పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వేడుకలకు హాజరు కావడం చాలా అరుదు. ఆ మధ్య 'అంటే సుందరానికీ' ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో సందడి చేశారు. ఈ రోజు విశ్వక్ సేన్ కొత్త సినిమా ఓపెనింగ్‌కు ముఖ్య అతిథిగా వచ్చారు. ఆయన వచ్చింది ఎవరి కోసం? అంటే... యాక్షన్ కింగ్ అర్జున్ కోసం!


విశ్వక్ సేన్ (Vishwak Sen) కథానాయకుడిగా యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా రచన, నిర్మాణం, దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఈ రోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది.
 
పూజా కార్యక్రమాల అనంతరం హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్లాప్ ఇచ్చారు. దర్శకేంద్రులు కె. రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించగా... ప్రకాష్ రాజ్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. హీరో, 'మా' ప్రెసిడెంట్ విష్ణు మంచు స్క్రిప్ట్ అందజేశారు. అర్జున్ మీద ఉన్న అభిమానంతో ఈ ప్రారంభోత్సవానికి అతిథిగా వచ్చినట్టు పవన్ కళ్యాణ్ తనతో చెప్పారని ప్రకాష్ రాజ్ అన్నారు (Pawan Kalyan Shows His Good Gesture Towards Arjun). 


దర్శకుడిగా అర్జున్‌కు 15వ చిత్రమిది. నిర్మాతగా 15వ సినిమా. అయితే... ఆయన దర్శకత్వం వహిస్తున్న తొలి తెలుగు చిత్రమిదే. అంతే కాదు... తన కుమార్తె ఐశ్వర్యను ఈ సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయం చేస్తున్నారు. తనను ఆదరించినట్టు తన కుమార్తెను కూడా ఆదరించాలని ఆయన కోరారు. అర్జున్ తనను కలవాలని అన్నప్పుడు షాక్ అయ్యానని, ఆయన చెప్పిన కథ విపరీతంగా నచ్చిందని విశ్వక్ సేన్ తెలిపారు. 


Also Read : 'కొండా' రివ్యూ: కొండా మురళి, సురేఖ దంపతుల జీవితం ఆధారంగా రూపొందిన ఈ సినిమా ఎలా ఉందంటే?


జగపతి బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి సాయి మాధవ్ బుర్రా సంభాషణలు, 'కెజియఫ్' ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.   


Also Read : అల్లు అర్జున్‌కు వీరాభిమాని అరుదైన కానుక - ఐకాన్ స్టార్ అభిమానులే ఖర్చులన్నీ భరించి