Suniel Shetty About His First Movie Experience: కెరీర్ తొలినాళ్లలో ఓ వ్యక్తి తనను ఇడ్లీలు అమ్ముకోవాలంటూ ఎంతో విమర్శించాడని బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి తెలిపారు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో ఆయనకు ఎదురైన అనుభవాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

'యాక్టింగ్ మానేసి ఇడ్లీలు అమ్ముకోమన్నారు'

తాను నటించిన 'బల్వాన్' రిలీజ్ అయినప్పుడు ఓ వ్యక్తి తనను తీవ్రంగా విమర్శించాడని.. ఆ మాటలకు తాను బాధ పడలేదని సునీల్ శెట్టి చెప్పారు. హోటల్ బిజినెస్ వల్లే తాను ఈ స్థాయికి ఎదిగానంటూ గుర్తు చేసుకున్నారు. '1992లో నా ఫస్ట్ మూవీ 'బల్వాన్' రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం అందుకుంది. ఆ రోజుల్లో మూవీ రివ్యూస్ రాసే వారు చాలా తక్కువ మందే ఉండేవారు. ఓ సీనియర్ మూవీ రివ్యూయర్ మా సినిమా గురించి రివ్యూ రాశారు. సినిమా చాలా బాగుంది కానీ హీరో యాక్టింగ్ దారుణంగా ఉందని అన్నారు.

ఆ హీరోకి యాక్టింగ్ కూడా తెలియదు. స్క్రీన్‌పై అలా నిల్చొని ఉండిపోయాడు. ఇలాంటి వాళ్లు మూవీస్‌లో ఉండడం కంటే రెస్టారెంట్లలో ఇడ్లీ, వడ అమ్ముకోవడం మంచిది అని రాసిన రివ్యూలో పేర్కొన్నాడు. నన్ను అవమానించానని అతను అనుకోవచ్చు. నిజం చెప్పాలంటే ఆ ఇడ్లీ వడ అమ్ముకోవడం వల్లే మా జీవనం సాఫీగా సాగింది.' అని తెలిపారు.

Also Read: నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో - యంగ్ చాప్ ఎన్టీఆర్ కొత్త మూవీ స్టార్ట్

కిచెన్ లో వర్క్ చేసేవాడిని

తమ హోటల్ బిజినెస్ వల్లే తాను, తన సోదరీమణులు చదువుకున్నామని.. మిగిలిన వారితో పోలిస్తే తన కుటుంబం మంచి స్థితికి వచ్చిందని  సునీల్ శెట్టి తెలిపారు. '35 ఏళ్లైనా నేను ఇండస్ట్రీలో రాణిస్తున్నానంటే దానికి కారణం నా రెస్టారెంట్. మా హోటల్‌లో నేను అన్నీ పనులు చేసేవాడిని. టేబుల్స్ క్లీన్ చేసేవాడిని. కౌంటర్ పనులు చూసుకునేవాడిని. కిచెన్‌లో వర్క్ చేసేవాడిని. అయితే, అదేమీ పెద్ద విషయం కాదు. ఆ రోజుల్లో నేను అలా ఉండేవాడిని. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నా.' అని తెలిపారు.

సునీల్ శెట్టి (Suniel Shetty) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'కేసరి వీర్' (Kesari Veer) ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలుత ఈ నెల 16నే రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించినా అనివార్య కారణాలతో వాయిదా పడింది. ఈ మూవీకి ప్రిన్స్ ధీమాన్, కనుభాయ్ చౌహాన్ దర్శకత్వం వహించగా.. సూపర్ పంచోలి, వివేక్ ఒబెరాయ్, ఆకాంక్ష శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. చౌహాన్ స్టూడియోస్, మనోరమ స్టూడియోస్ బ్యానర్‌పై మూవీని రూపొందించారు. ఈ మూవీతో పాటే 'వెల్కమ్ టు ది జంగిల్' మూవీ కోసం కూడా సునీల్ శెట్టి వర్క్ చేస్తున్నారు. బాలీవుడ్‌తో పాటు తెలుగులోనూ పలు మూవీస్‌లో నటించారు. మోసగాళ్లు, గని సినిమాల్లో తన నటనతో మెప్పించారు.