Vishwak Sen Shared Post on Devara Music: టాలీవుడ్‌ మోస్ట్‌ అవైయిటెడ్‌ చిత్రంలో 'దేవర' మూవీ ఒకటి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. యాక్షన్‌ అండ్‌ ఎమోషనల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉండబోతుంది. ప్రస్తుత్తం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం ఇటీవల గోవా షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. అక్కడ ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్‌పై సాంగ్‌ షూట్‌తో పాటు యాక్షన్‌ సీన్స్‌ చిత్రీకరించినట్టు తెలుస్తోంది. ఫుల్‌ యాక్షన్‌ అండ్‌ ఎమోషన్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమా నుంచి తరచూ ఏదోక అప్‌డేట్‌, లీక్స్‌ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.


దేవర మ్యూజిక్ ఉందమ్మా..


ఇక తాజాగా 'దేవర' నుంచి అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చాడు 'మాస్‌ కా దాస్‌' విశ్వక్‌ సేన్‌. జూనియర్‌ ఎన్టీఆర్‌ను కలిసి సందర్భంగా ఫోటో షేర్‌ చేశాడు. ఈ సందర్భంగా 'దేవర' మ్యూజిక్‌ అద్భుతం అంటూ ఓ అప్‌డేట్‌ వదిలాడు. ఎన్టీఆర్‌తో దిగిన ఫోటో షేర్‌ చేశాడు విశ్వక్‌. "థ్యాంక్యూ ఎన్టీఆర్‌ అన్న. దేవర మ్యూజిక్‌ ఉందమ్మా.. నెక్ట్‌ లెవల్‌. అనిరుద్‌ అదరగొట్టాడు. ఈ అల్భం పిచ్చేక్కిస్తుందంతే (Love you always @jrntr anna . Devara music undhammaaaaaaaaaaa next , @anirudhofficial and NTR . This album will kill everyone )" అంటూ తన పోస్ట్‌కి క్యాప్షన్‌ ఇచ్చాడు. ప్రస్తుతం విశ్వక్‌  సేన్‌ పోస్ట్‌ వైరల్‌ అవుతుంది. విశ్వక్‌ సేన్‌ ఇచ్చిన ఈ దేవర చూసి ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. 


'దేవర' మ్యూజిక్‌పై విశ్వక్‌ సేన్‌ రివ్యూ మూవీపై మరింత హైప్‌ క్రియేట్‌ చేస్తుంది. ఇక ఈ మూవీ పాటల కోసం వెయిటింగ్‌ అంటూ నెటిజన్లు, ప్యాన్స్‌ మెంట్స్‌ చేస్తున్నారు. కాగా టిల్లు స్వ్కేర్‌ సక్సెస్‌ నేపథ్యంలో నిన్న రాత్రి హీరో సిద్ధూ జొన్నలగడ్డ, నిర్మాత నాగవంశీ పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీకి జూనియర్‌ ఎన్టీఆర్‌ స్పెషల్‌ గెస్ట్‌గా పాల్గొనగా యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ కూడా హజరయ్యాడు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ దేవర సాంగ్స్ బీట్‌ వినిపించినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో విశ్వక్ సేన్ ఆ పాటలు గురించి మాట్లాడుతూ ఈ పోస్ట్‌ చేశాడు. 






దసరాకు 'దేవర' సందడి


కాగా దేవర మూవీ దసరా సందర్భంగా అక్టోబర్‌ 10, 2024లో వరల్డ్‌ వైడ్‌ రిలీజ్‌ కాబోతుంది. రెండు భాగాలు తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్‌ పార్ట్‌ ఈ ఏడాది దసరాకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అక్టోబర్‌ 10న లాంగ్‌ వీకెండ్‌ పైగా దసరా సీజన్‌ కావడంతో ఈ సినిమాకు మరింత ప్లస్‌ అవుతుందని చెప్పాలి. ఎన్టీఆర్ సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంస్థలపై సినిమా రూపొందుతోంది. కొరటాల శివ సన్నిహిత మిత్రులు మిక్కిలినేని సుధాకర్, కళ్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ .కె నిర్మిస్తున్నారు. ఇక సినిమా బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ టాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇందులో ఎన్టీఆర్‌కు విలన్‌గా బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్‌ అలీ ఖాన్‌ ప్రతికథానాయకుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే.