Prabahs Kalki New Release Date Announced: పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ - నాగ్‌ అశ్విన్‌ కాంబినేషన్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం 'కల్కి 2898 AD'. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా మే 9న రిలీజ్‌ కావాల్సి ఉంది. అయితే పార్లమెంట్‌ ఎన్నికల కారణంగా మూవీ వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు కొత్త రిలీజ్‌పై క్లారిటీ రాలేదు. మే 30న మూవీ రిలీజ్‌  చేసే అవకాశం ఉందంటూ ఓ వార్త ప్రచారంలో ఉంది. అయితే దీనిపై మూవీ టీం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఇక 'కల్కి' రిలీజ్‌ డేట్‌ అప్‌డేట్‌ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో 'కల్కి' టీం నుంచి ఓ అప్‌డేట్‌ వచ్చింది. మూవీ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్‌ 'ది ఫైనల్‌‌ కౌంట్‌డౌన్‌' అంటూ  రిలీజ్‌ డేట్‌ ప్రకటించింది. జూన్‌ 27న సినిమాను రిలీజ్‌ చేస్తున్నట్టు తాజాగా ఆఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ ఇచ్చేశారు. దీంతో మూవీ రిలీజ్‌ డేట్‌ కన్‌ఫాం కావడం 'డార్లింగ్‌' అంతా పండగ చేసుకుంటున్నారు. 






కాగా తరచూ కల్కి మూవీ వాయిదా పడుతూ వస్తుంది. ఎప్పుడో సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా ఫైనల్‌గా మే 9న రిలీజ్‌ డేట్‌ను ఫిక్స్ చేసుకుంది. వైజయంతి మూవీస్ సెంటిమెంట్‌గా వస్తున్న మే 9ని ఫిక్స్‌ చేసుకుంది మూవీ టీం. అదే ఫైనల్‌ చేసి అనౌన్స్‌మెంట్‌ కూడా ఇచ్చారు. ఎందుకంటే ఈ బ్యానర్లో వచ్చిన సినిమాలు 'జగదేకవీరుడు అతిలోక సుందరి', 'మహానటి' చిత్రాలు అదే రోజు విడుదలై బ్లాకబస్టర్‌ హట్‌ కొట్టాయి. అయితే ఈసారి కల్కి రిలీజ్‌కు ఎన్నికలు అడ్డుపడటంతో మూవీని వాయిదే వేయక తప్పలేదు. దీంతో మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌ మే 30న అంటూ సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. దీనిపై మూవీ టీం నుంచి ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో ఆడియన్స్‌ అంతా డైలామాలో పడ్డారు. తాజాగా ఈ కన్‌ఫ్యూజన్‌కు బ్రేక్‌ వేస్తూ వైజయంతి మూవీస్‌ రిలీజ్‌ డేట్‌తో వచ్చేసింది. చిత్రాన్ని మరింత ముందుకు జరుపుతూ జూన్‌ 27న రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేశారు.



ఇక ఫైనల్‌గా కల్కి విడుదల తేదీపై అప్‌డేట్‌ రావడంతో ఫ్యాన్స్‌ అంతా ఖుష్‌ అవుతున్నారు. కాగా 'కల్కి 2989 AD' అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ అండ్ ఫాంటసీ డ్రామాగా వస్తున్న ఈ సినిమాను దాదాపు రూ. 500 నుంచి రూ.600 కోట్ల నిర్మాణ వ్యయంతో తెరకెక్కిస్తున్నట్లు టాక్. అయితే, ఈ సినిమా ప్రభాస్‌ సరసన బాలీవుడ్‌ బ్యూటీ క్వీన్‌ దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మరో బాలీవుడ్‌ భామ దిశా పటానీ సెకండ్‌ హీరోయిన్‌గా ఓ కీలక పాత్ర చేస్తుందని టాక్‌. భారతీయ చిత్ర పరిశ్రమలో లెజెండరీ హీరోలు బిగ్ బి అమితాబ్ బచ్చన్, లోక నాయకుడు కమల్ హాసన్ సైతం 'కల్కి 2989 ఏడీ' సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. కమల్ హాసన్ విలన్ రోల్ చేస్తున్నారని సమాచారం.


Also Read: రణ్‌బీర్‌ 'రామాయణ్'సెట్‌‌ నుంచి ఫోటోలు లీక్‌ - సీతగా సాయి పల్లవి ఎంత అందంగా ఉందో చూశారా?