Beast Banned in Kuwait | ఇటీవల భారతీయ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. గతంలో కూడా మన చిత్రాలు విదేశాల్లో విడుదలయ్యేవి. అయితే, పాన్ ఇండియా చిత్రాల సంఖ్య పెరగడం వల్ల ఈ ట్రెండ్ మరింత ఊపందుకుంది. ముఖ్యంగా ‘బాహుబలి’ సినిమా విడుదల తర్వాత భారతీయులు నివసించే ఇతర దేశాల్లో కూడా చిత్రాలను విడుదల చేస్తున్నారు. విదేశీయులు కూడా చూసేందుకు వీలుగా సబ్ టైటిల్స్ కూడా సినిమాల్లో పెడుతున్నారు. 


కానీ, కువైట్ వంటి దేశాల్లో మాత్రం మన చిత్రాలు విడుదలకు నోచుకోవడం లేదు. ముఖ్యంగా తీవ్రవాద కార్యకలాపాలపై తెరకెక్కిస్తున్న చిత్రాలకు ఆ దేశంలో చుక్కెదరవుతోంది. తాజా తమిళ హీరో విజయ్ నటించిన ‘బీస్ట్’(Beast) చిత్రం ఈ నెల 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్‌ ఇప్పటికే అంచనాలు పెంచేసింది. టెర్రెరిస్టుల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కడంతో కువైట్(Kuwait) ప్రభుత్వం విడుదలకు నిరాకరించింది. దీంతో ‘బీస్ట్’ (Beast) కువైట్‌లో మినహా మిగతా దేశాల్లో విడుదల కానుంది. 


Also Read: 'ఆర్ఆర్ఆర్' టీమ్ కి బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు స్పెషల్ పార్టీ


ఇదివరకు దుల్కర్ సల్మాన్ నటించిన ‘కురూప్’, విష్ణు విశాల్ నటించిన ‘ఎఫ్ఐఆర్’ సినిమాలను కూడా కువైట్‌లో విడుదలకు అంగీకరించలేదు. ఆయా చిత్రాల్లో తీవ్రవాదులు కువైట్‌లో తలదాచుకున్నట్లుగా చూపించడమే ఇందుకు కారణం. అయితే, కువైట్ బాటలోనే మిగతా అరబ్ దేశాలు కూడా బ్యాన్ విధిస్తే కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశాలున్నాయి. ‘బీస్ట్’(Beast) చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. విజయ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. 


Also Read: డ్రగ్స్ కేసుపై మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా రియాక్షన్ ఇదే




Beast Trailer: