Vijay Sethupathi Joins In Puri Jagannadh Movie Shooting Set: మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, పూరీ జగన్నాథ్ కాంబోలో ఓ మూవీ తెరకెక్కబోతోన్న సంగతి తెలిసిందే. ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచీ భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఇదివరకు ఎన్నడూ లేని రీతిలో ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో మూవీని తెరకెక్కించనున్నట్లు ఇప్పటికే పలు సందర్భాల్లో పూరి చెప్పారు.
షూటింగ్ సెట్‌లో విజయ్
ఈ మూవీ షూటింగ్ సెట్‌లో తాజాగా విజయ్ సేతుపతి అడుగు పెట్టారు. గురువారం హైదరాబాద్ చేరుకున్న ఆయన పూరీ మూవీ సెట్‌లో సడన్‌గా ప్రత్యక్షమయ్యారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా మూవీ టీం పంచుకుంటూ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. 'ఇప్పటికే బ్లాక్ బస్టర్ వైబ్స్ వచ్చేశాయి. మా ప్రియమైన మక్కల్ సెల్వన్ మ్యాజిక్‌ను టీం ఎంజాయ్ చేశాం. ఇది ఓ అద్భుతమైన ప్రారంభం. సిల్వర్ స్క్రీన్‌పై చూసేందుకు ఉత్సాహం ఆకాశాన్ని తాకింది.' అంటూ రాసుకొచ్చారు. జులై 1న పూజా కార్యక్రమాలతో మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యింది.
Also Read: విశ్వంభర స్పెషల్ సాంగ్ షూటింగ్ షురూ... హైదరాబాద్ వచ్చిన బాలీవుడ్ బ్యూటీ
ఇప్పటివరకూ ఎన్నడూ చూడని రీతిలో ఓ డిఫరెంట్ రోల్‌లో విజయ్ సేతుపతిని పూరి జగన్నాథ్ సినిమాలో చూపించనున్నట్లు తెలుస్తోంది. విజయ్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. వీరితో పాటే టబు కన్నడ స్టార్ దునియా విజయ్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. పూరి కనెక్ట్స్, జెబి మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా మూవీని నిర్మిస్తున్నాయి. ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాగా తాజాగా విజయ్ షూటింగ్‌లో జాయిన్ అయ్యారు.
స్టోరీ ఏంటి?
నిజానికి 'ఉప్పెన' తర్వాత విజయ్ సేతుపతి నేరుగా తెలుగులో మూవీ చేయలేదు. ఇప్పుడు పూరి సినిమాకు ఓకే చెప్పడంతో అంతటా ఆసక్తి నెలకొంది. సింగిల్ సిట్టింగ్‌లోనే పూరి స్టోరీకి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. గతంలో ఎంతోమంది డైరెక్టర్ ఎన్నో కాన్సెప్ట్స్‌తో వెళ్లినా విజయ్ చేసేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. డైరెక్టర్ హిట్స్, ప్లాప్స్‌తో తనకు సంబంధం లేదని ఆయన చెప్పిన స్టోరీ తనకు చాలా బాగా నచ్చిందని అందుకే ఓకే చెప్పినట్లు గత ఇంటర్వ్యూల్లో విజయ్ చెప్పారు.
దీంతో ఈ మూవీ స్టోరీ ఏంటి అనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. పూరి ఇప్పటివరకూ చేసిన మాస్, యాక్షన్ డ్రామాగా కాకుండా... ఓ హ్యూమన్ యాంగిల్‌లో ఈ సినిమా తీసినట్లు ప్రచారం సాగుతోంది. గత కొంతకాలంగా పూరి జగన్నాథ్ ఖాతాలో సరైన హిట్ పడలేదు. ఈ సినిమాతోనైనా సరైన హిట్ కొట్టాలని... కమ్ బ్యాక్ కావాలని భావిస్తున్నారు.