Pawan Kalyan's OG Movie Shooting Resume: పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు ఇది నిజంగా పూనకాలు తెప్పించే న్యూస్. పవన్ కల్యాణ్ అవెయిటెడ్ మూవీస్‌లో ఒకటైన 'ఓజీ' మూవీ మళ్లీ ప్రారంభమైంది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ సోషల్ మీడియాలో అధికారికంగా వెల్లడించింది. 'మళ్లీ మొదలైంది.. ఈసారి ముగిద్దాం.' అంటూ పోస్ట్ చేసింది.

పవన్ జాయిన్ అయ్యేది ఎప్పుడు?

'సాహో' ఫేం సుజీత్ (Sujjeth) ఈ మూవీకి దర్శకత్వం వహిస్తుండగా ఇప్పటికే కొంత భాగం షూటింగ్ జరిగింది. అయితే, ఆ తర్వాత పవన్ బిజీగా మారడంతో షూటింగ్‌కు బ్రేక్ పడింది. పవన్ లేకుండా కొన్ని రోజులు షూటింగ్ పూర్తి చేశారు. తాజాగా.. మళ్లీ షూటింగ్ ప్రారంభమైందని తెలుస్తోంది. ఈ వారమే ఈ మూవీ సెట్స్‌లో పవన్ జాయిన్ అవుతారనే టాక్ వినిపిస్తోంది.

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై దానయ్య 'ఓజీ' మూవీని నిర్మిస్తుండగా.. ముంబయి మాఫియా నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్‌గా కనిపించనున్నారు. పవన్ సరసన ప్రియాంక్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ నెగిటివ్ రోల్ చేస్తుండగా.. శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్, గ్లింప్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.

కీలక సీన్స్ షూటింగ్

హీరో, విలన్ మధ్య కీలక సీన్స్ షూట్ చేయాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. వీటిని త్వరలోనే పూర్తి చేసి రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన ప్రజా పాలనలో బిజీగా మారారు. దొరికిన కొద్ది టైంలోనే తాను ముందే ఫిక్స్ అయిన సినిమాలు పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవలే 'హరిహర వీరమల్లు' మూవీ షూటింగ్ ఇటీవలే పూర్తి చేశారు. ఇప్పుడు తాజాగా 'ఓజీ' మూవీని సైతం పూర్తి చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ ఎలక్షన్ ప్రచారంలో పాల్గొన్నప్పుడు, పలు సందర్భాల్లో బహిరంగ సభల్లోనూ ఓజీ, ఓజీ అంటూ ఫ్యాన్స్ నినాదాలు చేశారు. దీనిపై పవన్ సున్నితంగా వారిని మందలించేవారు. ఇప్పుడు మళ్లీ షూటింగ్ తిరిగి ప్రారంభం కావడంతో వారిలో జోష్ నెలకొంది. 

Also Read: యాక్టింగ్ మానేసి ఇడ్లీలు అమ్ముకోమన్నారు - హోటల్ బిజినెస్ వల్లే ఈ స్థాయికి వచ్చానన్న బాలీవుడ్ హీరో

మరోవైపు.. పవన్ కల్యాణ్ పీరియాడిక్ అడ్వెంచరస్ మూవీ 'హరిహర వీరమల్లు' షూటింగ్ సైతం ఇటీవలే పూర్తైంది. ఇప్పటికే రీ రికార్డింగ్, డబ్బింగ్ పనులు శరవేగంగా సాగుతుండగా.. త్వరలోనే బ్లాక్ బస్టర్ సాంగ్స్, అదిరిపోయే ట్రైలర్ విడుదలవుతాయని నిర్మాత ఎ.ఎం రత్నం తెలిపారు. ఈ మూవీ రిలీజ్ కోసం కూడా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.