Tillu Square 5 Days Box Office Collection: రెండేళ్ల క్రితం విడుదలైన 'డీజే టిల్లు' మూవీ ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిన్ని సినిమాగా వచ్చి ఊహించని రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమాతో సిద్ధు జొన్నలగడ్డ యూత్‌ని బాగా ఆకట్టుకున్నాడు. తనదైన డైలాగ్స్, మ్యానరిజంతో మెస్మరైజ్ చేశాడు. దీంతో థియేటర్లకు ఆడియన్స్ క్యూ కట్టారు. ఫైనల్‌గా 'డీజే టిల్లు' బ్లాక్‌బస్టర్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్‌గా 'టిల్లు స్క్వేర్'ను తీసుకువచ్చారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ అంతకుమించి రెస్పాన్స్ అందుకుంది. విడుదలైన ఫస్ట్‌డే ఫస్ట్ షో నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. టిల్లు స్క్వేర్ సిద్ధూ అదే మాయ చేశాడు. దీంతో ఈసారి కూడా టిల్లుగాడికి యూత్ బాగా కనెక్ట్ అయిపోయింది.
టిల్లు స్క్వేర్ 5 రోజుల కలెక్షన్స్
Tillu Square Box Office collection: దీంతో బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. మార్చి 29న రిలీజైన ఈ సినిమా కలెక్షన్ల మోత మోగిస్తుంది. ఫస్ట్ వీక్ (మూడు రోజుల్లో) రూ. 68 కోట్ల గ్రాస్ చేసిన ఈ సినిమా వీక్ డేస్‌లోనే అదే జోరు చూపిస్తుంది. వీక్ డేస్‌లోనూ తగ్గేదే లే అంటూ కలెక్షన్ల జోరు చూపిస్తుంది. ఫలితంగా ఈ మూవీ 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 85 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. నిన్న ఒక్క రోజే ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో(తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) కలిపి రూ. 2.80 కోట్లు షేర్ చేసిందట. వరల్డ్ వైడ్‌గా రూ. రూ. 3.50 కోట్లు రాబట్టింది. ఇలా మొత్తం ఐదు రోజుల్లోనే 'టిల్లు స్క్వేర్' మూవీ రూ. 43.50 కోట్లు వరకూ గ్రాస్ వసూళ్లు చేసి సత్తా చాటింది. ఇక వరల్డ్‌గా నిన్నటి వరకు రూ.85 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక ఓవర్సిస్‌లోనూ 'టిల్లు స్క్వేర్' అదే దూసుకుపోతుంది. రెండు రోజుల్లోనే ఈ మూవీ రూ. 7.10 కోట్లు కలెక్షన్స్ చేయగా.. అయితే రోజుల్లో దగ్గర దగ్గర రూ. 20 కోట్ల కలెక్షన్స్ చేసినట్టు ట్రేడ్ పండితుల నుంచి సమాచారం.
‘టిల్లు స్క్వేర్’ చిత్రానికి రూ.23.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా రూ. 24 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది. ఐదు రోజుల్లో ఈ సినిమా రూ. 42.98 కోట్ల షేర్ రాబట్టినట్టు సమాచారం. ఇక బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.18.98 కోట్ల లాభాలు రాబట్టి. బ్లాక్ బస్టర్ లిస్ట్ లోకి చేరిపోయింది. ఇక రెండు రోజుల్లో విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ రిలీజ్ కాబోతుంది. అప్పటి వరకు ‘టిల్లు స్క్వేర్’ బాగా క్యాష్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక ఫ్యామిలీ స్టార్ హిట్ అయితే ఒకే లేదంటే 'టిల్లు స్క్కేర్' ఇంకా వసూళ్లు చేసుకునే అవకాశం ఉంది.
Also Read: ఫస్ట్‌టైం ఆ దేశంలో తెలుగు సినిమా రిలీజ్ - రికార్డు సెట్ చేసిన విజయ్ 'ఫ్యామిలీ స్టార్'