Vijay Sethupathi: విజయ్ సేతుపతి జోడీగా మంజూ వారియర్ - పెరుమాళ్ ఈజ్ బ్యాక్, 'విడుదల 2' ఫస్ట్ లుక్ చూశారా?

Vidudala 2 First Look: విజయ్ సేతుపతి మరోసారి ప్రజాదళం నాయకుడు పెరుమాళ్ పాత్రతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 'విడుదల 2' నుంచి ఇవాళ ఆయన ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

Continues below advertisement

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, తమిళ హాస్య నటుడు సూరి ప్రధాన పాత్రల్లో యాక్ట్ చేసిన సినిమా 'విడుతలై పార్ట్ 1'. వెట్రిమారన్ దర్శకత్వం వహించారు. ఆ సినిమా తెలుగులో 'విడుదల' పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పట్లోనే పార్ట్ 2 కూడా ఉందని చెప్పారు. ఇవాళ 'విడుదల పార్ట్ 2'లో విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

Continues below advertisement

విజయ్ సేతుపతి జోడీగా మంజూ వారియర్!
Vijay Sethupathi and Manju Warrier first looks from Viduthalai part 2: 'విడుదలై పార్ట్ 2'లో విజయ్ సేతుపతి జోడీగా ప్రముఖ మలయాళ కథానాయిక మంజూ వారియర్ కనిపించనున్నారు.

Viduthalai part 2 first look: 'విడుదల 1'లో ప్రజా దళం నాయకుడు పెరుమాళ్ పాత్రలో విజయ్ సేతుపతి కనిపించారు. ఆ సినిమా సీక్వెల్ 'విడుదల 2'లోనూ మరోసారి పెరుమాళ్ పాత్రలో సందడి చేయనున్నారు. ఆయన సోలో ఫస్ట్ లుక్ విడుదల చేయడంతో పాటు మంజూ వారియర్, ఆయన ఉన్న లుక్ కూడా విడుదల చేశారు.

Also Read: 'సర్దార్ 2' చిత్రీకరణలో ట్రాజెడీ... ప్రమాదవశాత్తూ స్టంట్ మ్యాన్ మృతి

'విడుదల పార్ట్ 2' సినిమాను ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ సమర్పణలో ఏ గ్రాస్ రూట్ ఫిల్మ్ కంపెనీ ప్రొడక్షన్ పతాకం మీద ఎల్రెడ్ కుమార్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాకు ఇళయరాజా సంగీత దర్శకుడు. తమిళంలో వెట్రిమారన్ (Vetrimaaran) పాపులర్ డైరెక్టర్. ఆయన తీసే సినిమాలు సగటు కమర్షియల్ సినిమాల మధ్య ప్రత్యేకంగా ఉంటాయి. సమాజంలో అణగారిన వర్గాలకు అండగా సినిమాలు తీస్తారు. అసమానతలను కళ్లకు కట్టినట్టు చూపిస్తారు. ఆయన చిత్రాలు, ఆయనకు తెలుగులోనూ అభిమానులు ఉన్నారు.

Also Readబన్నీ వర్సెస్ సుకుమార్ - గొడవలతో 'పుష్ప 2' షూటింగ్ మళ్లీ వాయిదా?


వెట్రిమారన్ సినిమాలు కొన్నిటిని తెలుగులో రీమేక్ చేశారు. అయితే... 'విడుతలై' తమిళంలో మార్చి 15న విడుదల కాగా... తెలుగు డబ్బింగ్ వెర్షన్ 'విడుదల' నెల ఆలస్యంగా ఏప్రిల్ 15న రిలీజ్ అయ్యింది. ఈసారి మాత్రం తెలుగు, తమిళ భాషల్లో సేమ్ డే రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఈ సినిమాలోనూ దర్శకులు గౌతమ్ మీనన్, అనురాగ్ కశ్యప్, రాజీవ్ మీనన్, చేతన్ సహా భవానీ శ్రీ, కిశోర్ తదితరులు నటించారు.

Continues below advertisement