నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. ఇందులో శ్రుతీ హాసన్ (Shruti Hassan) కథానాయికగా నటిస్తున్నారు. బాలకృష్ణ 107వ చిత్రమిది. ఇంకా టైటిల్ కన్ఫర్మ్ చేయకపోవడంతో వర్కింగ్ టైటిల్ NBK107 అని ఫిల్మ్ యూనిట్, ఫ్యాన్స్ పిలుస్తున్నారు.

Continues below advertisement


Nandamuri Balakrishna 107 movie will release in theatres On 2023 Sankranti : లేటెస్ట్ అప్‌డేట్‌ ఏంటంటే... సంక్రాంతి బరిలో బాలకృష్ణ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట (NBK107 Release Latest Release Date). తొలుత ఈ ఏడాది విజయదశమికి విడుదల చేయాలని భావించినా... సంక్రాంతి అయితే బెస్ట్ అనుకుంటున్నారట. 


ఆల్రెడీ సంక్రాంతి బరిలో చిరంజీవి, ప్రభాస్!
ఆల్రెడీ సంక్రాంతి బరిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఒకటి... మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా, మాస్ మహారాజ రవితేజ ముఖ్యమైన పాత్రలో దర్శకుడు కె.ఎస్. రవీంద్ర తెరకెక్కిస్తున్న సినిమా (Mega154). దీనికి 'వాల్తేరు వీరయ్య' టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. సంక్రాంతికి విడుదల అన్నారు కానీ... ఇంకా డేట్ అనౌన్స్ చేయలేదు. ఇంకో సినిమా... యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, రామాయణం ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రూపొందిస్తున్న 'ఆదిపురుష్' (Adipurush). జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ రెండు సినిమాలకు తోడు ఇప్పుడు మరో సినిమా వచ్చి చేరింది. అయితే... చిరంజీవి సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని టాక్. 


మెగా154 వాయిదా పడుతుందా?
బాలకృష్ణ సినిమా సంక్రాంతికి వస్తే... చిరంజీవి సినిమా వెనక్కి వెళ్లే అవకాశాలు ఉన్నాయనేది ఫిల్మ్ నగర్ గుసగుస. ఎందుకంటే... రెండు సినిమాలూ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో రూపొందుతున్నాయి. బాక్సాఫీస్ బరిలో రెండు సినిమాలను ఒకేసారి విడుదల చేయడానికి నిర్మాతలు రెడీగా లేరట.


తొలుత బాలకృష్ణ సినిమాను విజయదశమికి అనుకున్నారు. దసరాకు చిరంజీవి 'గాడ్ ఫాదర్'ను విడుదల కావడం దాదాపు ఖాయమే. ఇప్పుడు బాలకృష్ణ సినిమా వెనక్కి వెళ్ళింది. అందుకని, సంక్రాంతి నుంచి మెగా154 సినిమా తప్పుకోవచ్చని  ఇండస్ట్రీ గుసగుస.


మూడు టైటిల్స్‌లో బాలకృష్ణ ఓటు దేనికి?
NBK107 చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. 'జై బాలయ్య', 'అన్న గారు', 'రెడ్డి గారు' టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయట. ఈ మూడింటిలో బాలకృష్ణ దేనికి ఓటు వేస్తే... దాన్ని అధికారికంగా వెల్లడించాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారని టాక్.  


ఈ సినిమాలో మలయాళ హీరోయిన్ హానీ రోజ్ కూడా నటిస్తున్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర చేస్తున్నారు. మోడల్ కమ్ హీరోయిన్, 'చీకటి గదిలో చితకొట్టుడు' ఫేమ్ చంద్రికా రవి ప్రత్యేక గీతంలో స్టెప్పులు వేశారు. 


Also Read : హాలీవుడ్ హీరోలతో పోటీ - ఎన్టీఆర్‌కు ఆస్కార్?


మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై NBK 107 తెరకెక్కుతోంది. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మాతలు. ముసలి మడుగు ప్రతాప్ రెడ్డి పాత్రలో కన్నడ స్టార్ దునియా విజయ్ విలన్ రోల్ చేస్తున్నారు. ఇంకా లాల్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావు తదితరులు ప్రధాన పాత్రలు చేస్తున్నారు.


Also Read : ఇప్పుడు కుమారి ఒంటరే - బాయ్‌ఫ్రెండ్‌తో ఆ సినిమా విడుదలకు ముందు...