Just In





Horror Movie Telugu: రాత్రి 8 తర్వాత భవాని వార్డులో అడుగు పెడితే... మనుషుల్ని పీక్కు తినే దెయ్యాల కథ చూస్తారా?
హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఎన్నో చూసి ఉంటారు. అయితే... ఆత్మ మనిషి బాడీలోకి ప్రవేశించిన తర్వాత మనుషుల్ని పీక్కుతినే దెయ్యం కథలను ఎప్పుడైనా చూశారా? ఈ శుక్రవారం అటువంటి కథ ఈ వారం వస్తోంది.

Telugu Horror Movie Bhavani Ward 1997 Release Date: డిఫరెంట్ హారర్ సినిమాలు చూసుంటారు. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు కూడా చూసి ఉంటారు. హాలీవుడ్‌లో మ్యాన్ ఈటర్ ఫిలిమ్స్ చూసుంటారు. అయితే, మనుషుల్ని పీక్కుతినే దెయ్యాల కథను చూశారా? ఈ వారం థియేటర్లలోకి రానుంది.
రాత్రి ఎనిమిది తర్వాత భవాని వార్డులో అడుగు పెడితే?
ఫిబ్రవరి 7న థియేటర్లలోకి వస్తున్న హారర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ 'భవాని వార్డ్ 1997' (Bhavani Ward 1997). జీడీ నరసింహా దర్శకత్వం వహించడంతో పాటు జీడీఆర్ మోషన్ పిక్చర్, విభూ మీడియా సమర్పణలో చంద్రకాంత సోలంకితో కలిసి ప్రొడ్యూస్ చేశారు. ఇందులో గాయత్రీ గుప్తా, గణేష్ రెడ్డి, పూజా కేంద్రే, సాయి సతీష్, 'జబర్దస్త్' అప్పారావు, ఈశ్వర్ బాబు ధూళిపూడి ప్రధాన తారాగణం. ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా నిర్వహించడంతో పాటు ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజ్ కందుకూరి ట్రైలర్ విడుదల చేశారు.
'భవాని వార్డ్' ట్రైలర్ చూస్తే... హారర్ సినిమా అని అర్థం అవుతుంది. అనగనగా ఒక ఆస్పత్రి. అందులో భవాని వార్డ్ ఉంది. రాత్రి ఎనిమిది గంటల తర్వాత అందులో ఎవరూ అడుగు పెట్టారు. ఎందుకంటే... భవాని వార్డులో దెయ్యం ఉందని అక్కడి జనాల నమ్మకం. అయితే... ఒక డాక్టర్ పేషెంట్‌ను తీసుకుని వెళుతుంది. ఆ తర్వాత ఏమైంది? అనేది సినిమాగా తెలుస్తోంది. ట్రైలర్ చివర్లో ఫ్లోర్ మీద పడి ఉన్న బాడీని దెయ్యం (లేదా శరీరంలోకి ఆత్మ చేరిన మనిషి) పీక్కుని తినడం చూస్తుంటే ఒళ్ళు జలదరించడం ఖాయం.
ట్రైలర్ విడుదల చేసిన ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ... ''ఈ సినిమా టైటిల్ పోస్టర్ నేనే విడుదల చేశా. ఇప్పుడీ ఈవెంట్‌కు వస్తే రిలీజ్ టైం దగ్గర పడటంతో టీం అంతా ఎంత టెన్షన్‌లో ఉన్నారో, ఎంతో కష్టపడి సినిమా చేశారో అర్థం అవుతోంది. ఇప్పుడు కంటెంట్ ఉన్న సినిమాలే హిట్ అవుతున్నాయి. ఇందులో కంటెంట్ ఉందని నేను నమ్ముతున్నా. సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను'' అని అన్నారు. హారర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు అందరికీ మా 'భవాని వార్డ్ 1997' నచ్చుతుందని దర్శకుడు జి.డి. నరసింహా అన్నారు. ఈ కార్యక్రమంలో గణేష్ రెడ్డి, పూజా కేంద్రే, పర్వతనేని రాంబాబు, సాయి సతీష్, సంగీత దర్శకుడు నిస్సి జస్టిన్, కెమెరామెన్ అరవింద్ తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 7న నాగ చైతన్య 'తండేల్'తో పాటు సాయి రామ్ శంకర్ 'ఒక పథకం ప్రకారం' సినిమాలు విడుదల కానున్నాయి. పెద్ద సినిమాల మధ్య వచ్చినా సరే... తమ సినిమాకు జనాలు వస్తారని నమ్మకంగా ఉంది 'భవాని వార్డ్ 1997' టీం.