Thalapathy Vijay Donates Rs 1 Crore: తమిళ స్టార్‌ హీరో దళపతి విజయ్‌పై నడిగర్‌ సంఘం అధ్యక్షుడు, హీరో విశాల్‌ ప్రశంసలు కురిపించాడు. నా అభిమాన హీరో అంటూ విజయ్‌పై అభిమానం కురిపించారు. కాగా దళపతి విజయ్‌ నడిగర సంఘానికి రూ. కోటీ విరాళం అందించారు. సౌత్‌ ఇండియన్‌ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ (South Indian Artistes Association) భవన నిర్మాణం కోసం ఈ మొత్తాన్ని ఇచ్చినట్టు విశాల్‌ తెలిపారు. ఈ సందర్భంగా విజయ్‌కి కృతజ్ఞతలు చెబుతూ విశాల్‌ తన ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ షేర్‌ చేశాడు. ఈ సందర్భంగా విజయ్‌తో దిగిన ఫోటోను షేర్‌ చేశాడు. 


ఈ మేరకు విశాల్‌ ట్వీట్‌ చేస్తూ.. "థ్యాంక్యూ అన్నది రెండు అక్షరాల పదమే కావచ్చు. కానీ ఒక వ్యక్తి తన హృదయం లోపల నుంచి చేసిన సాయానికి ఇది తోతైన భవన ఉంటుంది. సరే. ఇది నేను నా అభిమాన నటుడు, నాకు ఇప్పుడు నేను దీని గురించి ఎందుకు చెబుతన్నానంటే.. నా అభిమాన నటుడు, మన తలపతి విజయ్‌ గురించి చెబుతున్నాను. విజయ్‌ సౌత్‌ ఇండియన్‌ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ భవన నిర్మాణం కోసం తనవంతుగా నడిగర్‌ సంఘానికి రూ. కోటీ విరాళం ఇచ్చారు. ఆయనకు ఆ దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి అని కోరుకుంటున్నా" అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు. ఇక విజయ్‌పై ఇండస్ట్రీ ప్రముఖులు, ఫ్యాన్స్‌ ప్రశంసలు కురిపిస్తున్నారు. 




కాగా దళపతి విజయ్ ఇటీవలే పాలిటిక్స్ లో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా ప్రచారంలో ఉన్న వార్తలను నిజం చేస్తూ, ఫిబ్రవరి 2న 'తమిళగ వెట్రి కళగం' (TVK) అనే పేరుతో సొంత రాజకీయ పార్టీని ప్రకటించారు విజయ్. ఆల్రెడీ కమిటైన రెండు సినిమాలను పూర్తి చేసి, ఆ తర్వాత పూర్తిగా ప్రజా సేవకే అంకితం కాబోతున్నట్లు పేర్కొన్నారు. అంతేకాదు వచ్చే తమిళనాడు లోక్‌ సభ ఎన్నికల్లో సైతం విజయ్‌ పోటీ చేయనున్నారు. ఇలాంటి తరుణంలో దళపతి విజయ్  తన కొత్త పార్టీ 'తమిళగ వెట్రి కళగం' పార్టీ పేరులో మార్పులు చేసిన సంగతి తెలిసిందే.


దళపతి విజయ్ పార్టీ పేరులో మార్పులు


విజయ్ స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం' అనే పార్టీ పేరులో మార్పులు చేశారు. అదేంటంటే.. ఈ పార్టీ పేరులో అదనంగా 'క్' అనే అక్షరాన్ని జోడించారు. ఈ పార్టీ పేరుకు కొంత వ్యతిరేకత వస్తుండడంతో విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సన్నిహితవర్గాల నుంచి సమాచారం. 'తమిళగ వెట్రి కళగం' పార్టీని ఇంగ్లీషులో 'టీవీకే' అని పిలుస్తున్నారు. దీనిపై తమిళనాడు కొన్ని పార్టీల నుంచి వ్యతిరేకత వస్తోందట.


దానికి తోడు తమిళనాడులో 'తమిళగ వాల్వురిమై కట్చి' అనే పేరుతో ఓ పార్టీ ఉంది. ఆ పార్టీని కూడా ఇంగ్లీషులో 'టీవీకే' అని పిలుస్తున్నారు. దళపతి విజయ్ పార్టీని కూడా ఇదే పేరుతో పిలుస్తుండడంతో తమ పార్టీకి ఇబ్బంది కలుగుతుందని వాళ్లు అభ్యంతరం వ్యక్తం చేశారట. దీంతో విజయ్ 'తమిళగ వెట్రి కళగం' పేరులో 'క్' అనే అక్షరాన్ని జోడించి 'తమిళగ వెట్రిక్ కళగం' అని పిలవాలని పార్టీ వర్గాలు నిర్ణయించాయి.