డాషింగ్ హీరో, రౌడీ బాయ్ 'ది' విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) సరసన సమంత (Samantha) కథానాయికగా నటించిన సినిమా 'ఖుషి'. దీనికి శివ నిర్వాణ దర్శకుడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. ఈ రోజు టైటిల్ సాంగ్ విడుదల చేశారు. 


మళ్ళీ మళ్ళీ వినాలనిపించే మెలోడీ!
''ఖుషీ... నువ్ కనపడితే!
ఖుషీ... నీ మాట వినపడితే!''
అంటూ సాగిన ఈ గీతాన్ని టర్కీలో అందమైన లొకేషన్లు, మసీదులలో షూటింగ్ చేశారు. ఈ పాటకు చిత్ర దర్శకుడు శివ నిర్వాణ సాహిత్యం అందించారు. ఈ సినిమాలో పాటలన్నీ ఆయనే రాశారు. ఈ పాటను సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహాబ్ ఆలపించారు. ఇంతకు ముందు విడుదలైన 'నా రోజా నువ్వే' పాటను కూడా ఆయనే పాడారు. ఆ పాటకు 100 మిలియన్స్ కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి.   


Also Read పవన్ కళ్యాణ్ గురించి నిజం తెలుసుకున్న ఊర్వశి రౌతేల - కానీ?



అందమైన పెళ్లి జీవితం మెలోడీ అయితే?
Kushi Movie Songs : 'ఖుషి'లో రెండో గీతం 'ఆరాధ్య...'ను సిద్ శ్రీరామ్, చిన్మయి ఆలపించారు. తెలుగుతో పాటు మరో రెండు భాషల్లో ఈ పాటను తాను పాడినట్లు చిన్మయి పేర్కొన్నారు. విజయ్ దేవరకొండ, సమంతకు పెళ్లి జరిగే సన్నివేశం, తర్వాత వైవాహిక జీవితం నేపథ్యంలో ఆరాధ్య పాట వస్తుందని లిరికల్ వీడియో చూస్తే ప్రేక్షకులకు ఈజీగా అర్థం అవుతుంది. 'ఒకవేళ అందమైన పెళ్లి జీవితం ఓ మెలోడీ అయితే?' అంటూ చిత్ర బృందం ఈ 'ఆరాధ్య' పాటను విడుదల చేసింది.


Also Read శ్యాంబాబు ఎవరు 'బ్రో' - ఏపీ మంత్రి డ్యాన్స్‌పై పవన్ కళ్యాణ్ సెటైర్?



ద్రాక్షారామం గుడిలో కొన్ని సీన్లు!
ఇటీవల 'ఖుషి' సినిమా చిత్రీకరణ ముగిసింది. అప్పుడు హైదరాబాద్ సిటీలో విజయ్ దేవరకొండ కేక్ కట్ చేశారు. అంతకు ముందు ఏపీలోని ద్రాక్షారామంలోని దేవాలయంలో 'ఖుషి' చిత్రీకరణ జరిగింది. ఆ షూటింగులో మురళీ శర్మ, సచిన్ ఖేడేకర్ కూడా పాల్గొన్నారు. వాళ్ళిద్దరూ యాగం చేస్తుంటే... వెనుక విజయ్ దేవరకొండ, సమంత నిలబడి ఉన్నారు. 


సెప్టెంబర్ 1న 'ఖుషి' విడుదల
పాన్ ఇండియా సినిమాగా 'ఖుషి' తెరకెక్కుతోంది.  తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది. సెప్టెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా 'ఖుషి'ని విడుదల చేయనున్నట్లు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో సమంత కశ్మీరీ యువతిగా నటిస్తున్నట్లు సమాచారం. అందుకని, కొన్ని సీన్లలో ఆమె ఆహార్యం ముస్లిం యువతిగా ఉందని టాక్. హీరోతో ముస్లిం యువతి పెళ్లి తర్వాత ఏమైంది?  అనేది కథగా తెలుస్తోంది. 


మలయాళ నటుడు జయరామ్, మరాఠీ నటుడు సచిన్ ఖేడేకర్, ఇంకా మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, 'వెన్నెల' కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు 'ఖుషి'లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి పాటలు : శివ నిర్వాణ, పోరాటాలు : పీటర్ హెయిన్, సంగీత దర్శకుడు : హేషామ్ అబ్దుల్ వాహాబ్, సీఈవో : చెర్రీ, ఛాయాగ్రహణం: జి. మురళి.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial