Vishwak Sen React on Gaami Negative Rating Issue: మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌ ప్రయోగం సక్సెస్‌ అయ్యింది. మాస్‌ యాక్షన్‌ను పక్కన ఘోరగా కొత్త ప్రయత్నం చేశాడు. విశ్వక్‌ సేన్ హీరోగా చాందీని చౌదరి హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్‌ మూవీ 'గామి'. మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8న థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా ఫస్ట్‌ వీక్‌లోనే మేకర్స్‌ని లాభాల్లో పడేసింది. విడుదలైన ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో నుంచి పాజిటివ్‌ రివ్యూస్‌తో దూసుకుపోతుంది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఫలితంగా 'గామి' నాలుగు రోజుల్లోనే రూ.22 కోట్ల గ్రాస్‌ వసూళ్లు చేసి లాభాల్లోకి వెళ్లిపోయింది. విడుదలకు ముందు ఈ మూవీకి ఎన్నో అటంకాలు ఎదురైన సంగతి తెలిసిందే.వాయిదాల మీద వాయిదాలు పడుతు ఫైనల్‌గా థియేటర్లోకి వచ్చిన మంచి విజయం సాధించింది.


ఎంత లాగితే అంత పైకి వస్తాను..


అయితే ఈ మూవీకి బుక్‌ మై షోలో నెగిటివ్‌ రేటింగ్‌ వివాదం నెలకొంది. తాజాగా దీనిపై విశ్వక్‌ సేన్‌ స్వయంగా స్పందించాడు.  తన మూవీని సక్సెస్‌ చేసిన ఆడియన్స్‌కి థ్యాంక్స్‌ చెబుతూనే బాట్స్‌కి(ఊరు పేరు లేని అకౌంట్స్‌) గట్టి వార్నింగ్‌ ఇచ్చాడు. ఈ మేరకు విశ్వక్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ షేర్ చేశాడు.  'మా సినిమా గామిని ఇంత పెద్ద సక్సెస్‌ చేసిన ప్రియమైన సినీ ప్రేక్షకులు, సినిమా ఔత్సాహికులను నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే ఈ సినిమాకు కొందరు నెగిటివ్‌ ప్రచారం, రేటింగ్‌ సమస్య నా ద్రష్టికి వచ్చింది. ఈ సందర్భంగా దానిపై నేను మాట్లాడాలనుకుంటున్నా. బుక్‌మైషో వంటి ప్లాట్‌ఫారమ్‌లలో కొందరు కావాలనే 10కి 1 రేటింగ్‌ ఇస్తున్నారు. రకరకాల యాప్స్ ఉపయోగించి ఫేక్ రేటింగ్ ఇవ్వడం వల్ల 9 ఉన్న రేటింగ్ 1కి పడిపోయింది. దీనికి వెనక ఎవరూ ఉన్నారు.






వారి ఉద్దేశం ఏంటో నాకు తెలియదు. అలాంటి వారు నన్ను ఎంత కిందకు లాగాలనుకుంటే అంతకు రెట్టింపు ఉత్సాహం, శక్తితో పైగా వస్తాను. ఇలా ఎందుకు చేస్తున్నారో తెలియదు. కానీ, ఎలాంటి పరిస్థితుల్లోనైనా మంచి చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి రుజువైంది. 'గామి'ని సపోర్ట్ చేస్తున్న ఆడియెన్స్, మీడియాకు ధన్యవాదాలు. ఈ మూవీ రేటింగ్‌ విషయంలో జరుగుతున్న అవకతవకలపై చట్టపరంగా ముందుకెళ్తాను" అంటూ విశ్వక్‌ తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు. ఇటీవల కాలంలో ఒక మూవీ హిట్టా? ఫట్టా? అనేది తెలియాలంటే బుక్‌మై షోలో ఉండే రేటింగ్‌ చూసి తెలుసుకుంటున్నారు. అయితే ఇందులో కొన్ని బాట్స్‌ సినిమాలకు తక్కువ రేటింగ్‌ ఇస్తుండటం హిట్టైన సినిమాకు కూడా అతి తక్కువ రేటింగ్‌కి నమోదవుతుంది. ఇది మహేష్‌ బాబు గుంటూరు కారం చిత్రానికి ఇలానే జరిగింది. ఇప్పుడు విశ్వక్‌ సేన్‌ గామి చిత్రానికి కూడా ఇదే రిపీట్ అవ్వడం గమనార్హం. 


Also Read: అలా ఉంటేనే పతివ్రతలా భావిస్తారు, వాళ్లంతా పిచ్చినా కొడుకులు - రెండో పెళ్లిపై స్పందించిన సురేఖా వాణి