డేరింగ్ అండ్ డైనమిక్ హీరో విష్ణు మంచు (Vishnu Manchu) హీరోగా నటించిన తాజా సినిమా 'కన్నప్ప' (Kannappa Movie). ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. తొలుత ఏప్రిల్ మంత్ ఎండ్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఏప్రిల్ 25న థియేటర్లలోకి తీసుకు వస్తామని అనౌన్స్ చేయడమే కాదు... ప్రమోషనల్ యాక్టివిటీస్ కూడా మొదలు పెట్టారు. అయితే ఆ డేట్ నుంచి పోస్ట్ పోన్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. 


జూన్ 27న థియేటర్లలోకి 'కన్నప్ప'
Kannappa movie release date: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ (Yogi Adityanath)ను లెజెండరీ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబుతో పాటు ఆయన తనయుడు విష్ణు మంచు కలిశారు. ఆ ఫోటోలను ట్వీట్ చేయడంతో పాటు కన్నప్ప కొత్త రిలీజ్ డేట్ తెలిపారు విష్ణు. యోగి ఆదిత్యనాథ్‌ను కలిసిన ప్రముఖుల్లో ప్రభుదేవా కూడా ఉన్నారు.


జూన్ 27న తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో భారీ ఎత్తున 'కన్నప్ప' చిత్రాన్ని విడుదల చేయడానికి విష్ణు మంచు సన్నాహాలు చేస్తున్నారు.


Also Read: లక్ష రూపాయల కరెంట్ బిల్... షాక్‌లో హీరోయిన్... కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఫైర్






ఇండియా స్థాయిలో సినిమాపై క్రేజ్!
పాన్ ఇండియా స్థాయిలో 'కన్నప్ప' సినిమా మీద ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది. రెబల్ స్టార్ ప్రభాస్ ఈ సినిమాలో ఒక కీలక పాత్ర చేసిన సంగతి తెలిసిందే. రుద్రుడిగా ఆయన కనిపించనున్నారు.‌ బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఆ పరమశివుని పాత్రలో నటించారు. ఆయన సరసన పార్వతీ దేవిగా తెలుగు తెర చందమామ కాజల్ అగర్వాల్ కనిపించనున్నారు. మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్, తమిళ నటుడు శరత్ కుమార్ సహా పలువురు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. విష్ణు మంచు సరసన ప్రీతి ముకుందన్ హీరోయిన్ రోల్ చేశారు. 


Also Readఅవేంజర్స్, ఎక్స్ మ్యాన్... అట్లీతో ఐకాన్ స్టార్ ప్లానేంటి? సైన్స్‌ ఫిక్షన్ సినిమాయేనా... వీఎఫ్ఎక్స్‌ కంపెనీల హిస్టరీ తెల్సా?



'కన్నప్ప' చిత్రానికి స్టీఫెన్ దేవాన్సీ సంగీతం అందించారు. ఆయన మ్యూజిక్ అందించిన పాటల్లో రెండు విడుదల కావడమే కాదు... ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకున్నాయి. ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ మీద కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రొడ్యూస్ చేశారు. ఈ చిత్రానికి మహాభారత సీరియల్ డైరెక్షన్ చేసిన ముఖేష్ సింగ్ దర్శకత్వం వహించారు‌. ఇండియాతో పాటు విదేశాలలో పలు టాప్ కంపెనీలలో విజువల్ ఎఫెక్ట్స్ వర్క్స్ చేయించారు.