మోడ్రన్ మూవీ ఎరా లో...టెక్నాలజీ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ను నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్ళింది. ఇంతకు ముందు సినిమాను చూసేవాళ్లం. ఇప్పుడు ఆ రోజులు పోయి సినిమాను ఎక్స్ పీరియన్స్ చేస్తున్నాం. మెటావర్స్ వస్తే సినిమాలో మనం ఉంటాం. సరే ఎన్నో గొప్ప సినిమాలు ఇన్నేళ్లలో వచ్చి ఉంటాయి. కానీ మోడ్రన్ సినిమాలో సింహాసనం పైన ఉన్న సినిమా ఏంటి? అంటే ఠక్కున చెప్పే పేరు 'అవతార్'. ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్ చూసిన ఓ మాగ్నమ్ ఓపస్ ఈ సినిమా. లార్జర్ దేన్ ది లైఫ్ క్యారెక్టర్లతో... కళ్లు చెదిరిపోయే విజువల్స్ తో 13 ఏళ్ల క్రితం వచ్చిన అవతార్ చేసిన మ్యాజిక్ నే ఇంకా ఎవరూ మర్చిపోలేదు. ఇప్పుడు అవతార్ పార్ట్ 2. ది వే ఆఫ్ వాటర్ తో టైటిల్ తో. ఈ వీడియోలో అవతార్ గొప్ప సినిమాగా నిలిచిపోవడానికి కారణాలు ఏంటి?
   

  
Human Emotions : అవతార్ అనేది పండోరా అనే గ్రహం మీద జరుగుతున్న నావి అనే ఓ జాతి కథ. వాళ్లు మనుషులు కూడా కాదు. మనుషులు ల్లాంటి వారు. సో హ్యూమన్ ఎమోషన్స్ అన్నారేంటీ అనుకోవచ్చు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది How we Connect  టూ ది మూవీ అనేది. హ్యూమన్ సొసైటీ లో రెవల్యూషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాక అంటే పర్టిక్యులర్లీ ఇండస్ట్రీయల్ రెవల్యూషన్ మొదలయ్యాక బలవంతుడు, బలహీనుడు అనే రెండు క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ బలవంతుడు అనే పదానికి నిర్వచనం డబ్బున్నవాడని, సౌకర్యాలు ఉన్నవాడని. ఈ బలహీనులు అనే క్లాసెస్ మాత్రం నేలకి కనెక్ట్ ఉండిపోయారు. వాడు కార్లరో తిరిగితే వీళ్లు కాళ్లకు చెప్పులు లేకుండా తిరుగుతారు. తన అవసరం కోసం ఈ బలవంతుడు బలహీనుడిని కొడుతూ ఉంటాడు. వాడి కష్టాన్ని తన ఉన్నతి కోసం వాడుకుంటూ ఉంటాడు. మానవ హక్కులు అనే కాన్సెప్ట్ వచ్చాక కూడా ఈ దౌర్జన్యం కొనసాగుతూనే ఉంది. అప్పుడు సాధారణంగా మన ఓటు, మన సానుభూతి బలహీనుడి వైపే ఉంటుంది. బలవంతుల స్వార్థపూరిత ఆలోచనలు తిప్పికొట్టి... బలహీనుల పక్షాన నిలబడేందుకు చరిత్ర ఓ హీరోని తయారు చేసుకుంటుంది వాడు జనంలో నుంచి వస్తాడు. జనంతో పాటే ఉంటాడు. అవతార్ లో ఈ కాన్సెప్ట్ మొత్తం ఉంటుంది. కథలో బలవంతుడు భూమి మీద నుంచి పండోరా వరకూ తన జర్నీ సాగించి వెళ్లి అక్కడ వేరే గ్రహంలోనూ తనదే ఆధిపత్యం సాగాలనుకునే మనిషిది..బలహీనుడు పండోరా గ్రహం పైన ఉండే నావి జాతి ప్రజలు. వాళ్లకు కావాల్సిన ఖనిజాల కోసమో, నిక్షేపాల కోసమే పండోరా గ్రహంపై ఎంతటి విధ్వంసానికైనా వెనుకాడని మనుషులను చూసిన మనం మన జాతి అయినా మనుషులకు దూరం జరిగి పండోరా గ్రహం నావి జాతి వైపు నిలబడతాం..కారణం హ్యూమన్ ఎమోషన్స్. ఫస్ట్ కనెక్టింగ్ పాయింట్.


Rich Culture and heritage : అవతార్ కథ నడిచే పండోరా గ్రహం ఎన్నో జీవులకు నివాసం. అక్కడ బతికే నావి తెగ ప్రజలు ఆ వింత వింత జీవులతో కలిసే బతుకుతారు. అక్కడ అంతా సమానం అనే ఫీలింగే. అచ్చం భూమిపైన ఉన్నట్లే అక్కడ కూడా ఖడ్గ మృగాలను పోలిన జీవులు ఉంటాయి. తిమింగలాలను పోలిన సముద్ర ప్రాణులు ఉంటాయి. మన పూల మొక్కలను పోలిన మొక్కలు, మన జలపాతాలను పోలిన జలపాతాలు ఇలా ప్రతీ ఫ్రేమ్ లో కనిపించే వస్తువు భూమిపైన ఉన్నవాటికి అచ్చం రెప్లికాలా ఉంటుంది. మరి అంతటి అందమైన మన ప్రకృతిని మనం ఏం చేసుకుంటున్నాం. ఇదే ప్రశ్న కేమరూన్ ది కూడా. నేరుగా మనకు చెబితే వినం కాబట్టి పండోరా అనే గ్రహాన్ని క్రియేట్ చేసి అక్కడ నావి అనే జాతిని పెట్టి..వాళ్ల ద్వారా కథ చెప్పిస్తున్నాడు. ప్రకృతితో మమేకమై బతకాల్సిన మన సంస్కృతిని నాశనం చేసుకుంటూ....భూమిపై కాలుష్యంతోనో..మరో కారణంతోనో మనిషి చేస్తున్న విధ్వంసాన్ని కేమరూన్ కళ్లకు కట్టినట్లు చూపించాడు. ఫలితంగా మనం ఎలా నడుచుకోవాలి అనే చిన్న ఆలోచన వచ్చినా చాలనే థృక్పథం జేమ్స్ కేమరూన్ ది. ఈవా అనే ఓ చెట్టును మనుషులు పడగొట్టకుండా గ్రహం పైన ఉన్న నావిజాతి మొత్తం ఏకమవుతుంది. అక్కడి మనుషులకు, ప్రకృతికి అనుసంధానంలా ఓ పెద్ద నెట్ వర్కే ఉంటుంది. అచ్చం భూమిపైన కూడా అలాంటి నెట్ వర్క్ ఉంటుంది అని మీకు తెలుసా. మైసీలీయం ఎలక్ట్రో మాగ్నటిక్ కెమికల్ లాంగ్వేజ్ ద్వారా మన భూమి మీద కూడా మనకు కంటికి కనిపించని నెట్ వర్క్ ఉంది. ఇలా..మనకు దాని వ్యాల్యూ తెలుసా. తెలియదు.



Responsibilities : నిర్లక్ష్యం, బాధ్యత లేకుండా ఉండటం. మనం భూమిపైన చేస్తుంది ఇదే. కానీ ఇదే పరిస్థితి పండోరా గ్రహంపై వచ్చినప్పుడు నావి జాతి ప్రజలు ఎలా ప్రవర్తించారనేది అవతార్ సినిమా చెబుతుంది. వాళ్లు ఈవా అనే చెట్టు కోసం ప్రాణాలు ఇవ్వటానికి కూడా వెనుకాడరు. అక్కడ తిరిగే జంతువులను ప్రాణభయంతో చంపాల్సినపరిస్థితి వచ్చినా విలవిలాడిపోతారు. తురుక్ మక్తో లాంటి భారీ గ్రేట్ లియోనోప్టరిక్స్ ను హ్యాండిల్ చేయాలన్నా దాన్ని అనుమతి తీసుకుని చేస్తారు. ఓ యోధుడు అనిపించుకోవాలంటే కొన్ని పరీక్షల్లో విజయం సాధించాలి. అందుకోసం కష్టపడాలి. ఈక్రమంలో ప్రకృతితో కలిసి బతకాలి. ఇలా చాలా బాధ్యతలు ఉంటాయి ప్రతీ ఒక్కరికి. మనుషులుగా మనకు కూడా ఉండేవి. ఇప్పుడు మర్చిపోయి బతికేస్తున్నాం అని చెప్పటమే కేమరూన్ ఉద్దేశ్యం.


Also Read : తెలుగులో ఈ ఏడాది (2022లో) రీమేక్ రాజాలు వీళ్ళే - హిట్టా? ఫట్టా?


ఇలా చెప్పుకుంటూ వెళ్తే అవతార్ సినిమాకు మనల్ని కనెక్ట్ చేసే పాయింట్స్ ఎన్నో. గ్రాండియర్ విజువల్స్, మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ, విజువల్ వండర్లతో నిండిపోయిన ఫ్రేమ్స్ ను దాటుకుని అంతర్లీనంగా ఉన్న ఆ లైన్ ను పట్టుకుంటే అవతార్ ను మరింత బాగా ఎక్స్ పీరియన్స్ చేయొచ్చు. అవతార్ ది వే ఆఫ్ వాటర్ చూస్తున్నప్పుడు ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి ఆ ఎమోషన్ ను మీరు కూడా క్యారీ చేయొచ్చు.