Interesting Facts About Gauri Spratt Who Is Aamir Khan New Girl Friend: బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ (Aamir Khan) తన బర్త్ డే వేడుకల్లో ఇంట్రెస్టింగ్ విషయాన్ని పంచుకున్నారు. ఏడాదిన్నరగా తన స్నేహితురాలు గౌరీ స్ప్రాట్‌తో (Gauri Spratt) డేటింగ్‌లో ఉన్నట్లు వెల్లడించారు. ఆమెను మీడియాకు సైతం పరిచయం చేశారు. దీంతో ఒక్కసారిగా అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ క్రమంలోనే గౌరీ స్ప్రాట్ గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు, అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. 


అసలెవరీ గౌరీ స్ప్రాట్.. 


ప్రముఖ స్టైలిస్ట్ రీటా స్ప్రాట్ కుమార్తె గౌరీ స్ప్రాట్. వీరి కుటుంబానికి బెంగుళూరులో సెలూన్ ఉంది. ప్రస్తుతం గౌరీ అక్కడే నివసిస్తున్నారు. బ్లూ మౌంటెన్ స్కూల్‌లో విద్య అభ్యసించిన గౌరీ.. ఆ తర్వాత ఫ్యాషన్ కోర్స్ పూర్తి చేసి లండన్ యూనివర్శిటీలో ఎఫ్‌డీఏ స్టైలింగ్ అండ్ ఫోటోగ్రఫీలో ట్రైనింగ్ తీసుకున్నారు. ముంబయిలోని బీబ్లంట్ అనే సెలూన్ నడుపుతున్నారు. బీటౌన్‌ సెలబ్రిటీలంతా ఇక్కడకు వస్తుంటారు. గత కొంతకాలంగా గౌరీ ఆమిర్ ఖాన్ నిర్మాణ సంస్థలో సహాయకురాలిగా పని చేస్తున్నారు. ఆయనతో ఆమెకు 25 ఏళ్ల స్నేహం ఉంది. సుమారు 18 నెలల నుంచి వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారు.


Also Read: ఆ ఓటీటీలోకి 'బ్రహ్మా ఆనందం' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?, స్ట్రీమింగ్ డేట్ మార్చేశారుగా..


ఇంతవరకూ ఎవరికీ తెలియకుండానే..


తమ బంధం గురించి ఇప్పటివరకూ ఎలాంటి వార్తలు బయటకు రాకపోవడంపై ఆమిర్ ఖాన్ స్పందించారు. మీడియాతో చిట్ చాట్  సందర్భంగా సరదాగా చమత్కరించారు. 'నేను ఏడాదిన్నరగా ఆమెతో డేటింగ్ చేస్తున్నా ఇన్నాళ్లుగా మీకు తెలియలేదు చూశారా..?' అంటూ నవ్వుతూ కామెంట్ చేశారు. 'గౌరీ ఎక్కువ శాతం బెంగుళూరులోనే ఉంటుంది. నేనే ఆమెను కలవడానికి వెళ్తుంటా. మీడియా అటెన్షన్ అక్కడ కాస్త తక్కువ. అందువల్లే మా రిలేషన్ ఇంతవరకూ ఎవరికీ తెలియలేదు.' అని ఆమిర్ చెప్పారు.


'తన కోసం పాటలు పాడుతా'


గౌరీ కోసం తాను పాటలు పాడతానని ఆమిర్ ఖాన్ తెలిపారు. 'గౌరీ బాలీవుడ్ సినిమాలు తక్కువగా చూస్తారు. నేను నటించిన లగాన్, దంగల్, దిల్ చాహ్తాహై సినిమాలు మాత్రమే ఆమె చూశారు. నేను పాడే పాటలంటే తనకు చాలా ఇష్టం. వీలున్నప్పుడల్లా తన కోసం పాటలు పాడుతాను. నేను డైరెక్ట్ చేసిన 'తారే జమీన్ పర్' సినిమా తనకు చూపించాలనుకుంటున్నా. మా బంధాన్ని మా కుటుంబ సభ్యులు సైతం అర్థం చేసుకున్నారు. ప్రీ బర్త్ డే పార్టీలో భాగంగా ఇటీవల షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్‌కు ఆమెను పరిచయం చేశాను.' అని పేర్కొన్నారు.


పెళ్లై ఆరేళ్ల కుమారుడు


గౌరీకి గతంలోనే వివాహం జరగ్గా.. భర్త నుంచి ఆమె విడిపోయారు. ఆమెకు ఓ ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. తమ వ్యక్తిగత ప్రశాంతతకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు ఆమిర్ తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఆమె కోసం ఇప్పటికే వ్యక్తిగత భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కాగా.. గత నెల రోజులుగా సోషల్ మీడియాలో ఆమిర్ ఖాన్ డేటింగ్‌పై రూమర్లు వస్తూనే ఉన్నాయి. 2021లో ఆమిర్ ఖాన్ తన రెండో భార్య కిరణ్ రావ్‌తో వివాహ బంధానికి స్వస్తి పలికారు.