Suhas Birthday Special: ఆగస్టు 19న సుహాస్ పుట్టినరోజు. బర్త్ డే స్పెషల్ కింద ఒక్క రోజు ముందు 'హే భగవాన్' టైటిల్ గ్లింప్స్ విడుదల చేయడంతో పాటు ఆ సినిమా అనౌన్స్ చేశారు. ఇక బర్త్ డే నాడు 'మందాడి' నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమా సుహాస్ కెరీర్‌లో కీలకమైనది. సంథింగ్ స్పెషల్ కూడా! అదీ ఎందుకో తెలుసా?
తమిళ సినిమాలో సుహాస్ అడుగు!Suhas First Tamil Movie: ఎటువంటి సినిమా నేపథ్యం లేకుండా ఒక సాధారణ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్, నటుడిగా కెరీర్ స్టార్ట్ చేసిన సుహాస్... తర్వాత వెండితెరపై హీరోలకు స్నేహితుడిగా నటించారు. అక్కడ నుంచి హీరోగా మారి విజయవంతమైన సినిమాలు చేశారు. ఇప్పుడు 'మందాడి' సినిమాతో తమిళ తెరపై అడుగు పెడుతున్నారు. నటుడిగా సుహాస్ తొలి తమిళ సినిమా 'మందాడి' (Mandaadi Movie). ఇందులో తమిళ హాస్య నటుడు సూరి హీరో. ఆర్‌ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ సంస్థలో 16వ సినిమా ఇది. 'సెల్ఫీ' ఫేమ్ మతిమారన్ పుగళేంది దర్శకత్వం వహిస్తున్నారు. ఇదొక ఇంటెన్స్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా.
'మందాడి' ఎందుకంత స్పెషల్ అంటే... సుహాస్ తమిళ్ సినిమా కావడం ఒకటి అయితే , అందులో అతను విలన్ రోల్ చేస్తుండటం మరొక రీజన్. అడివి శేష్ హీరోగా నటించిన 'హిట్ 2'లో సుహాస్ నెగిటివ్ షేడ్ రోల్ చేశారు. ఆ తర్వాత 'ఫ్యామిలీ డ్రామా'లోనూ నెగిటివ్ ఛాయలు ఉన్న పాత్ర చేశారు. ఇప్పుడు తమిళ ప్రేక్షకులకు తన విలనిజం చూపించడానికి రెడీ అవుతున్నారు. 'మందాడి' విజయం సాధిస్తే... తమిళంలోనూ సుహాస్‌కు మార్కెట్ క్రియేట్ అవుతుంది. అక్కడ నుంచి అవకాశాలు రావడంతో పాటు తెలుగులో ఆయన చేసిన సినిమాలను తమిళంలో డబ్ చేసి విడుదల చేయవచ్చు. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలకు రెండు భాషల్లో మార్కెట్ ఉంటే బడ్జెట్ పరంగా వెసులుబాటు ఉంటుంది.
సుహాస్ బర్త్ డే సందర్భంగా అతనికి విషెష్ చెబుతూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది 'మందాడి' టీమ్. ఈ సినిమాలో మహిమా నంబియార్, సత్యరాజ్, రవీంద్ర విజయ్, అచ్యుత్ కుమార్ వంటి ట్యాలెంటెడ్ ఆర్టిస్టులు నటిస్తున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు.
Also Read: షూటింగులు ఆపితే అడుక్కు తినాలి... కార్మికుల ఆకలి బాధలపై మాట్లాడరే? - నాయకులపై వీఎన్ ఆదిత్య ఫైర్
Mandaadi Movie Cast And Crew: సూరి, సుహాస్, మహిమా నంబియార్, సత్యరాజ్, రవీంద్ర విజయ్, అచ్యుత్ కుమార్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్: దినేష్ మనోహరన్, కొరియోగ్రాఫర్: అజర్, అదనపు రచన: ఆర్. మోహన వసంతన్ - తిరల్ శంకర్, మేకప్: ఎన్.శక్తివేల్, కాస్ట్యూమర్: నాగు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ఎస్.పి చొక్కలింగం, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: జి. మహేష్, యాక్షన్: పీటర్ హెయిన్, సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, సహ నిర్మాత: వి.మణికందన్, నిర్మాత: ఎల్రెడ్ కుమార్, దర్శకుడు: మతిమారన్ పుగజేంధీ.