Vishwak Sen: అమర్యాదగా అనిపించవచ్చు - ఆర్పీ పట్నాయక్‌కు సారీ చెప్పిన విశ్వక్ సేన్

Vishwak Sen: యంగ్ హీరో విశ్వక్ సేన్ తాజాగా ‘సంపూర్ణ భగవద్గీత చాప్టర్ 11’ లాంచ్‌కు చీఫ్ గెస్ట్‌గా వెళ్లాడు. ఆర్పీ పట్నాయక్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో తన ప్రవర్తనకు సారీ కూడా చెప్పాడు.

Continues below advertisement

Vishwak Sen at Sampoorna Bhagavad Gita Chapter 11 Launch: యంగ్ హీరో విశ్వక్ సేన్ ఆన్ స్క్రీన్ ఎలా ఉన్నా.. తన ఆఫ్ స్క్రీన్ యాటిట్యూడ్ మాత్రం చాలామంది ప్రేక్షకులకు ఇష్టం. ఇక తాజాగా ‘గామి’తో హిట్ అందుకున్న విశ్వక్.. ‘సంపూర్ణ భగవద్గీత చాప్టర్ 11’ లాంచ్‌కు చీఫ్ గెస్ట్‌గా వెళ్లాడు. ఆర్పీ పట్నాయక్ క్రియేట్ చేసిన ఈ పోడ్‌కాస్ట్‌ లాంచ్ కార్యక్రమంలో విశ్వక్ సేన్ కూడా పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అసలు అలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి చాలా అదృష్టం ఉండాలని, ఆ అవకాశం తనకు కల్పించినందుకు థ్యాంక్స్ చెప్పుకున్నాడు. ఈమధ్య ఎక్కడికి వెళ్లినా విశ్వక్.. కళ్లద్దాలు పెట్టుకొనే కనిపిస్తున్నాడు, దాని వెనుక కారణాన్ని బయటపెట్టాడు. 

Continues below advertisement

చాలా అవసరం..

‘‘ముందుగా ఇక్కడ చాలామంది పెద్ద మనుషులు ఉన్నారు. అమర్యాదగా కళ్లద్దాలు పెట్టుకున్నట్టు అనిపిస్తుంది. కానీ నాకు కండ్ల కలక ఇంకా తగ్గలేదు. లేకపోతే పెట్టుకునే ఉద్దేశ్యం లేదు’’ అని క్లారిటీ ఇస్తూ.. ఆర్పీ పట్నాయక్‌కు సారీ కూడా చెప్పాడు విశ్వక్ సేన్. తనతో సంపూర్ణ భగవద్గీత ఛాప్టర్ 11 విశ్వరూప దర్శనాన్ని లాంచ్ చేయించినందుకు సంతోషం వ్యక్తం చేశాడు. ‘‘నాలాంటి వాళ్లకు ఇది చాలా అవసరం. నాకు చదివే అలవాటు అస్సలు లేదు. కేవలం నా సినిమా కథలు మాత్రమే చదువుతూ ఉంటాను. అటెన్షన్ చాలా తక్కువ చూపిస్తా. స్కూల్‌లో బుక్స్‌కు ఎక్కువ భయపడడం వల్ల ఇప్పటికీ ఇలా జరుగుతుందేమో’’ అంటూ కామెడీ చేశాడు.

యూత్ కోసమే..

సంపూర్ణ భగవద్గీత పోడ్‌కాస్ట్ ఐడియా తనకు చెప్పిన తర్వాత కచ్చితంగా వింటానని ఫిక్స్ అయ్యానని తెలిపాడు విశ్వక్ సేన్. ఇప్పటికే ఒక చాప్టర్ విన్నానని, పోడ్‌కాస్ట్‌తో పాటు విజువల్స్ కూడా బాగున్నాయని ప్రశంసించాడు. ప్రస్తుతం ఉన్న జనరేషన్‌కు భగవద్గీత గురించి తెలుసుకోవాలంటే ఇది మంచి మార్గమని సూచించాడు. ఇక సంపూర్ణ భగవద్గీత లాంటి పోడ్‌కాస్ట్‌ లాంచ్‌కు విశ్వక్ సేన్ లాంటి హీరోను పిలవడమేంటి అని చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా.. ఆర్పీ పట్నాయక్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఇప్పటి యువతను టార్గెట్ చేసి క్రియేట్ చేసిన పోడ్‌కాస్ట్‌ కాబట్టి ఒక యూత్‌తో లాంచ్ చేయించాలని అనుకున్నానంటూ ఆర్పీ చెప్పుకొచ్చారు.

అఘోర పాత్రలో..

తాజాగా విశ్వక్ సేన్ నటించిన ‘గామి’ రిలీజ్‌తో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయాడు. విద్యాధర్ లాంటి యంగ్ డైరెక్టర్‌ను లాంచ్ చేస్తూ అఘోర పాత్రలో అందరినీ ఆశ్చర్యపరిచాడు విశ్వక్. ఇప్పటివరకు ఈ యంగ్ హీరో ఎక్కువగా యూత్‌ఫుల్, కమర్షియల్ చిత్రాల్లోనే నటించాడు. కానీ మొదటిసారి తన రొటీన్ సక్సెస్ ఫార్ములాను పక్కన పెట్టి అఘోరగా కనిపించి అందరి చేత ప్రశంసలు దక్కించుకుంటున్నాడు. ‘గామి’ని ఇంత హిట్ చేసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పుకున్నాడు విశ్వక్ సేన్. విడుదలయిన మొదటి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా రూ.20.3 కోట్ల కలెక్షన్స్‌ను సాధించింది ‘గామి’. ఇప్పటికీ చాలామంది ఈ మూవీని థియేటర్లలో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

Also Read: డైరెక్టర్ సూర్య కిరణ్‌కు సీరియల్ నటి సుజిత ఏమవుతారు? కళ్యాణి ఎందుకు విడాకులిచ్చారు?

Continues below advertisement
Sponsored Links by Taboola