Vishwak Sen as Vishwamithra in Mukhachitram: 'ముఖచిత్రం' సినిమాలో యువ హీరో విశ్వక్ సేన్ స్పెషల్ రోల్ చేశారు. ఆయన పాత్ర పేరు విశ్వామిత్ర. లుక్ చూస్తే లాయర్ రోల్ అని అర్థమవుతోంది. ఈ రోజు విశ్వక్ సేన్ పుట్టినరోజు (Vishwak Sen Birthday Special) సందర్భంగా ఆయన లుక్, క్యారెక్టర్ పేరు, ఇతర వివరాలు వెల్లడించారు. సాయంత్రం ఐదు గంటలకు గ్లింప్స్‌ (Glimpse Of Vishwamithra) విడుదల చేయనున్నారు.


"మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మా 'ముఖచిత్రం' సినిమాలో ప్రత్యేక పాత్ర విశ్వామిత్ర చేస్తున్నారని చెప్పడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. విశ్వక్ సేన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు" అని చిత్ర సమర్పకులు ఎస్.కె.ఎన్ ట్వీట్ చేశారు. "మా 'ముఖచిత్రం'లో స‌ర్‌ప్రైజ్‌ క్యారెక్టర్ ఇదిగో. ఇదొక ఇంటెన్స్ కోర్ట్ రూమ్ డ్రామా" అని సందీప్ రాజ్ ట్వీట్ చేశారు.










Also Read: రష్మీ ఎందుకు ఏడ్చింది? ఆమె ప్రేమించింది ఎవర్ని?


'కలర్ ఫొటో'తో దర్శకుడిగా పరిచయమైన సందీప్ రాజ్, తొలి సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన 'ముఖచిత్రం' సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు. గంగాధర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వికాస్ వశిష్ట, ప్రియా వడ్లమాని, '30 వెడ్స్ 21' ఫేమ్ చైతన్య రావ్, అయేషా ఖాన్ ఈ సినిమాలో ప్రధాన పాత్రధారులు. కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. పాకెట్ మనీ పిక్చర్స్ పతాకంపై ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల నిర్మిస్తున్నారు.


Also Read: శ్రీరామనవమికి ప్రభాస్ ఫ్యాన్స్‌కు డ‌బుల్ ధమాకా! ఆ రోజు 'ఆదిపురుష్' అప్‌డేట్ ఏంటంటే?