Viva Harsha About Youtuber Shanmukh Jaswanth : టాలీవుడ్‌లో ఈ జనరేషన్‌లో ఉన్నయంగ్ టాలెంటెడ్ కమెడియన్స్‌లో వైవా హర్ష కూడా ఒకరు. యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మంచి పాపులారిటీ తెచ్చుకున్న హర్ష ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి కమెడియన్‌గా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్‌తో కలిసి హర్ష చేసిన 'వైవా' సిరీస్‌కు ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే కదా. ఈ సిరీస్ లో హర్ష తనదైన కామెడీ, డైలాగ్ డెలివరీతో ఆడియన్స్ ని ఆకట్టుకుని ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు.
తాను నటించిన మొదటి సిరీస్ 'వైవా'ని ఇంటిపేరుగా మార్చుకొని వైవా హర్షగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. ఇప్పుడు హీరోగా మారి 'సుందరం మాస్టర్' అనే సినిమాలో నటించాడు. ఫిబ్రవరి 23న థియేటర్లో విడుదలైన ఈ చిత్రం డీసెంట్ టాక్ సొంతం చేసుకోగా ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వైవా హర్ష యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
షన్ను ఎప్పటికీ నా తమ్ముడే
"షన్ను నేను మా ఇద్దరి ఈక్వేషన్ చాలా స్ట్రాంగ్ అతను నన్ను తన ఎల్డర్ బ్రదర్ లా ట్రీట్ చేస్తాడు. వాడు ఎప్పటికీ నా యంగర్ బ్రదరే. సొంత అన్నదమ్ముల్లా పిచ్చి పిచ్చిగా కొట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఓ నాలుగైదేళ్లు కలిసి ఉన్నాం. ఆ తర్వాత ఇద్దరి మధ్య కొంత డిస్టర్బెన్స్ వచ్చింది. అలా అని అది పెద్ద కాంప్లికేటెడ్ ఏమీ కాదు. నేను సెపరేట్ ఛానెల్ పెట్టుకుంటాను, సెపరేట్‌వే చూసుకుంటానని చెప్పడం.. అలాంటి చిన్న చిన్న ఇష్యుస్ వచ్చాయి. కానీ ఈ రోజు ఆ టీమ్ అంతా ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు. వైవాలో మేము షార్ట్ ఫార్మాట్ వీడియోస్ కంటెంట్ ప్రొడక్షన్ టైం నుంచి వాళ్లంతా టాలెంట్ తో మంచి అవకాశాలు అందుకున్నారు. మధ్యలో కొన్ని వెబ్ సిరీస్ లలో కూడా నటించారు. ఆ తర్వాత ఫీచర్ ఫిల్మ్స్.. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్స్ కింద సెట్ అయిపోయారు" అని అన్నాడు.
గంజాయి కేస్‌లో అరెస్ట్ షణ్ముఖ్ అరెస్ట్
యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్ తాజాగా గంజాయి సేవిస్తూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుపడ్డాడు. ఓ యువతి ఇచ్చిన కంప్లైట్ తో షణ్ముఖ్ సోదరుడిని అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులకు షణ్ముక్ గంజాయి తాగుతూ కనిపించాడు. అతని దగ్గర మరో 16 గ్రాముల గంజాయి దొరికినట్లు పోలీసులు తెలిపారు. షణ్ముక్ పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగడంతో పాటు దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. దాంతో వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన సోదరుడు సంపత్‌ను కూడా పట్టుకున్నారు.
రవితేజ నిర్మాణంలో తెరకెక్కిన 'సుందరం మాస్టర్'
వైవా హర్ష హీరోగా నటించిన 'సుందరం మాస్టర్' సినిమాని ఇద్దరు నిర్మాతలు నిర్మించగా.. అందులో ఓ నిర్మాతగా రవితేజ ఉన్నారు. రవితేజ ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతగా పలు సినిమాల్లో భాగస్వామ్యం అవుతున్నారు. గతంలో 'మట్టి కుస్తీ', 'చాంగురే బంగారు రాజా' వంటి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పుడు వైవా హర్ష 'సుందరం మాస్టర్' సినిమాని గోల్డెన్ మీడియా బ్యానర్ లో సుధీర్ కుర్రుతో కలిసి నిర్మించారు.
Also Read : కమెడియన్ సుధాకర్ కుమారుడి పెళ్లి - దగ్గరుండి మరీ జరిపించిన బ్రహ్మానందం, ఫోటోలు వైరల్!