Varun Sandesh's Viraaji Now Streaming On Amazon Prime Video: టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్ (Varun Sandesh) డిఫరెంట్ లుక్‌లో నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం 'విరాజి' (Viraaji). ఆద్యంత్ హర్ష దర్శకత్వం వహించిన ఈ సినిమా గతేడాది ఆగస్ట్ 2న థియేటర్లలోకి వచ్చింది. అయితే, కేవలం 20 రోజుల్లోనే 'ఆహా' (Aha) తెలుగు ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. మహా మూవీస్, ఎమ్ 3 మీడియా బ్యానర్‌పై మహేంద్ర నాథ్ కూండ్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీలో 2 డిఫరెంట్ లుక్స్‌తో వరుణ్ ప్రేక్షకుల ముందుకు రాగా.. అనుకున్నంత సక్సెస్ సాధించలేకపోయింది. తాజాగా.. 'విరాజి' 'అమెజాన్ ప్రైమ్ వీడియో' (Amazon Prime Video) ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. కానీ.. మూవీ చూడాలంటే రూ.99 రెంట్ పే చేయాల్సి ఉంది. 'ఆహా'లో అయితే రెంట్ లేకుండానే మూవీని చూడొచ్చు.






కథేంటంటే..?


ఓ పాడుబడిన భవనం చుట్టూ సాగే కథ 'విరాజి.' స్టాండప్ కమెడియన్, డాక్టర్, సినీ నిర్మాత, ఫోటోగ్రాఫర్, ప్రముఖ జ్యోతిష్యుడు, పోలీస్ ఆఫీసర్ ఒకరితో ఒకరు పరిచయం లేని వ్యక్తులు ఓ అజ్ఞాతవాసి ఫోన్ చేయడంతో పాడుబడిన భవనానికి వెళ్తారు. ఓ కార్డుపై అదే తమకు చివరి రోజు అని చూసి ఆందోళనకు గురవుతారు. దీంతో భయంతో అక్కడి నుంచి పారిపోయేందుకు సిద్ధమవుతారు. ఈ క్రమంలో ఒక్కొక్కరుగా అనుమానాస్పదంగా ప్రాణాలు కోల్పోతుంటారు. సరిగ్గా అదే టైంలో డ్రగ్ అడిక్టర్ అయిన వరుణ్ సందేశ్ ఆ భవనంలో అడుగుపెడతాడు. అతని రాకతో చోటు చేసుకున్న పరిణామాలేంటి.? వారిలో కొందరైనా అక్కడి నుంచి బయటపడగలిగారా.? అసలు వారికి కాల్ చేసిందెవరు.? వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


Also Read: 'కిల్' డైరెక్టర్‌ను లైన్‌లో పెట్టింది రామ్ చరణ్ కాదు... విజయ్ దేవరకొండ - హిందీ మూవీకి రౌడీ హీరో రెడీ


నెటిజన్ల విమర్శలు


'అమెజాన్ ప్రైమ్ వీడియో' నిర్ణయంపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే 'ఆహా' ఓటీటీలో ఫ్రీగా చూసే సౌలభ్యం ఉండగా మళ్లీ అదనంగా రెంట్ చెల్లించి చూడడం ఎందుకు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 'విరాజి' సినిమా కొత్తది అని ఏమైనా రైట్స్ కొనుగోలు చేసిందా.? అంటూ సెటైర్లు వేస్తున్నారు. పాత సినిమాకే రూ.99 బాదుడు ఎందుకని ప్రశ్నిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు.


వరుణ్ సందేశ్.. చాలా రోజులుగా ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే డిఫరెంట్ కథాంశాలను ఎంచుకుంటున్నారు. ఇటీవలే 'నింద' ఓ మోస్తరు విజయం అందుకున్న ఆయన.. తాజాగా ఆర్యన్ సుభాన్ ఎస్.కె దర్శకత్వంలో జాగృతి మూవీ మేకర్స్ సంస్థలో 'బలగం' జగదీష్ నిర్మాణంలో 'కానిస్టేబుల్' సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో మధులిక వారణాసి కథానాయికగా పరిచయం అవుతున్నారు. తాజాగా టీజర్ విడుదల కాగా ఆకట్టుకుంటోంది. అతి దారుణ హత్యకు గురైన అమ్మాయి కేసును ఛేదించే పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో వరుణ్ సందేశ్ నటించారని టీజర్ చూస్తే అర్థం అవుతోంది.  


Also Read: ట్రెండింగ్‌లో 'సలార్', అదీ 365 రోజులుగా... జస్ట్ రికార్డు మాత్రమే కాదంటూ పృథ్వీరాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్