Adipurush Movie: ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణ ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘ఆదిపురుష్’. ఈ మూవీలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించగా సీత పాత్రలో కృతి సనన్ కనిపించింది. జూన్ 16 ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయిందనే చెప్పాలి. మొదటి రోజు మాత్రం ఊహించని కలెక్షన్లు అందుకుంది. తర్వాత సినిమాలో కొన్ని లోపాలతో నెగిటివ్ టాక్ క్రియేట్ అయింది. గత కొన్ని రోజులుగా ఈ సినిమాలోని లుక్స్, గ్రాఫిక్స్, స్క్రీన్ ప్లే వంటి అంశాల్లో విమర్శలు వస్తూనే ఉన్నాయి. మూవీలో డైలాగ్ ల పై నిరసనలు కూడా వెల్లువెత్తాయి. బహుశా ఇంతటి నెగిటివిటీ క్రియేట్ అవుతుందని మేకర్స్ కూడా ఊహించి ఉండరు. అయితే ఈ సినిమాను రెండు పార్ట్ లుగా తీయాలనుకున్నాడట దర్శకుడు. ఈ విషయంపై ప్రభాస్ తో కూడా చర్చలు జరిపాడట. ఇప్పుడీ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 


రెండు పార్ట్ లుగా ‘ఆదిపురుష్’.. నో చెప్పిన ప్రభాస్..


‘ఆదిపురుష్’ సినిమా పేరు అనౌన్స్ చేసిని దగ్గర నుంచీ ఈ సినిమాపై విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా గ్రాఫిక్స్ వర్స్క్ పై ప్రేక్షకులు మండిపడుతున్నారు. సినిమా విడుదల అయ్యాక ఈ విమర్శలు బాగా ఎక్కువైయ్యాయి. అసలు ఈ సినిమాను రెండు పార్ట్ లుగా తీయాలని అనుకున్నాడట ఓం రౌత్. ఈ మేరకు ప్రభాస్ తో కూడా చర్చలు జరిపాడట. కానీ ప్రభాస్ దానికి అసలు ఒప్పుకోలేదట. ‘ఆదిపురుష్’ లాంటి సినిమాలు రెండు పార్ట్ లుగా వర్కౌట్ అవ్వదని చెప్పాడట. ఇదే విషయాన్ని మేకర్స్ కు చెప్పి ఒప్పించాడట ప్రభాస్. దీంతో మేకర్స్ సీక్వెల్స్ చేయాలన్న ఆలోచనను విరమించుకొని సింగిల్ పార్ట్ లో మూవీను రిలీజ్ చేశారు.  


రెండు పార్ట్ లుగా వచ్చి ఉంటే?


‘ఆదిపురుష్’ సినిమాపై మేకర్స్ చాలా శ్రమే పెట్టారు. మూవీను ఎలాగైనా చరిత్రలో నిలిచిపోయే విధంగా తెరకెక్కించాలని చాలా కష్టపడ్డారు. దీంతో మూవీ చిత్రీకరణ పూర్తయ్యేటప్పటికి సినిమా నిడివి దాదాపు నాలుగు గంటలు వచ్చిందట. దీంతో సినిమాను రెండు పార్ట్ లుగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట మేకర్స్. కానీ దానికి ప్రభాస్ ఒప్పుకోకపోవడంతో ఆగిపోయారు. ఇప్పటికే ఈ సినిమా పూర్తిగా నెగిటివిటీను మూటకట్టుకుంది. ఇక రెండు పార్ట్ లుగా విడుదల చేసి ఉంటే నిర్మాతలు భారీగా నష్టపోయేవారని ఫిల్మ్ వర్గాల్లో టాక్. ప్రభాస్ నో చెప్పడం వలన పెద్ద ప్రమాదమే తప్పిందని చర్చించుకుంటున్నారు.


వీకెండ్ లో అయినా పెరుగుతాయా?


‘ఆదిపురుష్’ సినిమా భారీ అంచనాల మధ్య విడుదల అయింది. మొదటి రోజు ఊహించని కలెక్షన్లు వచ్చాయి. తర్వాత రోజు నుంచి కలెక్షన్లు భారీగా పడిపోయాయి. సినిమాపై వచ్చిన నెగిటివిటీ ప్రభావం మూవీ కలెక్షన్ల పై పడింది. దాదాపు 500 కోట్ల రూపాయలకు పైగానే బడ్జెట్ తో సినిమా రూపొందింది. ఇప్పటివరకూ సుమారు రూ.400 కోట్లకు పైగానే కలెక్షన్లు వచ్చాయి. కలెక్షన్లను పెంచేందుకు టికెట్ రేటును కూడా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు మేకర్స్. ఇక ఈ వారం పెద్ద సినిమాలు ఏమీ రిలీజ్ కానందున వీకెండ్ అయినా ‘ఆదిపురుష్’ కలెక్షన్లు పెరుగుతాయోమో చూడాలి.


Also Read: ఇటలీలో ప్రభాస్‌కు విల్లా? దాని అద్దెతో జీవితాంతం బతికేయొచ్చట!