Where Is Jr NTR & Kalyan Ram Nandamuri: నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) జూనియర్ ఎక్కడ? నందమూరి కళ్యాణ్ రామ్ ఎక్కడ? ఇప్పుడు నందమూరి అభిమానులతో పాటు తెలుగు ప్రజలు, ప్రేక్షకులలో ఈ ప్రశ్నలు మొదలు అవుతున్నాయి. అందుకు కారణం వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో మొదలైన కొత్త సినిమా.
హరికృష్ణ మనవడి సినిమా...అబ్బాయిలు ట్వీట్ కూడా చేయలే!ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎన్టీఆర్ కుటుంబంలోని నాలుగో తరం అడుగు పెడుతోంది. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు తర్వాత ఆయన కుమారులు తెలుగు చిత్రసీమలో అడుగు పెట్టారు. తండ్రి వారసత్వాన్ని విజయవంతంగా ముందుకు తీసుకు వెళుతున్నారు.
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా అగ్రస్థానానికి చేరుకుంటే... హరికృష్ణ కొన్ని సినిమాలు చేశారు. హరికృష్ణ కుమారుడు ఎన్టీఆర్ జూనియర్ తెలుగులో మాత్రమే కాదు... హిందీలోనూ అడుగు పెట్టి సినిమాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ సోదరుడు, హరికృష్ణ మరో తనయుడు కళ్యాణ్ రామ్ డిఫరెంట్ సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ కుటుంబంలోని నాలుగో తరం... హరికృష్ణ తనయుడు, దివంగత జానకిరామ్ తనయుడు (ఎన్టీఆర్) హీరోగా వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో కొత్త సినిమా మొదలైంది.
హరికృష్ణ మనవడి సినిమా ప్రారంభోత్సవం జరిగితే హరికృష్ణ కుమారులు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఒక్క ట్వీట్ చేయకపోవడం చర్చనీయాంశం అవుతుంది. ఇప్పుడు వాళ్లిద్దరూ ఎక్కడ? అని చర్చ మొదలైంది. ఎన్టీఆర్ అయితే లండన్‌లో ఉన్నారు. 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' మ్యూజికల్ కాన్సర్ట్ కోసం వెళ్లారు. లండన్ వెళ్లారు కనుక ఎన్టీఆర్ జూనియర్ అటెండ్ కావడం వీలు పడలేదని అనుకున్నా... కళ్యాణ్ రామ్ ఎక్కడ? ఆయన ఎందుకు అటెండ్ కాలేదు? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో అభిమానుల నుంచి వస్తున్నాయి. ఇద్దరూ అటెండ్ కాలేదు కనీసం ఒక్క ట్వీట్ కూడా చేయలేరా? అనే ప్రశ్నలు మొదలు అవుతున్నాయి.
ముందుగా వెల్కమ్ చెప్పిన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్!హరికృష్ణ మనవడి సినిమా ప్రారంభోత్సవం రోజున ఎన్టీఆర్ కుమార్తెలు అటెండ్ అయ్యారు. నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ ట్వీట్స్ చేశారు. అయితే హరన్న మనవడి పక్కన హరికృష్ణ కుమారులు కనిపించలేదు. కనీసం ట్వీట్ కూడా చేయలేదని చాలా మంది వేలెత్తి చూపిస్తున్నారు. అయితే జానకిరామ్ కుమారుడిని సినిమా ఇండస్ట్రీకి వెల్కమ్ చెబుతూ ఎప్పుడో ట్వీట్లు చేశారు. కానీ ఇప్పుడు ట్వీట్స్ చేయకపోవడం డిస్కషన్ పాయింట్ అయ్యింది.