విష్ణు మంచు... కథానాయకుడు, నిర్మాత. ఆయన కథా రచయిత కూడా! సంపూర్ణేష్ బాబు 'సింగం 123'కి కథ, స్క్రీన్ ప్లే అందించడంతో నిర్మించారు. ఆయన హీరోగా నటించి, నిర్మించిన 'మోసగాళ్లు' సినిమాకు కథ రాశారు. అంతే కాదు... విద్యా సంస్థల నిర్వహణలో తండ్రి మోహన్ బాబుకు తగ్గ తనయుడిగా విష్ణు మంచు పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు తండ్రి పేరు మీద ఏర్పాటు చేస్తున్న యూనివర్సిటీ పనుల నిమిత్తం అమెరికా వెళ్లారు.


తిరుపతిలో శ్రీ విద్యా నికేతన్ నెలకొల్పి కుల, మత, ప్రాంతాలకు అతీతంగా 25 శాతం మంది పేద విద్యార్థులకు చదువుకునే అవకాశం కల్పిస్తున్నారు మోహన్ బాబు. ఈ ఏడాది జనవరిలో మోహన్ బాబు యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. భారీ స్థాయిలో యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. 


Also Read : నరేష్ ఎవరో తెలీదు, ఆ ఆధారం ఒక్కటే లేదు, పవిత్ర నన్ను క్షమించు - భర్త సుచేంద్ర ప్రసాద్


ప్రస్తుతం మోహన్ బాబు యూనివర్సిటీ పనుల నిమిత్తం విష్ణు మంచు అమెరికా వెళ్లారు. అక్కడ పలువురు విద్యావేత్తలు, ప్రొఫెసర్లు, ఉద్యోగ అవకాశాలు కల్పించే కంపెనీ అధినేతలు తదితరులను కలుస్తున్నట్లు తెలిసింది. అమెరికా యూనివర్సిటీలతో అనుసంధానమై కొన్ని కోర్సులు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. మొత్తం మీద వాషింగ్టన్ డీసీలో విష్ణు మంచు బిజీ బిజీగా గడుపుతున్నారు.


Also Read : రాజ్యసభకు నామినేట్ అయిన ఇళయరాజా, విజయేంద్రప్రసాద్, పీటీ ఉష!