Vijay Sethupathi about Body Shaming: హీరో అంటే తెల్లగా ఉండాలి, హైట్‌గా ఉండాలి, బాడీ ఫిట్‌గా ఉండాలి.. ఇలా చాలా అనుకుంటారు. కానీ అవన్నీ లేకపోయినా కూడా కేవలం యాక్టింగ్‌తో ప్రేక్షకులను అలరించవచ్చు అని నిరూపించిన నటులు కూడా ఉన్నారు. అందులో తమిళ నటుడు విజయ్ సేతుపతి కూడా ఒకడు. లీడ్ రోల్‌లో నటించడం మాత్రం తన లక్ష్యంగా పెట్టుకోకుండా, తన పాత్రకు ప్రాధాన్యత ఉంటే ఇప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించే ఒకేఒక్క హీరో విజయ్ సేతుపతి. ప్రస్తుతం ఈ తమిళ నటుడు తన హిందీ డెబ్యూ మూవీ ‘మెర్రీ క్రిస్ట్మస్’ ప్రమోషన్స్‌లో బిజీగా గడిపేస్తున్నాడు. అదే సమయంలో తను బాడీ షేమింగ్ గురించి స్పందించాడు.


మంచి విషయం ఏంటంటే..
‘‘నేను ఇలాగే ఉన్నాను. నన్ను చాలా బాడీ షేమింగ్ చేశారు. వేరే భాషా పరిశ్రమల్లో కూడా చేశారు’’ అంటూ తను ఎదుర్కున్న బాడీ షేమింగ్ గురించి బయటపెట్టాడు విజయ్ సేతుపతి. ‘‘అలా జరిగింది. కానీ మంచి విషయం ఏంటంటే మనల్ని మనలాగా అందరూ యాక్సెప్ట్ చేయడమే. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్లినా ప్రేక్షకులు నన్ను నన్నుగా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇది నేను అస్సలు ఊహించలేదు’’ అంటూ తన ఫ్యాన్స్ తనపై చూపిస్తున్న అభిమానానికి సంతోషం వ్యక్తం చేశాడు. హీరో అంటే బాడీని ఫిట్‌గా ఉంచుకోగలగాలి అనే రూల్‌ను బ్రేక్ చేయడం మాత్రమే కాదు.. ఎక్కడికి వెళ్లినా ఏ హడావిడి లేకుండా, సింపుల్ డ్రెస్సింగ్‌తో వెళ్తాడు విజయ్ సేతుపతి. దానిపై కూడా తాను స్పందించాడు.


చెప్పులు వేసుకుంటే సింపులా?
‘‘నేను నా కాస్ట్యూమ్స్ విషయంలో చాలా శ్రద్ధ వహిస్తాను. ఎందుకంటే నాకు సౌకర్యంగా ఉన్నవే నేను వేసుకోవాలని అనుకుంటాను. ఒక్కొక్కసారి నేను షో ఆఫ్ చేస్తున్నానని కొందరు అంటారు. కొన్నిసార్లు వాళ్లే నేను సింపుల్‌గా ఉన్నానని అంటారు. సాధారణ చెప్పులు వేసుకోవడంలో సింపుల్ ఏముంది? కానీ ఒక్కొక్కసారి చెప్పులపై కూడా శ్రద్ధ వహిస్తాను. నేను ఫంక్షన్స్‌కు వెళ్లినప్పుడు అక్కడ జనాలు చాలా మంచిగా రెడీ అవ్వడం చూస్తాను. అప్పుడు అదంతా నన్ను మేల్కొనేలా చేస్తుంది. అందుకే నేను ఎక్కువగా గెట్ టుగెథర్‌లకు, మీటింగ్స్‌కు వెళ్లకుండా ఉండడానికి ప్రయత్నిస్తాను. లేకపోతే నేనెప్పుడూ సౌకర్యంగానే ఉంటాను’’ అని తెలిపాడు విజయ్ సేతుపతి.


అదే నాకు ఎనర్జీ డ్రింక్..
‘‘ఫ్యాన్స్ అనేవారి ప్రేమ చాలా నిజమైనదని నేను నమ్ముతాను. వారి నుండి ప్రేమ పొందడం ఎనర్జీ డ్రింక్‌లాగా ఉంటుంది. మనల్ని ప్రేక్షకులు ప్రేమించినప్పుడే మన వర్క్ అందరికీ రీచ్ అవుతుందని, వారందరికీ మన వర్క్ నచ్చుతుందని అర్థమవుతుంది. అదే నాకు ఫ్యాన్ క్లబ్స్ ద్వారా అర్థమయ్యింది. అదే నాకు ఎనర్జీ ఇస్తుంది’’ అని తన ఫ్యాన్స్ గురించి గొప్పగా మాట్లాడాడు విజయ్ సేతుపతి. ఇక తను హీరోగా నటించిన ‘మెర్రీ క్రిస్ట్మస్’ చిత్రం హిందీతో పాటు తమిళంలో కూడా విడుదలకు సిద్ధమయ్యింది. జనవరి 12న విడుదల కానున్న ఈ సినిమాను శ్రీరామ్ రాఘవన్ డైరెక్ట్ చేశారు. ఇందులో విజయ్ సేతుపతికి జోడీగా కత్రినా కైఫ్ నటించింది. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ విడుదలయ్యి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేసింది.


Also Read: ‘హనుమాన్’‌కు ఆ హీరో కరెక్ట్, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో సూపర్ హీరోతో మూవీ - ప్రశాంత్ వర్మ