Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode మిత్ర లక్ష్మీ, పిల్లల్ని పట్టుకొని జాలీ ఫ్యామిలీ అని సంతోషంగా అందరినీ హగ్ చేసుకుంటాడు. లక్ష్మీ మనసులో మనది నిజంగా హ్యాపీ ఫ్యామిలీ కావాలి అంటే ఆ మనీషా మన మధ్య ఉండకూడదు అని లక్ష్మీ అనుకుంటుంది. ఇక మనీషా తాళి పట్టుకొని నేను ఈ ఇంట్లో ఉండటానికి మిత్రని దక్కించుకోవడానికి ఈ తాళి మాత్రమే కారణం అనుకుంటుంది.

మనీషా ఆలోచిస్తూ ఉంటే దేవయాని చూస్తుంది. మనీషా చూడకుండా కిచెన్‌లోకి వెళ్లి పాలలో మంత్ర గత్తె ఇచ్చిన మందు కలుపుతుంది. మనీషా చూసి దేవయాని దగ్గరకు వెళ్తుంది. పాలలో పసరు ఎందుకు కలిపారు అని అంటుంది. దానికి దేవయాని నా తాళి తీయించడానికి అంటుంది. మనీషా షాక్ అవుతుంది. దాంతో దేవయాని నీ తాళి కాదులే నా కోడలి తాళి నా కొడుకుతో తీయిస్తానని అంటుంది. ఈ పసరు కలిపిన పాలు ఎవరి చేతితో తాగితే వాళ్లని ఆజన్మ శత్రువుల్లా చూస్తారని దేవయాని మనీషాతో చెప్తుంది. జానుతో వివేక్‌కి ఈ పాలు తాగిస్తే వివేక్ జానుని అసహ్యించుకుంటాడు అని అంటుంది. మనీషా లక్ష్మీతో మిత్రకు తిగిస్తా నాకు కావాలి అంటుంది. 

దేవయాని జాను దగ్గరకు వెళ్లి నీ చేతితో ఈ పాలు వివేక్‌ చేత తాగించు నీకు త్వరలోనే పిల్లలు పుడతారు అని చెప్తుంది. వివేక్ రాగానే జాను మీ అమ్మ వచ్చి మనకు త్వరగా పిల్లలు పుట్టాలి అని మనకి పిల్లలు పుడితే ఆవిడకు అంతే చాలు అంట అని పాలు వివేక్‌కి ఇస్తుంది. ఇక దేవయాని, మనీషా పాలు ఇచ్చేశా వివేక్ జాను విడిపోతారు అని అనడం లక్ష్మీ వినేస్తుంది. ఇంతలో లక్ష్మీ వచ్చి వివేక్‌కి ఆ పాలు తాగొద్దని చెప్తుంది. ఆ పాలు తాగితే పిల్లలు పుట్టరు మీ ఇద్దరూ విడిపోతారు అని చెప్తుంది. ఇద్దరూ షాక్ అయిపోతారు. మిమల్ని విడగొట్టడానికి వాళ్లు పాలలో ఏదో కలిపారు అని అంటుంది. జాను అత్తని తిట్టి పాలు చల్లేయడానికి వెళ్తే ఆ పాలు మనీషా చేత దేవయాని అత్తయ్య తాగేలా చేద్దామని లక్ష్మీ అంటుంది. 

మనీషా, దేవయాని ఇద్దరూ ఏమైందా అని ఆలోచిస్తారు. ఇంతలో వివేక్ పాల గ్లాస్ తీసుకొని వస్తాడు. ఇద్దరూ పాలు తాగావా తాగావా అంటే మీకు పాల గోల ఏంటి జాను కూడా అలాగే సతాయిస్తుందని అంటాడు. ఇక పాము కాటు మందులు వేసుకో అని తల్లికి చెప్తాడు. మందులు వేసుకునే వరకు వెళ్లను అని అంటాడు. బాదం పాలు తీసుకొచ్చానని వాటితో ట్యాబ్లెట్ వేసుకో అని అంటాడు. పసరు కలిపిన పాలలో బాదం పాలు కలిపి మనీషా చేత దేవయాని తాగేలా చేస్తారు. జాను, లక్ష్మీ చాటుగా నవ్వుకుంటారు. పాలు తాగిన తర్వాత దేవయాని మనీషాని సీరియస్‌గా చూస్తుంది.  మనీషాని ఇష్టం వచ్చినట్లు తిడుతుంది. మనీషాని కొడుతుంది. మనీషా షాక్ అవుతుంది. నన్నే కొడతారా ఆంటీ అని మనీషా అంటే నువ్వు చేసిన పాపాలకు చంపేయాలి అని ఈ ఇంటికి పట్టిన దరిద్రం నువ్వు నిన్ను చంపేయాలి అని మనీషా గొంతు పట్టుకొని చితక్కొడుతుంది. ఇక మనీషా కూడా దేవయానిని కొడుతుంది. బయట నుంచి లక్ష్మీ, వివేక్, జానులు చూసి నవ్వుకుంటారు. తర్వాత మనీషా దేవయానిని గదిలో పెట్టి తాళం వేసేస్తుంది. 

లక్ష్మీ వాళ్లతో ఆంటీ నన్ను శత్రువులా చూస్తుంది అని మనీషా అంటే దానికి లక్ష్మీ ఇంకా అర్థం కాలేదా మీరు జాను, వివేక్‌లకు ఇవ్వాలి అనుకున్న పాలు మీతో తాగించా అని చెప్తుంది. నీతాళి నువ్వు విప్పుకోవడానికి రెడీగా ఉండు అని అంటుంది. ఇక పంతులు ఇంటికి వస్తారు. మృత్యుంజయ హోమం జరిపించాలని చెప్తారు. రేపు ఉదయం మిత్ర, లక్కీలు కంకణాలు కట్టుకోవాలి కఠిన ఉపవాసం ఉండాలని అంటారు. జున్ను కూడా ఉపవాసం ఉంటాను అంటాడు. ఇక లక్ష్మీ మనీషా గుట్టు రట్టు చేసి బయటకు పంపేస్తే హోమం సక్రమంగా జరుగుతుందని అనుకుంటుంది. దీంతో ఇవాళ్ట ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: చిన్ని సీరియల్: నాతో వచ్చేయ్ కావేరి మనం దూరంగా వెళ్లిపోదాం.. రాజుని కావేరి క్షమిస్తుందా!