నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ 'బింబిసార' (Bimbisara Movie) సినిమాను ఇటీవల నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) శనివారం చూశారు. సినిమా బావుందంటూ అబ్బాయ్‌ను మెచ్చుకున్నారు. దర్శకుడు వశిష్ఠ, చిత్ర బృందాన్ని ప్రశంసించారు. కొత్తవారికి ఇటువంటి భారీ అవకాశాలు ఇచ్చిన ఘనత తమ నందమూరి వంశానిదే అన్నారు.
హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో బాలకృష్ణ 'బింబిసార' చిత్రాన్ని వీక్షించారు. అనంతరం ''బావుందయ్యా... బ్రహ్మాండం! వెరీ గుడ్!'' అంటూ అబ్బాయ్ కళ్యాణ్ రామ్‌ను మెచ్చుకున్నారు. ఆత్మీయంగా కౌగిలించుకున్నారు. ఆ తర్వాత బాలకృష్ణ మాట్లాడుతూ ''బింబిసార' సినిమా అద్భుతంగా ఉంది. హ్యాట్సాఫ్. ఇటువంటి మంచి సినిమాలు ఇంకా ఇంకా అందివ్వాలని నందమూరి కళ్యాణ్ రామ్‌ను దీవిస్తున్నాను. బాబాయ్‌గా నా కోరిక అది. ముందుగా హరికృష్ణ అన్నయ్య గారి దీవెనలు కూడా ఉంటాయి'' అని అన్నారు.
Balakrishna Wants To Do A Film With Bimbisara Movie Director Vassishta : దర్శకుడు వశిష్ఠ బాగా చేశాడని బాలకృష్ణ మెచ్చుకున్నారు. అతనితో ''త్వరలో మనం సినిమా చేద్దాం'' అంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. ప్రతిభావంతులైన యువతరం సినిమాల్లోకి రావాలని, ఇటువంటి భారీ సినిమాలు తీయాలని బాలకృష్ణ ఆకాంక్షించారు.
సినిమాల్లో కొత్త వరవడి నందమూరి తారక రామారావుతో ప్రారంభమైందని బాలకృష్ణ తెలిపారు. ''ముందు ఒకట్రెండు చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ చేసుకుంటూ ముందుకు వెళ్లడం పద్ధతి. అలా కాకుండా వశిష్ఠ ఒకేసారి భారీ సినిమా తీశాడు. కొత్త వాళ్ళకు ఇటువంటి అవకాశాలు ఇచ్చిన ఘనత ఒక్క నందమూరి వంశానికి దక్కుతుంది. కొత్త సినిమాల వరవడి రామారావు గారితో ప్రారంభం అయ్యింది. ఆయనతోనే ఏదైనా ప్రారంభమైంది. ఏదైనా మాతో ప్రారంభం కావాల్సిందే. అప్పుడు కూడా నాన్నగారు ఎన్నో ప్రయోగాత్మక సినిమాలు చేశారు. వాటన్నిటినీ ప్రేక్షకులు ఆదరించారు. ఇప్పుడు ఈ సినిమాను ఆదరిస్తున్నారు. మంచి సినిమాలు వస్తే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి నిరూపించుకున్నారు. సినిమాను అందరూ చూడండి. సినిమాను సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులకు నా ధన్యవాదాలు. మా వాళ్ళకు నా అభినందనలు'' అని బాలకృష్ణ అన్నారు.
'బింబిసార' ప్రయోగాత్మక చిత్రమే కాదని... ఇందులో నిజాలు ఉన్నాయని బాలకృష్ణ తెలిపారు. భావితరాలకు కూడా ఈ సినిమాలో మంచి సందేశం ఉందని ఆయన అన్నారు.
Also Read : సంక్రాంతి బరిలో నందమూరి బాలకృష్ణ?
బాలకృష్ణతో పాటు ఆయన కుమారుడు మోక్షజ్ఞ కూడా సినిమా చూడటానికి వచ్చారు. పురందేశ్వరి, ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు, హరికృష్ణ కుమార్తె - కళ్యాణ్ రామ్ సోదరి సుహాసిని సహా పలువురు నందమూరి కుటుంబ సభ్యులు సినిమాను ప్రత్యేక ప్రదర్శనను వీక్షించారు.
బాలకృష్ణకు 'బింబిసార' దర్శకుడు వశిష్ఠ థాంక్స్ చెప్పారు. తన కల నిజమైందని, తాను దేవుడిగా కొలిచే అభిమాన కథానాయకుడు, నట సింహం నుంచి ప్రశంసలు రావడం ఎంతో సంతోషంగా ఉందని, జీవిత కాలం ఈ జ్ఞాపకాన్ని గుర్తు ఉంచుకుంటానని ఆయన ట్వీట్ చేశారు.
Also Read : హాలీవుడ్ హీరోలతో పోటీ - ఎన్టీఆర్‌కు ఆస్కార్?