తేజస్వి మదివాడ (Tejaswi Madivada)... 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో సమంత చెల్లెలుగా కనిపించారు. రామ్ గోపాల్ వర్మ 'ఐస్ క్రీమ్'లో కథానాయికగా నటించారు. ఎప్పుడూ వైవిధ్యమైన పాత్రలు చేయడానికి ఆసక్తి చూపించారు. ఈ నెల 19న థియేటర్లలో విడుదలకు సిద్ధమైన 'కమిట్‌మెంట్' సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇప్పటికీ తాను అప్ కమింగ్ ఆర్టిస్ట్ అని తేజస్వి అంటున్నారు. సినిమా విడుదల సందర్భంగా మేనేజర్లపై ఆమె షాకింగ్ కామెంట్స్ చేశారు.
సినిమా ఇండస్ట్రీలో పరిస్థితుల గురించి తేజస్వి మాట్లాడుతూ ''ఏ ఇండస్ట్రీలో అయినా అమ్మాయిలకు తప్పదు. సినిమా ఇండస్ట్రీని బద్నామ్ చేయవద్దు అనేది మా సినిమాలో మెసేజ్. చిన్నప్పుడు, నాకు ఏమీ తెలియనప్పుడు అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో మేనేజర్ల మాటలు వింటుంటే షాక్ అయిపోయేదాన్ని. ఎలా రియాక్ట్ అవ్వాలనేది అర్థం అయ్యేది కాదు'' అని చెప్పారు. 'కమిట్‌మెంట్' సినిమాలో తాను అప్ కమింగ్ ఆర్టిస్ట్ రోల్ చేశానని తెలిపారు. నాలుగు కథల సమాహారంగా సినిమా రూపొందింది. అందులో తేజస్వి ఒక కథలో నటించారు.
నాకు ఇండస్ట్రీ ఫుడ్ పెట్టింది!
ఇంకా తేజస్వి మాట్లాడుతూ ''నేను సినిమా ఇండస్ట్రీని బద్నామ్ చేయదలచుకోలేదు. ఎందుకంటే... నాకు ఫుడ్డు పెట్టింది. నేను ఈ స్థాయికి రావడానికి కారణం తెలుగు సినిమా కారణం. అలాగని, తెలుగు ఇండస్ట్రీలో బ్యాడ్ సైడ్ లేదని చెప్పడం లేదు. ప్రతి ఇండస్ట్రీలో గుడ్ అండ్ బ్యాడ్ ఉంటుంది. అది సినిమా ఇండస్ట్రీ కావచ్చు. ఆసుపత్రిలో, మీడియా రంగంలో కావచ్చు'' అని అన్నారు. ఇండస్ట్రీలో తనను కమిట్‌మెంట్ అడగడానికి చాలా మంది భయపడేవాళ్లు అని ఆమె వ్యాఖ్యానించారు. తనను ఎవరూ కమిట్‌మెంట్ అడగలేదన్నారు. అందుకే, మంచి పెర్ఫార్మన్స్ వచ్చిందన్నారు.
థియేటర్లలో సినిమాను విడుదల చేయాలని తమ నిర్మాత పట్టుదలతో ఉన్నారని, ఓటీటీ నుంచి ఆఫర్లు వచ్చినా ఇవ్వలేదని, అందుకే సినిమా విడుదల ఆలస్యమైందని ఆమె తెలిపారు.
ఇప్పుడు ఎందుకు ఆ ప్రశ్న?
గతంలో చెల్లి పాత్రలు వేసి, ఇప్పుడు అడల్ట్ కంటెంట్ రోల్స్ చేయడం వెనుక అవకాశాలు లేకపోవడమేనా? అని ఒకరు ప్రశ్నించగా... ''మన జీవితంలో అడల్ట్ కంటెంట్ ఉంటుంది. అటువంటి కంటెంట్ చేయడంలో తప్పేముంది నేను అవకాశాలు ఉన్నప్పుడూ చేశానుగా... 'ఐస్ క్రీమ్' సినిమా చేశా. ఇప్పుడూ చేస్తున్నా'' అని తేజస్వి సమాధానం ఇచ్చారు. తాను ఇన్నోసెంట్ రోల్స్ చేస్తే ఎవరూ చూడటం లేదని ఆమె చెబుతున్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టమని చెప్పినందుకు పెళ్లి చేసుకోలేదన్నారు.
Also Read : ఆమిర్‌పై కోపం హృతిక్ రోషన్ మీదకు - ఒక్క ట్వీట్ ఎంత పని చేసిందో చూశారా?
Anveshi Jain plays sexologist in Commitment movie : రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాలో 'నా పేరు సీసా' పాటలో డ్యాన్స్ చేసిన అన్వేషి జైన్ ఉన్నారు కదా! 'కమిట్‌మెంట్' సినిమాలో ఆమె సెక్సాలజిస్ట్ రోల్ చేసినట్లు తేజస్వి తెలిపారు. ఆసుపత్రి నేపథ్యంలో ఆమె కథ ఉంటుందని అన్నారు. ఇంకా సినిమాలో రమ్యా పసుపులేటి, అమిత్ తదితరులు నటించారు. లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వం వహించారు.