Tamannaah Vijay Varma : విజయ్ వర్మతో తమన్నా - అవును, వాళ్ళిద్దరూ మళ్ళీ దొరికేశారు!
Tamannaah Vijay Varma Dinner Date : ముంబైలో తమన్నా, విజయ్ వర్మ మళ్ళీ జంటగా కనిపించారు. ఈసారి మీడియాకు హాయ్ కూడా చెప్పారు. ప్రేమను గుట్టుగా ఉంచాలని అనుకోకుండా జంటగా జరుగుతుండటం విశేషం.

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia), హైదరాబాదీ యువకుడు విజయ్ వర్మ (Vijay Varma) ప్రేమలో ఉన్నారు. అయితే, ఆ విషయాన్ని వాళ్లిద్దరూ ఎప్పుడూ నోరు తెరిచి చెప్పలేదు. తొలుత గుట్టుగా ఉంచారు. కానీ, ఇప్పుడు తమ చేతల ద్వారా ప్రేమలో ఉన్నట్లు హింట్ ఇస్తూ ఉన్నారు. రహస్యంగా కలవకుండా మీడియాకు కనపడేలా షికార్లు చేస్తున్నారు. అసలు వివరాల్లోకి వెళితే...
ముంబైలో డిన్నర్ డేట్...
రోడ్డు మీద కారులో షికార్!
విజయ్ వర్మది హైదరాబాద్ అయినప్పటికీ... ఆయన ముంబైలోనే ఉంటున్నారు. అటు తమన్నా పంజాబీ అమ్మాయి అయినా సరే... పుట్టిందీ, పెరిగిందీ, అంతా ఆ నగరంలోనే! ఇద్దరూ ముంబైలో సోమవారం కలిశారు. ఓ రెస్టారెంట్ లో డిన్నర్ చేసిన తర్వాత, తమన్నా కారు ఎక్కుతున్న సమయంలో మీడియా కంట పడ్డారు. వీడియోలు, ఫోటోలు తీస్తుంటే... హాయ్ చెప్పారు. సో... తమ ప్రేమ విషయాన్ని ఈ జంట ఇప్పుడు దాచాలని అనుకోవడం లేదన్నమాట.
Also Read : 'బాహుబలి' నిర్మాతలతో ప్రభాస్ సినిమా - ఎప్పుడూ చేయని క్యారెక్టర్‌తో?
అసలు ప్రేమలో ఉన్నట్టు ఎప్పుడు తెలిసింది?
న్యూ ఇయర్ వేడుకలకు తమన్నా, విజయ్ వర్మ గోవా వెళ్లారు. అక్కడ పార్టీ చేసుకున్నారు. కొత్త ఏడాదికి అందరూ వెల్కమ్ చెప్పారు. తమన్నా, విజయ్ వర్మ కూడా చెప్పారు. అయితే... లిప్ కిస్ పెట్టుకుంటూ! ఆ రొమాంటిక్ వీడియో లీక్ కావడంతో అసలు విషయం బయటపడింది. హిందీలో 'లస్ట్ స్టోరీస్' వెబ్ సిరీస్ సీజన్ 2 షూటింగులో వీళ్ళిద్దరికీ పరిచయం అయ్యిందని, ప్రేమలో పడ్డారని సినిమా జనాలకు, సగటు ప్రేక్షకులకు తెలిసింది.
Also Read : సల్మాన్ మార్కెట్ పదేళ్ళు వెనక్కి - ఫస్ట్ డే మరీ ఇంత ఘోరమా!?
బాలీవుడ్ సినిమా 'పింక్'తో విజయ్ వర్మ గుర్తింపు తెచ్చుకున్నారు. రణ్‌వీర్ సింగ్, ఆలియా భట్ జంటగా నటించిన 'గల్లీ బాయ్'లోనూ ఆయనకు మంచి క్యారెక్టర్ దక్కింది. అందులో నటనకు పేరు వచ్చింది. ఆలియా భట్, విజయ్ వర్మ నటించిన నెట్ ఫ్లిక్స్ సినిమా 'డార్లింగ్స్' కూడా హిట్టే. అందులో శాడిస్ట్ ప్రేమికుడు, భర్తగా విజయ్ వర్మ నటన జనాలను ఆకట్టుకుంది. తెలుగులో నాని 'మిడిల్ క్లాస్ అబ్బాయి'లో విలన్ రోల్ చేశారు విజయ్ వర్మ.
విజయ్ వర్మతో ప్రేమను ఎవరూ ఊహించలేదు!
విజయ్ వర్మతో తమన్నా ప్రేమలో ఉన్నారనే విషయం బయటకు రావడానికి ముందు ఎవరూ ఊహించలేదు. ముంబైకి చెందిన ఎవరో వ్యాపారవేత్తతో ఆమె ప్రేమలో పడ్డారని పుకార్లు షికార్లు చేశాయి. పెళ్లి పీటలు ఎక్కడానికి కూడా రెడీ అయ్యారని రూమర్స్ వచ్చాయి. వాటిని తమన్నా ఖండించారు అనుకోండి. తనకు కాబోయే భర్త అంటూ 'ఎఫ్ 3'లో వేసిన మేల్ గెటప్ లుక్ పోస్ట్ చేశారు. ఆ తర్వాత విజయ్ వర్మ మ్యాటర్ లీక్ అయ్యింది.
చిరుతో తమన్నా రెండో సినిమా!
ప్రస్తుతం తమన్నా నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే... మెగాస్టార్ చిరంజీవికి జోడీగా 'భోళా శంకర్' (Bholaa Shankar Movie) చేస్తున్నారు. అందులో చిరు చెల్లెలుగా కీర్తీ సురేష్ కీలక పాత్ర చేస్తున్నారు. 'సైరా నరసింహా రెడ్డి' తర్వాత చిరు, తమన్నా కలయికలో వస్తున్న సినిమా 'భోళా శంకర్'. హిందీలో 'బోల్ చుడీయా', మలయాళంలో 'బాంద్రా' సినిమాలు చేస్తున్నారు.