Vishwak Sen’s Gaami Movie Teaser Out : యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. సక్సెస్, ఫెయిల్యూర్ అనే తేడా లేకుండా నచ్చిన చిత్రాలను చేసుకుంటూ వెళ్తున్నారు. గత కొంత కాలంగా ఆయన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా క్యారెక్టర్ ఏదైనా అదుర్స్ అనిపిస్తున్నారు.  మాస్‌ కా దాస్‌గా తనకంటూ స్పెషల్‌ ఇమేజ్‌ క్రియేట్‌ చేసుకున్న విశ్వక్‌ ఈసారి 'గామి' అంటూ సరికొత్త జానర్‌ మూవీతో వస్తున్నాడు. చాందినీ చౌదరి హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి విద్యాధర్ దర్శకత్వం వహిస్తున్నారు. అడ్వెంచరస్ ఫాంటసీ ఫిల్మ్ గా ‘గామి’ తెరకెక్కుతోంది.


సినిమాపై ఆసక్తి పెంచుతున్న టీజర్


ఈ చిత్రంలో విశ్వక్‌ సేన్ అఘోరగా కనిపించనున్నట్టు ఇప్పటికే చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా వస్తున్న సినిమా ఇది కావడంతో ‘గామి’పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. కొద్ది రోజుల క్రితమే ఈ మూవీకి సంబంధించి విశ్వక్‌ ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ కావడంతో ఓ రేంజిలో క్యూరియాసిటీ పెరిగింది. విశ్వక్‌ సేన్‌ లుక్‌కి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు. సినిమా కథ రివీల్ కాకుండా చాలా జాగ్రత్తగా టీజర్ కట్ చేశారు మేకర్స్. టీజర్ ప్రారంభంలో ఓ మ్యాప్ కనిపిస్తుంది. తర్వాత ‘‘ఇదే నీ సమస్యకు పరిష్కారం’’ అనే వాయిస్ వినిపిస్తుంది. అనంతరం మంచు ప్రదేశంలో ఒంటి మీద చిన్న దుస్తులతో చలికి వణుకుతున్న యువకులు కనిపిస్తారు. ఆ తర్వాత మహిళపై నీళ్లు పోయడం కనిపిస్తుంది. హీరోయిన్ చాందిని కాశీలో ఫోటోలు తీస్తూ కనిపిస్తుంది. కొంత మంది విలన్ల అరాచకాన్ని టీజర్ లో చూపించారు. శంకర్ అనే అఘోరా పాత్రలో విశ్వక్ కనిపించారు. ఇవన్ని దాటుకుని నా వల్ల అవుతుందంటారా? అనే విశ్వక్ వాయిస్ వినిపిస్తుంది. ఆ తర్వాత విశ్వక్ మంచుకొండల్లో నడిచే విజువల్ తో టీజర్ ఎండ్ అవుతుంది. ఈ నెల 29న ట్రైలర్ విడుదల చేయనున్నట్లు ఎండ్ కార్డులో చెప్పారు. ఈ టీజర్ ద్వారా కథ ఏంటనేది అర్థం కాకపోయినా, సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది.  



మార్చి 8న థియేటర్లలోకి ‘గామి’


ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. మహా శివరాత్రి సందర్భంగా 'గామి'ని థియేటర్లోకి తీసుకువస్తున్నారు. మార్చి 8న మూవీని రిలీజ్‌ చేస్తున్నట్టు తాజాగా మూవీ యూనిట్‌ ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్‌ ఇచ్చింది. ఈ సినిమాలో ఎంజీ అభినయ, మహ్మద్‌ సమద్‌, దయానంద్‌ రెడ్డి, హారికా ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీ సెల్యూలాయిడ్‌ సమర్పణలో కార్తీక్ శబరీష్‌ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విశ్వక్ సేన్‌, చాందినీ చౌదరి డబ్బింగ్ కంప్లీట్ అయ్యింది. అటు విశ్వక్ సేన్ ‘గామి’తో పాటు ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రంలోనూ నటిస్తున్నారు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ మూవీని నిర్మిస్తుంది. ఈ సినిమా మార్చి 8న విడుదల కావాల్సి ఉన్నా కొన్ని కారణాలతో వాయిదా పడింది.


Read Also: ‘హనుమాన్‌’ టీమ్ అదిరిపోయే ఆఫర్, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే?