిర్మాణంలో యష్‌ తన 'మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్' సంస్థ మీద ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాను కన్నడతో పాటు ఇంగ్లీష్ భాషలో తెరకెక్కిస్తున్నారు.

Continues below advertisement


ఏయే భాషల్లో డబ్బింగ్ చేస్తున్నారో తెలుసా?
'కెజిఎఫ్' తర్వాత యష్ హీరోగా నటిస్తున్న సినిమా 'టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ గ్రోన్ అప్స్' (Toxic A Fairy Tale For Grown Ups). ఈ సినిమాకు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇంగ్లీష్, కన్నడ భాషల్లో చిత్రీకరిస్తున్న ఈ సినిమాను హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో డబ్బింగ్ చేయనున్నారు. యష్ పాన్ ఇండియా ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని అన్ని భాషల ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్లనున్నారు. 


ఇంగ్లీష్‌లో ఎందుకు షూటింగ్ చేస్తున్నారు?
ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ కొందరు ఇంగ్లీష్ భాషలో సినిమాలు చేశారు. అయితే, ఫర్ ద ఫస్ట్ టైమ్... ఒక స్టార్ హీరోతో భారీ స్థాయిలో ఇంగ్లీష్, కన్నడలో షూటింగ్ చేస్తున్న సినిమా మాత్రం 'టాక్సిక్' అని చెప్పాలి. 


ఇంగ్లీష్ భాషలోనూ పిక్చరైజ్ చేయడం ఎందుకు? అనేది దర్శకురాలు గీతూ మోహందాస్ వివరించారు. ఆవిడ మాట్లాడుతూ... ''మేం 'టాక్సిక్' సినిమా కోసం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకునే కథ రెడీ చేశాం. మన దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా కథ ఉంటుంది. అందుకే కన్నడ, ఇంగ్లీష్ - రెండింటిలోనూ చిత్రీకరణ చేస్తున్నాం. భాష, సాంస్కృతిక పరమైన భేదాలు దాటి అందరి హృదయాలను తాకేలా ఉంటుంది" అని చెప్పారు. నిర్మాత వెంకట్ నారాయణ మాట్లాడుతూ... ''మన దేశంతో పాటు అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకట్టుకునేలా 'టాక్సిక్‌'ను రూపొందిస్తున్నాం. భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకు వెళ్లే చిత్రమిది" అని అన్నారు.


Also Read'మజాకా' రివ్యూ: పార్టులు పార్టులుగా చూస్తే కామెడీ సీన్లు ఓకే... మరి సినిమా? సందీప్ కిషన్, రావు రమేష్ కలిసి విసిగించారా? నవ్వించారా?


'టాక్సిక్' సినిమాలో హాలీవుడ్ స్థాయి యాక్షన్ సన్నివేశాలను రూపొందించేందుకు 'జాన్ విక్', 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' సినిమాలకు పని చేసిన యాక్షన్ కొరియోగ్రాఫర్ జేజే పెర్రీని తీసుకున్నారు. అలాగే, విజువల్ ఎఫెక్ట్స్ కోసం 'డ్యూన్: పార్ట్ 2'కు పని చేయడంతో పాటు ఆ సినిమాకు బీఏఎఫ్టీఏ అవార్డు గెలుచుకున్న DNEG స్టూడియోకు బాధ్యతలు అప్పగించారు. యష్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన 'టాక్సిక్' బర్త్‌ డే పీక్ టీజర్ సూపర్బ్ రెస్పాన్స్ అందుకుంది. సినిమా ఎంత గ్రాండియర్‌గా తీస్తున్నారనేది అందరికీ అర్థం అయ్యింది. ఈ సినిమా షూటింగ్ ఆగస్టు, 2024లో ప్రారంభమైంది. 


Also Read: 'లైలా'ను థియేటర్లలో మిస్ అయ్యారా... డోంట్ వర్రీ, మార్చిలోనే ఓటీటీ రిలీజ్... ఎప్పుడో తెలుసా?