మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR), దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్‌కు తెలుగులో వీరాభిమానులు ఉన్నారు. ఇప్పటి వరకు వాళ్లిద్దరూ కలిసి నాలుగు సినిమాలు చేశారు. నందమూరి హరికృష్ణ వారసుడిగా ఎన్టీఆర్ హీరోగా పరిచయమైన 'స్టూడెంట్ నంబర్ 1'తో రాజమౌళి దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత 'సింహాద్రి', 'యమదొంగ', 'ఆర్ఆర్ఆర్' వచ్చాయి. ఇండియాలో మాత్రమే కాదు... జపాన్‌లోనూ ఈ కాంబోకి ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే అక్కడ 'సింహాద్రి'ని రిలీజ్ చేస్తున్నారు. 

అక్టోబర్ 17న జపాన్‌లో 'సింహాద్రి' రిలీజ్!Jr NTR & Rajamouli's Simhadri Set for Japan Release: తెలుగులో 'సింహాద్రి' సినిమా బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ అయ్యింది. జూలై 9, 2003లో ఆ సినిమా రిలీజ్ అయ్యింది. ఇప్పటికీ ఆ సినిమా అంటే చూసే ఫ్యాన్స్ ఉన్నారు. గతేడాది మే నెలలో రీ రిలీజ్ చేయగా రికార్డ్ కలెక్షన్స్ సాధించింది. ఇప్పుడీ సినిమాను జపాన్ ఫ్యాన్స్ కోసం అక్కడ రిలీజ్ చేస్తున్నారు. 

అక్టోబర్ 17న జపాన్‌లోని క్యోటో నగరంలోని అప్ లింక్ క్యోటో (Uplink Kyoto) థియేటర్‌లో స్పెషల్ షో వేస్తున్నారు. ఆల్రెడీ బుకింగ్స్ కూడా స్టార్ట్ చేశారు. జపనీస్ భాషలో పోస్టర్లు రిలీజ్ చేశారు.

Also Readషూటింగులు ఆపితే అడుక్కు తినాలి... కార్మికుల ఆకలి బాధలపై మాట్లాడరే? - నాయకులపై వీఎన్ ఆదిత్య ఫైర్

'ఆర్ఆర్ఆర్' హీరో & డైరెక్టర్ సినిమా అంటూ...'సింహాద్రి' జపాన్‌లో విడుదల అవుతున్న సందర్భంగా 'ఆర్ఆర్ఆర్' హీరో జూనియర్ ఎన్టీఆర్, డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ సినిమా అంటూ పబ్లిసిటీ చేస్తున్నారు. జపాన్‌లో 'బాహుబలి' భారీ విజయం సాధించింది. ఆ సినిమాకు వచ్చిన క్రేజ్ నేపథ్యంలో 'బాహుబలి' దర్శకుడు తీసిన సినిమా అంటూ 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం'ను విడుదల చేశారు.

Also Read: మెగాస్టార్ మాస్టర్ ప్లాన్... చిరంజీవి రంగంలోకి దిగడంతో మారిన సీన్!

'ఆర్ఆర్ఆర్' జపాన్ రిలీజ్ సమయంలో రాజమౌళితో పాటు ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా ఆ దేశానికి వెళ్లారు. సినిమా విజయం తర్వాత వాళ్లకూ అభిమానులు ఏర్పడ్డారు. అందుకే 'సింహాద్రి' విడుదల సందర్భంగా 'ఆర్ఆర్ఆర్' హీరో & డైరెక్టర్ సినిమా అంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ సినిమాలో భూమికా చావ్లా, అంకిత హీరోయిన్లు. ముఖేష్ రుషి విలన్ రోల్ చేశారు. రాహుల్ దేవ్, శరత్ సక్సేనా, నాజర్, సీత, బ్రహ్మానందం, సంగీత తదితరులు కీలక పాత్రలు పోషించారు. రాజమౌళి తండ్రి వి విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఎన్టీఆర్ రీసెంట్ మూవీస్ విషయానికి వస్తే... బాలీవుడ్ డెబ్యూ 'వార్ 2' ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. హిందీ దర్శక నిర్మాతలు అయాన్ ముఖర్జీ, ఆదిత్య చోప్రా ఎన్టీఆర్‌ను సరిగా వాడుకోలేదని ఫ్యాన్స్ సహా టాలీవుడ్ ఆడియన్స్ చాలా మంది అభిప్రాయపడుతున్నారు.