హెబ్బా పటేల్ (Hebah Patel) పేరు చెబితే తెలుగు ప్రేక్షకులకు 'కుమారి 21ఎఫ్' గుర్తుకు వస్తుంది. ఆ సినిమా ఇంపాక్ట్ అటువంటిది. 'కుమారి 21ఎఫ్' తర్వాత హెబ్బాకు గ్లామర్ రోల్స్ ఎక్కువ వచ్చాయి. అయితే, ఓటీటీలో ఆమెకు గ్లామర్ కాకుండా పెర్ఫార్మన్స్ స్కోప్ ఉన్న రోల్స్ లభిస్తున్నాయి. అందుకు, ఉదాహరణ 'ఓదెల రైల్వే స్టేషన్' సినిమా. ఇప్పుడు 'వ్యవస్థ' వెబ్ సిరీస్ (Vyavastha web series)! కథలు, కథా నేపథ్యాలు వేరు అయినప్పటికీ... రెండు ప్రాజెక్టుల్లో రోల్స్ ఒకే తరహావి కావడం గమనార్హం.
హెబ్బా భర్తను చంపడం గ్యారెంటీ!?
Hebah Patel Role In Vyavastha Web Series : 'వ్యవస్థ' వెబ్ సిరీస్ ప్రచార చిత్రాలు చూస్తే... యామిని పాత్రలో హెబ్బా పటేల్ నటించారు. భర్తను హత్య చేసిన నేరం మీద ఆమెను అరెస్ట్ చేస్తారు. జైలులో ఉన్నప్పుడు తనను కలవడానికి వచ్చిన వ్యక్తితో ''నేను నీకు క్లియర్ గా చెబుతున్నా... అజయ్ ను కాల్చింది నేనే'' అని హెబ్బా పటేల్ చెప్పడం గమనించవచ్చు.
Also Read : వైఎస్ జగన్ కథను తప్పకుండా చెబుతా - దర్శకుడు మహి వి రాఘవ్
ఒక్కసారి వెనక్కి వెళ్ళి 'ఓదెల రైల్వే స్టేషన్' సినిమా గుర్తు చేసుకోండి. ఎండింగులో భర్తను హెబ్బా పటేల్ చంపేస్తారు. ఇప్పుడీ వెబ్ సిరీస్ విషయానికి వస్తే... భర్తను చంపి జైలుకు వెళ్లిన మహిళగా కనిపించారు. రెండిటికి లింక్ లేదు గానీ ఒకవేళ లింక్ చేస్తే హెబ్బా ఓటీటీ యూనివర్స్ అవుతుంది. 'మనకి సహాయం చేసే వాళ్ళకి, సహాయం చేస్తునట్టు నటించే వాళ్ళకి చాలా తేడా ఉంటుంది' అని హెబ్బా పటేల్ చెప్పే డైలాగ్ బావుంది.
ఇది ఆనంద్ రంగా న్యాయ 'వ్యవస్థ'
'వ్యవస్థ' వెబ్ సిరీస్ (Vyavastha On Zee5)కి ఆనంద్ రంగా దర్శకత్వం వహించారు. ఇందులో హెబ్బా పటేల్ కాకుండా కార్తీక్ రత్నం (Karthik Rathnam), సంపత్ రాజ్ (Sampath Raj) ప్రధాన పాత్రలు పోషించారు. జీ 5 ఓటీటీ కోసం ఎక్స్‌క్లూజివ్‌గా రూపొందిన సిరీస్ ఇది. మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మితా కొణిదెల, అల్లుడు విష్ణు ప్రసాద్ నిర్మించిన 'షూట్ అవుట్ ఎట్ ఆలేరు' వెబ్ సిరీస్ తర్వాత 'జీ 5' కోసం ఆనంద్ రంగా తీసిన సిరీస్ ఇది. ఆల్రెడీ విడుదలైన ట్రైలర్, ప్రోమోలకు మంచి రెస్పాన్స్ వస్తోంది.
కామ్నా జెఠ్మలానీ రీ ఎంట్రీ!
గోపీచంద్ 'రణం' సినిమాలో కథానాయికగా నటించిన కామ్నా జెఠ్మలానీ (Kamna Jethmalani) గుర్తు ఉన్నారా? ఆ సినిమా తర్వాత 'అల్లరి' నరేష్ 'బెండు అప్పారావు', 'కత్తి కాంతారావు', 'యాక్షన్ త్రీడీ' తదితర సినిమాలు చేశారు. మహేష్ బాబు 'సైనికుడు'లో స్పెషల్ సాంగ్ కూడా చేశారు. పెళ్లి తర్వాత, పిల్లలకు జన్మ ఇచ్చాక... యాక్టింగుకు బ్రేక్ ఇచ్చారు. ఇప్పుడీ 'వ్యవస్థ'తో తెలుగులో ఆమె రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో ఆమె కీలక పాత్ర చేశారు.
ఏప్రిల్ 28న 'వ్యవస్థ
'జీ 5 ఓటీటీలో ఈ వారమే 'వ్యవస్థ' వెబ్ సిరీస్ సందడి చేయనుంది. ఏప్రిల్ 28వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుందని ఓటీటీ వర్గాలు వెల్లడించాయి. క్రైమ్ నేపథ్యంలో రూపొందిన కోర్ట్ రూమ్ డ్రామా కావడంతో జనాలు ఈ సిరీస్ మీద ఆసక్తి చూపిస్తున్నారు.
Also Read : ఒంటి మీద ఒక్క నూలు పోగు లేకుండా - 'మంగళవారం'లో పాయల్ బోల్డ్ లుక్