Vijeyendra Prasad About Mahesh Babu Rajamouli Varanasi Movie : సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి మూవీ నుంచి ఇంతకాలం అప్డేట్స్ కోసం అంతా ఎంతో ఎదురుచూశారు. శనివారం 'GlobeTrotter' ఈవెంట్‌లో ఎవరూ ఊహించని విధంగానే అప్డేట్స్ ఇచ్చారు మూవీ టీం. చిత్ర నిర్మాత కేఎల్ నారాయణతో పాటు కథా రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్, డైలాగ్ రైటర్ దేవా కట్టా, రాజమౌళి తనయుడు కార్తికేయ 'వారణాసి' గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.
హీరోయిన్ ప్రియాంక చోప్రా
ఈ మూవీలో ప్రియాంక చోప్రా మందాకినీ పాత్రలో కనిపించనున్నారు. పసుపు రంగు చీరలో రివాల్వర్ రాణిలా... దేవతా విగ్రహాల గుహలో ఓ యాక్షన్ సీన్‌లో రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ అదిరిపోయింది. ఈ లుక్ చూస్తేనే ఆమె పాత్రలో చాలా కోణాలున్నాయని అర్థమవుతోంది. గుహలో దేవతా విగ్రహాలు... ప్రతీ రాయి ఓ కథ చెప్పేటట్లే ఉన్నాయి. తాజాగా 'GlobeTrotter' ఈవెంట్‌లో నిర్మాత కేఎల్ నారాయణ ప్రియాంక చోప్రానే హీరోయిన్ అంటూ తన స్పీచ్‌లో కన్ఫర్మ్ చేశారు. దీంతో ఆమెనే హీరోయిన్ అని క్లారిటీ వచ్చేసింది. ఈ మూవీ అందరినీ అలరిస్తుందని చెప్పారు. ఈ అవకాశం తనకు అందించిన రాజమౌళి, మహేష్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇది నాకు దక్కిన అదృష్టం
ఓ ప్రొడ్యూసర్‌గా చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ ఉన్న తనకు ఇంత పెద్ద ప్రాజెక్ట్ వస్తుందని ఊహించలేదని రాజమౌళి కొడుకు కార్తికేయ అన్నారు. 'GlobeTrotter' ఈవెంట్‌లో ఆయన ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. ఆయన మాటలకు తల్లి రమా రాజమౌళి ఎమోషనల్ అయ్యారు. 'ఈ మూవీలో చేస్తున్న వారంతా లెజెండ్స్. ఇంత పెద్ద ప్రాజెక్ట్ త్వరగా వస్తుందని అనుకోలేదు. ఇది నాకు దక్కిన అదృష్టం. ఇండియన్ సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లడంతో పాటు గ్లోబల్ ఆడియన్స్‌ను ఇండియా వైపు చూసేలా చేస్తున్నాం. 15 ఏళ్ల పాటు ఈ కాంబో కోసం వెయిట్ చేశాారు. అందరికీ థాంక్స్.' అని కార్తికేయ అన్నారు. ఆయన కేఎల్ నారాయణతో కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నారు.
మహేష్ బాబు విశ్వరూపం
ఈ మూవీలో మహేష్ బాబు విశ్వరూపం చూస్తామని కథా రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. 'ఈ సినిమాలో మహేష్ నటనను చూస్తూ అలా ఉండిపోయా. ఓ సీజీ లేదు. డబ్బింగ్ లేదు. రీ రికార్డింగ్ లేదు. అయినా నన్ను మంత్ర ముగ్ధుడిని చేసింది. కొన్ని సినిమాలు మనుషులు తెరకెక్కిస్తే... కొన్ని మాత్రం దైవ నిర్ణయం. రాజమౌళి గుండెపై హనుమ ఉన్నాడు. ఏం చేయాలో చెబుతూ కర్తవ్యం బోధిస్తూ ఉన్నాడు. ఆయన ద్వారా మాకు ఈ ప్రాజెక్ట్ వచ్చింది. రాముడు వారధి కడితే ఉడతా భక్తిగా కొందరు రాళ్లు ఎలా అందించారో... అలా మాకు ఈ అదృష్టం కలిగింది.' అంటూ చెప్పారు.