కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ చాలా కాలం తర్వాత 'మార్క్ ఆంటోనీ'(Mark Antony) మూవీతో సాలిడ్ కం బ్యాక్ ఇచ్చాడు. టైం ట్రావెల్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన ఈ మూవీని అదిక్ రవిచంద్రన్ తెరకెక్కించగా వినాయక చవితి కానుకగా విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. కోలీవుడ్ తో పాటు హిందీలోనూ భారీ కలెక్షన్స్‌ని అందుకుంది. ప్రస్తుతం ఓటీటీలోనూ దుమ్ము రేపుతోంది. విశాల్ ఈ సక్సెస్‌ని ఫుల్‌గా ఆస్వాదిస్తున్నాడు. 'మార్క్ ఆంటోనీ' సక్సెస్‌తో ఫుల్ జోష్ మీద ఉన్న ఈ కోలీవుడ్ హీరో ప్రస్తుతం తన 34వ సినిమాతో బిజీగా ఉన్నాడు. '#vishal34' అనే వర్కింగ్ టైటిల్‌తో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాను కోలీవుడ్ మాస్ డైరెక్టర్ హరి తెరకెక్కిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అనౌన్స్మెంట్ పోస్టర్ రిలీజ్ చేయగా, పోస్టర్లో చుట్టూ గన్స్ కత్తుల మధ్యలో స్టెతస్కోప్ ఉన్న లుక్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. పోస్టర్ని బట్టి సినిమాలో విశాల్ డాక్టర్‌గా కనిపిస్తాడని స్పష్టమవుతుంది. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తూ ఫాన్స్ లో జోష్ నింపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో అదిరిపోయే అప్డేట్ అందించారు హీరో విశాల్. "చివరి షాట్. వర్షం రూపంలో దేవుడి ఆశీస్సులు అందించాడు. హరి సార్ డైరెక్షన్లో కరైకుడిలో సుదీర్ఘమైన రెండో షెడ్యూల్ ని పూర్తి చేశాం. టీజర్, ఫస్ట్ లుక్ త్వరలోనే" అంటూ షూటింగ్ లొకేషన్లో తీసిన స్టిల్ ని విశాల్ తన ట్విట్టర్ లో షేర్ చేశారు.
ఈ అప్డేట్ తో విశాల్ ఫాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. దీనికంటే ముందు రీసెంట్ గా తమిళనాడులోని తూతుకూడిలో ఈ సినిమాకు సంబంధించి ఇంటెన్స్ క్లైమాక్స్ షూట్ చేస్తున్నట్లు మేకట్స్ అప్డేట్ ఇచ్చారు. స్టంట్ మాస్టర్ కన్నన్ తో విశాల్ దిగిన పిక్ కూడా నెట్టింట వైరల్ అయింది. ఆ తర్వాత డైరెక్టర్ హరి తో పాటు గౌతమ్ మీనన్, సముద్రఖనితో దిగిన ఫోటోను కూడా విశాల్ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.." ఒకే ఫోటోలో ముగ్గురు మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్లతో నిలబడడం చాలా అరుదు. ఎప్పటికీ గుర్తుంచుకోవాలి" అంటూ రాస్కొచ్చాడు. దీంతో సినిమాలో గౌతమ్ మీనన్, సముద్రఖని ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తున్నట్లు తెలిసింది.
మాస్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంలో విశాల్ సరసన ప్రియా భవాని శంకర్ కథానాయికగా నటిస్తోంది. 'భరణి', 'పూజా' వంటి సినిమాల తర్వాత హరి డైరెక్షన్ లో విశాల్ నటిస్తున్న మూడవ సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. స్టోన్ బెంచ్ ఫిలిమ్స్, జి స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నహాలు చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు 'తుప్పరివాలన్ 2' అనే సినిమాలోని నటిస్తున్నాడు విశాల్. ఈ మూవీ కూడా షూటింగ్ దశలో ఉంది.
Also Read : ప్రభాస్ 'కల్కి'లో రాజమౌళి పాత్ర అదేనట.. నెట్టింట ఫుల్ వైరల్