'ఆర్ఆర్ఆర్' సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'వార్ 2'(War2) తో బాలీవుడ్​కి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. యశ్ రాజ్ స్పై యూనివర్స్​లో భాగంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ లీడ్ రోల్ ప్లే చేస్తున్నారు. బాలీవుడ్​లోనే మోస్ట్ యాంటీస్ పెటెడ్ మల్టీస్టారర్ ప్రాజెక్ట్​గా 'వార్ 2' రూపొందుతోంది. 2019లో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలిసిన నటించిన 'వార్'(war) చిత్రానికి సీక్వెల్​గా వస్తున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్​ను అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నారు. యశ్ రాజ్ ఫిలిమ్స్ నుంచి రాబోతున్న స్పై మూవీ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.


'ఆర్ ఆర్ ఆర్' వంటి గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న బాలీవుడ్ మూవీ కావడంతో తెలుగులోనూ ఈ ప్రాజెక్టుపై భారీ హైల్ నెలకొంది. ఈ క్రమంలోనే 'వార్ 2' నుంచి ఏ చిన్న న్యూస్ వచ్చినా అది క్షణాల్లో నెట్టింట ట్రెండ్ అవుతుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలైనట్లు తెలుస్తోంది. 'వార్ 2' షూటింగ్ ని స్పెయిన్ లో మొదలుపెట్టారు. ఈ షూటింగ్ కి సంబంధించిన ఓ వీడియో లీకై నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. సినిమాకు సంబంధించిన మేజర్ యాక్షన్ సీక్వెన్స్ లను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఇందుకోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నట్లు సమాచారం. ఈ షూటింగ్ కు సంబంధించిన వీడియోని ఓ నెటిజన్ తన సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు.






అది కాస్త క్షణాల్లో వైరల్ అయిపోయింది. అయితే ఈ షూటింగ్ వీడియోలో అటు హృతిక్ రోషన్ కానీ ఇటు ఎన్టీఆర్ గానీ ఎవరూ కనిపించలేదు. కేవలం ఒక కారు చేజింగ్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్నట్లు ఈ వీడియోలో కనిపించింది. కాగా ముందుగా ప్రకటించినట్లుగానే డిసెంబర్ నుండి ఎన్టీఆర్, హృతిక్ ఇద్దరూ 'వార్ 2' షూట్ లో జాయిన్ అవుతారు. ఇండియన్ సినీ హిస్టరీ లోనే అతి పెద్ద యాక్షన్ ఎంటర్టైనర్ గా 'వార్ 2' ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో ఎన్టీఆర్ పోషించే పాత్ర పై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇందులో ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 2025 జనవరి 24న 'వార్ 2' ని విడుదల చేసేందుకు మూవీ టీం ప్లాన్ చేస్తోంది.


జనవరి 24 అంటే రిపబ్లిక్ డే వీకెండ్. బాలీవుడ్ లో ది బెస్ట్ వీకెండ్ గా ఇది పరిగణించబడుతోంది. ఇటీవల షారుఖ్ ఖాన్ నటించిన 'పఠాన్' కూడా అదే వీకెండ్ లో విడుదలై బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకుని ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. రణబీర్ కపూర్, అలియా భట్, అమితాబచ్చన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'బ్రహ్మాస్త్ర' మూవీతో మంచి సక్సెస్ అందుకున్న అయాన్ ముఖర్జీ.. 'వార్ 2' ని బిగ్ స్కెల్​లో ప్రజెంట్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే, ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ఇటీవల అధికారికంగా వెల్లడించగా దేవర పార్ట్-1 వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల కానుంది.


Also Read : 'లియో' రివ్యూ : LCUలో విజయ్ - దర్శకుడు లోకేష్ కనగరాజ్ మేజిక్ వర్కవుట్ అవుతుందా? లేదా?



Join Us on Telegram: https://t.me/abpdesamofficial