Gangs of Godavari Teaser: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) లేటెస్ట్‌ మూవీ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' (Gangs Of Godavari Movie). ఎప్పుడో షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా తరచూ వాయిదా పడుతూ వస్తుంది. ఫిబ్రవరిలో రిలీజ్‌ అన్నారు. అప్పుడు పలు పెద్ద సినిమాలు ఉండటంతో మూవీ వాయిదా పడింది. ఆ తర్వాత ఏప్రిల్‌ నుంచి ఇప్పుడు మే వచ్చింది. మే 17న ఈ సినిమా వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ కానుంది. దీంతో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ సినిమా నుంచి టీజర్‌ విడుదల చేశారు మేకర్స్‌. ఫుల్‌ యాక్షన్‌ సీక్వెన్సతో విడుదల చేసిన టీజర్‌ ఆసక్తిని పెంచుతుంది. టీజర్‌ మొత్తం విశ్వక్‌ సేన్‌ పాత్రనే ఫోకస్‌ చేస్తూ సాగింది.


ఒక్కసారి లంకలో కత్తి కట్టారంటే ఆ మనిషిని సంపకుండ వదలరు.. అనే డైలాగ్‌తో టీజర్‌ మొదలైంది. ఈ తర్వాత వాడి సొంత మనుషులు వాడిపై కక్ష గడుతున్నారంట, వాడి విషయంతో ఊరంత ఒక్కటైంది అనగా విశ్వక్‌ సేన్‌ ఎంట్రీ ఇస్తాడు. ఇందులో విశ్వక్‌ అమ్మోరు తల్లి పూనిందా అనెట్టుగా విలన్స్‌పై కత్తితో విరుచుకుపడతాడు విశ్వక్‌ సేన్‌. అందుకు తగ్గట్టే "అమ్మోరు పూనిందిరా.. ఈ రాత్రికి ఒక్కొక్కడికి శివాలేత్తిపోతుంది"  డైలాగ్‌ గూస్‌బంప్స్‌ తెప్పిస్తుంది. "నేను మండోణ్నో.. చెడ్డోణ్నో నాకు తెలియదు.. కానీ, మంచోడనే చేడ్డ పేరు నాకు వద్దు" అనే డైలాగ్‌ టీజర్‌కు హైలెట్‌ అని చెప్పాలి. ఇక ఈ డైలాగ్‌తోనే టీజర్‌ కూడా ముగుస్తుంది. మొత్తానికి గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి టీజర్‌ మొత్తం యాక్షన్‌ సీక్వెన్స్‌తో ఉత్కంఠగా సాగింది. ఈ టీజర్‌ మూవీపై అంచనాలు పెంచేస్తోంది. 



 శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ సంస్థల్లో సూర్యదేవర నాగవంశీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్యలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నమూరి సహ నిర్మాతలు. ఈ సినిమాకు కృష్ణ చైతన్య దర్శకుడు. పాటల రచయితగా  ఎన్నో సినిమాలుకు సాహిత్యం అందించిన ఆయన 'రౌడీ ఫెలో', 'చల్ మోహన్ రంగ' వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఆయన దర్శకత్వంతో మూడో సినిమాగా గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి తెరకెక్కుతోంది. ఇక ఈసినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. కాగా ఇందులో విశ్వక్‌ సేన్‌ సరసన నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది. అలాగే హీరోయిన్‌ అంజలి కీలక పాత్ర పోషిస్తోంది. గోదావరి జిల్లాలలోని మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. గోదారి చీకటి ప్రపంచంలో సామాన్యుడి నుంచి అసామాన్యుడిగా ఎదిగిన గ్యాంగ్ స్టర్ పాత్రలో విశ్వక్ సేన్ కనిపించనున్నారు.