Anant Nag in KGF 2: ‘KGF చాప్టర్‌ 2’ నుంచి అనంత్ నాగ్‌ అందుకే తప్పుకున్నారు: ప్రశాంత్ నీల్

కేజీఎఫ్-2లో ప్రకాష్ రాజ్‌ను చూసిన వెంటనే మీకు తప్పకుండా ఓ సందేహం వచ్చి ఉంటుంది. అనంత్ నాగ్ ప్లేస్‌లో ప్రకాష్ రాజ్‌ ఎందుకు కనిపించాడని అనుకుని ఉంటారు. ఇందుకు దర్శకుడు ఇచ్చిన సమాధానం ఇది.

Continues below advertisement

‘KGF చాప్టర్ 2’ ట్రైలర్ చూసినవారు తప్పకుండా ఓ పాత్రలో మార్పును గమనించే ఉంటారు. ‘KGF’ చాప్టర్-1లో కథను మొదలు పెట్టేదే ఆ పాత్ర. హీరోను గొప్పగా ఎలివేట్ చేసే ఆ సన్నివేశానికి ఆయనే ప్లస్ పాయింట్. ‘KGF చాప్టర్-2’లోనూ ఆ పాత్ర కథను కొనసాగిస్తుంది. కానీ, ఆ పాత్రలో సీనియర్ నటుడు అనంత్ నాగ్‌కు బదులు ప్రకాష్ రాజ్ కనిపించనున్నారు. కేజీఎఫ్ కథను కొనసాగించనున్నారు. ఈ చిత్రం సీక్వెల్‌లో నటించనని స్వయంగా అనంత్ నాగ్ తప్పుకున్నారట. ఈ విషయాన్ని ఆ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ వెల్లడించారు. 

Continues below advertisement

KGF మొదటి చాప్టర్ కంటే మరింత పవర్ ఫుల్ పాత్రలను రెండో చాప్టర్‌లో చూడవచ్చని తెలుస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ తారలు సంజయ్ దత్, రవీనా టాండన్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. ఇక హీరో యష్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఆయన అభిమానులు ఈ చిత్రం విడుదల గురించి వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. మరికొన్ని గంటల్లోనే ఈ చిత్రం తెరపై సందడి చేయనుంది. 

Also Read: తెలంగాణలో 'కెజియఫ్ 2' టికెట్ రేట్స్ పెరిగాయ్, రోజుకు ఐదు షోలు

ఏప్రిల్-14న విడుదలకు సిద్ధమవుతున్న ‘KGF: చాప్టర్ 2’ ప్రచారంలో భాగంగా ప్రశాంత్ నీల్ ఇటీవల మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆ సినిమాలో ఆనంద్ ఇంగాలగి పాత్ర పోషించిన అనంత్ నాగ్ స్థానంలో ప్రకాష్ రాజ్‌ ఎందుకు కనిపిస్తున్నారనే ప్రశ్నకు ప్రశాంత్ నీల్ స్పందించారు. ఆయనే స్వయంగా ఈ చిత్రం నుంచి తప్పకున్నారని, అది పూర్తిగా ఆయన వ్యక్తిగత నిర్ణయమని తెలిపారు. 

Also Read: మహేష్ ఫ్యాన్స్‌కు హ్యాపీ న్యూస్- ఒక్క పాట పూర్తైతే చాలు పండగే

‘‘ఇది పూర్తిగా ఆయన వ్యక్తిగత నిర్ణయం. ఆయన ఈ చిత్రం నుంచి నిష్క్రమించినప్పటికీ సినిమాకు న్యాయం చేశాను. సీనియర్ నటుడు వైదొలగాలని నిర్ణయించుకున్న కారణం ఏమైనప్పటికీ, నేను దానిపై వ్యాఖ్యానించను. ఆయన సీక్వెల్‌లో భాగం కాకూడదని నిర్ణయించుకున్నారు. మీరు(విలేకరులు) ఆయన నిర్ణయాన్ని గౌరవించాలి. మా ఒప్పందాలలో, నటీనటులను చివరి వరకు మాతో ఉండాలని మేము బలవంతం చేయం. ప్రతి ఒక్కరికి వారి స్వంత నిర్ణయాలు ఉంటాయి. వారందరికీ వారి స్వంత ప్రాధాన్యతలు ఉంటాయి. మా ప్రాధాన్యత మాత్రం KGF’’ అని ప్రశాంత్ నీల్ తెలిపారు. 

Continues below advertisement