NTR Hrithik Roshan's War 2 Trailer Released: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న 'వార్ 2' ట్రైలర్ వచ్చేసింది. టైటిల్‌కు తగ్గట్టుగానే ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వార్, పవర్ ఫుల్ డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఇద్దరు భారీ స్టార్ల మధ్య వార్ చూసేందుకు ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
ట్రైలర్ అదుర్స్
'నేను ప్రమాణం చేస్తున్నాను. నా పేరును, నా గుర్తింపుని, నా ఇంటిని, నా కుటుంబాన్ని అన్నింటినీ వదిలేసి ఓ నీడగా మారిపోతాను. ఓ ఊరు పేరు రూపం లేని నీడలాగా...' అనే హృతిక్ డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. 'నేను మాటిస్తున్నా. ఎవరూ చేయలేని పనిని నేను చేసి చూపిస్తాను. ఎవరూ పోరాడలేని యుద్ధాన్ని నేను పోరాడతాను.' అంటూ ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది.
ఇద్దరి మధ్య హోరా హోరీ వార్, డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. 'ఇప్పుడు నేను మనిషిని కాదు. యుద్ధంలో ఆయుధాన్ని. చస్తా లేదా చంపుతా' అంటూ ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ వేరే లెవల్‌లో ఉంది. 'ఆయన సోల్జర్, నువ్వు సోల్జర్ అండ్ దిస్ ఈస్ వార్' అనే డైలాగ్‌తో ట్రైలర్ ముగుస్తుండగా... అసలు ఇద్దరు సోల్జర్స్ మధ్య వార్ ఎందుకు వచ్చింది? అనేది తెలియాలంటే మూవీ రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
Also Read: తెలుగు 'బిగ్ బాస్'లో కన్నడ హీరోయిన్... లాస్ట్ ఇయర్ ఛాన్స్ మిస్, ఈసారి పక్కా!
యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ ఫ్రాంచైజీలో భాగంగా 'వార్ 2' మూవీ ఆరో చిత్రంగా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ స్పై అధికారిగా కనిపించనున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా... కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆగస్ట్ 14న హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మూవీ రిలీజ్ కానుంది. తెలుగు రాష్ట్రాల్లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ మూవీని రిలీజ్ చేస్తున్నారు.
ఫస్ట్ ఇండియన్ సినిమాగా...
'వార్ 2' క్రేజ్ దృష్ట్యా ఆడియన్స్‌కు ఓ స్పెషల్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు చిత్ర నిర్మాణ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఈ మూవీని డాల్బీ అట్‌మోస్ థియేటర్లలో ప్రదర్శించనున్నారు. దీంతో డాల్బీ అట్‌మోస్ సౌండ్‌ను ఎంజాయ్ చేయనున్నారు. భారీ స్థాయిలో రిలీజ్ కానున్న ఫస్ట్ ఇండియన్ సినిమాగా ఈ మూవీ రికార్డు సృష్టించనుంది. అటు విదేశాల్లోనూ మ్యాగ్జిమమ్ అధిక సంఖ్యలో డాల్బీ అట్‌మోస్ థియేటర్లలోనే సినిమాను ప్రదర్శించనున్నారు.
డిఫరెంట్ ప్రమోషన్స్
యష్ రాజ్ ఫిల్మ్స్ ఎప్పుడు మూవీ ప్రమోషన్స్‌లో డిఫరెంట్ పంథాను ఎంచుకుంటుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, గ్లింప్స్ భారీ హైప్ క్రియేట్ చేయగా ఇప్పుడు ట్రైలర్‌తో అది పదింతలైంది. ప్రమోషన్లలో భాగంగా ఫ్లైట్ స్మోక్‌తో 'ఎన్టీఆర్', 'వార్ 2' అంటూ పేర్లు రాయగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2019లో వచ్చిన 'వార్'కు సీక్వెల్‌గా ఈ మూవీ రానుంది.