ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి (YS RajaSekhara Reddy) జీవితం ఆధారంగా దర్శకుడు మహి వి. రాఘవ్ (Mahi V Raghav) తీసిన సినిమా 'యాత్ర'. అందులో పాదయాత్ర మీద ఎక్కువ ఫోకస్ చేశారు. మిగతా అంశాలను ప్రస్తావించారు. వైఎస్సార్ పాత్రలో మలయాళ స్టార్ మమ్ముట్టి నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ బరిలో మంచి విజయం సాధించింది. 


'యాత్ర' విడుదలైన కొన్నాళ్లకు దానికి సీక్వెల్ 'యాత్ర 2' (Yatra 2 Movie) తీస్తారని వినిపించింది. ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్  మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) జీవితం ఆధారంగా సీక్వెల్ ఉంటుందని తెలిపారు. అయితే, ఇప్పటి వరకు అది సెట్స్ మీదకు వెళ్ళలేదు. అందువల్ల, ఆ సినిమా ఉంటుందా? లేదా? అని సందేహాలు నెలకొన్నాయి. అటువంటి వాటికి మహి వి. రాఘవ్ చెక్ పెట్టారు.


'యాత్ర 2'... వైఎస్ జగన్ బయోపిక్!
'యాత్ర 2' తప్పకుండా ఉంటుందని మహి వి. రాఘవ్ తెలిపారు. అయితే, సినిమా గురించి ఎక్కువ వివరాలు చెప్పలేదు. ''ప్రస్తుతానికి 'యాత్ర 2' గురించి ఎక్కువగా నేను మాట్లాడలేను. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిన వాస్తవ సంఘటలను తీసుకుని సినిమా చేయాలి? నటీనటులుగా ఎవరిని తీసుకోవాలి? కంటెంట్ ఏం ఉండాలి? వంటి అంశాల గురించి నాకు క్లారిటీ వచ్చిన తర్వాత మరింత మాట్లాడతాను. అయితే, ఒక్కటి మాత్రం చెప్పగలను... 'యాత్ర 2', నేను చెప్పాలి అనుకున్న కథ! తప్పకుండా చెప్పి తీరుతా'' అని లేటెస్ట్ ఇంటర్వ్యూలో మహి వి. రాఘవ్ పేర్కొన్నారు. 


నిర్మాతగా మారిన మహి వి. రాఘవ్!
'ఆనందో బ్రహ్మ', 'యాత్ర' సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్లో మహి వి. రాఘవ్ చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన నిర్మాతగా మారారు. అభినవ్ గోమటం, పావని గంగిరెడ్డి ఓ జంటగా... ప్రియదర్శి, 'జోర్దార్' సుజాత మరో జంటగా... చైతన్య కృష్ణ, దేవయాని ఇంకో జంటగా నటించిన వెబ్ సిరీస్ 'సేవ్ ద టైగర్స్' (Save The Tigers Web Series). అంతరించిపోతున్న పులులను, మొగుళ్లను కాపాడుకుందాం... అనేది ఉప శీర్షిక. దీనిని చిన్నా వాసుదేవ రెడ్డితో కలిసి మహి వి. రాఘవ్ నిర్మించారు. ప్రదీప్ అద్వైతంతో కలిసి షో రన్నర్ (క్రియేటర్)గా వ్యవహరించారు.


Also Read : ఒంటి మీద ఒక్క నూలు పోగు లేకుండా - 'మంగళవారం'లో పాయల్ బోల్డ్ లుక్






'సేవ్ ద టైగర్స్'లో శ్రీకాంత్ అయ్యంగార్, హర్షవర్ధన్, గంగవ్వ, వేణు టిల్లు, హర్షవర్ధన్, రోషిని, సద్దాం తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్, ప్రోమోలు మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. 


దర్శకుడిగా మారిన నటుడు!
'సేవ్ ద టైగర్స్'తో తేజా కాకుమాను (Teja Kakumanu) దర్శకుడిగా మారారు. దీని కంటే ముందు 'బాహుబలి', 'ఆకాశవాణి' సహా పలు సినిమాల్లో నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇంకా ఈ సిరీస్ కు రచన : ప్రదీప్ అద్వైతం, ఛాయాగ్రహణం : ఎస్.వి. విశ్వేశ్వర్, కూర్పు : శ్రవణ్ కటికనేని, సంగీతం : శ్రీరామ్ మద్దూరి.


Also Read విజయ్ వర్మతో తమన్నా - అవును, వాళ్ళిద్దరూ మళ్ళీ దొరికేశారు!