Surekha Vani: బుల్లితెర నటిగా తన కెరీర్‌ను ప్రారంభించి దాదాపు 20 ఏళ్ల నుండి ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు సురేఖా వాణి. ఒకప్పుడు తను ఎలా ఉండేదో అన్న విషయాన్ని పక్కన పెడితే.. గత కొన్నేళ్లుగా సురేఖా వాణి చుట్టూ ఎన్నో కాంట్రవర్సీలు తిరుగుతున్నాయి. తను ఏం చేసినా.. నెటిజన్లు ఆ విషయాన్ని హైలెట్ చేసి చూస్తున్నారు. తన పర్సనల్ లైఫ్‌లో సురేఖా వాణి చేస్తున్న ప్రతీ విషయాన్ని విమర్శించడానికి చాలామంది సిద్ధంగా ఉంటున్నారు. తాజాగా తనపై వస్తున్న కాంట్రవర్సీలపై, పర్సనల్ లైఫ్‌లోని పలు విషయాలపై స్పందిస్తూ వ్యాఖ్యలు చేశారు సురేఖా వాణి.
అలవాటు అయిపోయింది..
కాంట్రవర్సీలు అనేవి తన ప్రమేయం లేకుండానే వస్తున్నాయని, దానికి తను ఎప్పుడూ ఫీల్ అవ్వలేదని చెప్పుకొచ్చారు సురేఖా వాణి. భర్త లేకుండా ఇలా ప్రవర్తిస్తుందని అందరూ అంటున్నారని, ఒకవేళ తన భర్త ఉన్నా కూడా తను ఇలాగే ఎంజాయ్ చేసేదాన్నేమో అని తెలిపారు. ఇక సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ తనపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అనే విషయంపై స్పందిస్తూ.. సోషల్ మీడియా ఉపయోగించడం మొదలుపెట్టిన కొత్తలో ఆ కామెంట్స్‌కు చాలా కోపం వచ్చేదని, కానీ మెల్లగా అలవాటు అయిపోయిందని అన్నారు. తన కుటుంబ సభ్యులు కూడా ఆ కామెంట్స్‌ను చదివి, తనను ప్రశ్నించినప్పుడు చదవడం మానేయమని సలహా ఇచ్చానని గుర్తుచేసుకున్నారు. కామెంట్స్ చదివి రియాక్ట్ అవ్వడం కంటే చదవకుండా ఉండడం మంచిదన్నారు. వాటిని అస్సలు పట్టించుకోనని, పచ్చిగా చెప్పాలంటే పిచ్చినా కొడుకులు మాట్లాడుకుంటున్నారని అనుకుంటున్నానని చెప్పారు.
క్యాస్టింగ్ కౌచ్..
ఒకసారి రామ్ గోపాల్ వర్మతో ఫోటో దిగి షేర్ చేసినప్పుడు ఒక యూట్యూబ్ ఛానెల్ అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసిందని గుర్తుచేసుకున్నారు సురేఖా వాణి. మహిళలను భర్త ఉన్నప్పుడు ఒక విధంగా, భర్త లేనప్పుడు ఒక విధంగా ట్రీట్ చేస్తారని వాపోయారు. ఒకప్పుడు సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ వల్ల తన కూతురు చాలా బాధపడేదని, ఇప్పుడు ఇద్దరూ వాటిని చూసి నవ్వుకుంటున్నామని తెలిపారు. ప్రస్తుతం సురేఖా వాణి కూతురు సుప్రిత కూడా హీరోయిన్‌గా సినిమాల్లోకి అడుగుపెడుతోంది. దానిపై కూడా సురేఖా స్పందించారు. తెలుగమ్మాయిలకు సినిమాల్లోకి ఎక్కువగా అవకాశాలు రావడం లేదని, ఫెయిల్యూర్‌ను తన కూతురు యాక్సెప్ట్ చేయగలదా లేదా అనే భయాలతోనే ఇన్నిరోజులు తనను హీరోయిన్ చేయలేదని తెలిపారు సురేఖా. ఇక క్యాస్టింగ్ కౌచ్ గురించి కూడా తను మాట్లాడారు.
రెండో పెళ్లి..
క్యాస్టింగ్ కౌచ్ అనే అనుభవం తనకు ఎప్పుడూ ఎదురవ్వలేదని తెలిపారు సురేఖా వాణి. భర్త చనిపోయిన తర్వాత తెల్లచీర కట్టుకొని ఉంటేనే పతివ్రతలలాగా భావిస్తారని, తను అలా ఉండడం లేదు కాబట్టి తనపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రెండో పెళ్లిపై స్పందిస్తూ.. తన కూతురు రెండో పెళ్లి చేసుకోమని చాలా బలవంతపెట్టిందని గుర్తుచేసుకున్నారు. కానీ తనకు అస్సలు ఇంట్రెస్ట్ లేదని తెలిపారు. తన భర్త తేజను గుర్తుచేసుకుంటూ కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు సురేఖా. తన తరపున మాట్లాడాల్సినవి, చెప్పుకోవాల్సినవి, అడగాల్సినవి ఉండిపోయాయని, అందుకే తేజ మళ్లీ తిరిగొస్తే బాగుంటుందని దేవుడిని కోరుకుంటానని చెప్పుకుంటూ ఏడ్చేశారు. తన భర్త చనిపోయిన తర్వాత తన కూతురే తనకు బలంగా మారిందని గుర్తుచేసుకున్నారు.
Also Read: మలయాళీ పాన్ వరల్డ్ మూవీలో అనుష్క - అబ్బో, ఎంత మారిపోయిందో చూశారా?