విమర్శకుల ప్రశంసలు అందుకున్న 'సినిమా బండి', 'ముఖ చిత్రం' సినిమాల ఫేమ్ వికాష్ వశిష్ఠ (Vikas Vasishta) హీరోగా నటించిన తాజా సినిమా 'నీతోనే నేను' (Neethone Nenu Movie). సీత రామ్ ఆయేషా... అనేది ఉపశీర్షిక. ఇందులో మోక్ష‌, కుషిత క‌ళ్ల‌పు హీరోయిన్లు. ఈ చిత్రానికి అంజిరామ్ ద‌ర్శ‌క‌త్వం వహించారు. శ్రీ మామిడి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఎమ్‌. సుధాక‌ర్ రెడ్డి నిర్మించారు. ఈ నెల 13న... అంటే శుక్రవారం సినిమాను థియేటర్లలోకి తీసుకు వస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మెదక్ పట్టణంలో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. 


సినిమా చిత్రీకరణ 33 రోజుల్లో పూర్తి చేశాం! - సుధాక‌ర్ రెడ్డి
పక్కా ప్లానింగ్ ప్రకారం 33 రోజుల్లో సినిమా చిత్రీకరణ పూర్తి చేశామని చిత్ర నిర్మాత ఎమ్‌ సుధాక‌ర్ రెడ్డి తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ''డిసెంబర్ నుంచి మే వరకు... సుమారు ఆరు నెలలు చిత్ర బృందంతో చర్చలు జరిపిన తర్వాత 'నీతోనే నేను' కథ రాశా. మేలో స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాగానే చిత్రీకరణ ప్రారంభించాం. కేవలం 33 రోజుల్లో సినిమా తీశాం. మా చిత్ర బృందం సహకారంతోనే ఇది సాధ్యమైంది. ఈ ప్రయాణంలో 'టీచర్స్ మీద సినిమా ఏంటి?' అని కొందరు అడిగారు. కమర్షియల్ సినిమా చేస్తే బావుంటుందని వాళ్ళ అభిప్రాయం. నాకు టీచర్స్ మీద, నా కథ మీద, మా టీమ్ మీద నమ్మకం ఉంది. అక్టోబ‌ర్ 13న సినిమా విడుదల చేస్తున్నాం. ఆల్రెడీ మేం సినిమా చూశాం. హండ్రెడ్ పర్సెంట్ కచ్చితంగా సక్సెస్ అవుతుంద‌ని సినిమా చూసిన వారు చెబుతున్నారు. మెద‌క్ వాళ్లంద‌రూ మా ప్రాంతం వ్యక్తి చేసిన సినిమా అని గొప్ప‌గా చెబుతారు'' అని అన్నారు.


నిర్మాత సహకారం మరువలేనిది - దర్శకుడు అంజిరామ్!
చిత్రసీమలో నిర్మాత సుధాకర్ రెడ్డి కొత్తగా అడుగు పెట్టినప్పటికీ... సినిమాలపై ఆయన అంకితభావం & నిబద్ధత చూసి తనకు సంతోషం అనిపించిందని, ఆయన తమ వెనుక ఉండి నడింపించడంతో సినిమా పూర్తి చేశామని ద‌ర్శ‌కుడు అంజిరామ్ తెలిపారు. నాలుగు నెల‌ల పాటు చిత్ర బృందమంతా ఎంతో క‌ష్ట‌ప‌డిందని, ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు చెప్పారు అంజిరామ్. సెన్సార్ సభ్యులు సినిమాను ప్రశంసించారని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ ఎమ్‌ ప్ర‌భాక‌ర్ రెడ్డి తెలిపారు. 


Also Read ఒంటిపై చైతన్య పేరును చెరిపేసిన సమంత...  మాజీ భర్త గుర్తులు, జ్ఙాపకాలు వద్దని అనుకుంటోందా?


సంగీత దర్శకుడు కార్తీక్ మాట్లాడుతూ ''మెదక్ నుంచి శక్తివంతమైన నాయకులు వచ్చారు. ఇప్పుడు మెదక్ వాసి సుధాకర్ రెడ్డి గారు నిర్మాతగా మారుతున్నారు. ఇందులో మంచి పాటలు చేసే అవకాశం లభించింది. పాఠశాలలో స‌మ‌స్య‌లపై మ‌న‌సుకు హ‌త్తుకునేలా సినిమా తెర‌కెక్కించారు. పాట‌లు అన్నింటికీ సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. నిర్మాత సుధాక‌ర్ రెడ్డిగారు ప్ర‌తీ విష‌యంలో ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుని మ‌రీ సినిమా చేశారు'' అని అన్నారు. 


Also Read  పెళ్లి చేసుకున్న ప్రభాస్, అనుష్క - వాళ్లకు ఓ పాప కూడా, వైరల్ ఫోటోలు



వికాస్ వశిష్ఠ, మోక్ష‌, కుషిత కళ్లపు హీరో హీరోయిన్లుగా అకెళ్ల ఓ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : ముర‌ళీ మోహ‌న్, సంగీతం:  కార్తీక్ బి. క‌డ‌గండ్ల‌, నిర్మాత‌ : ఎమ్‌. సుధాక‌ర్ రెడ్డి, ద‌ర్శ‌క‌త్వం : అంజిరామ్‌. 


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial