రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఖుషి'. 'నిన్ను కోరి' మూవీ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మించింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. సెప్టెంబర్ 1వ తేదీన సినిమాని థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు మేకర్స్. రిలీజ్ టైం దగ్గర పడటంతో చిత్ర బృందం ప్రమోషన్స్ వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే విజయ్, సమంత, శివ నిర్వాణ వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. తాజాగా యాంకర్ సుమ, రాజీవ్ కనకాల తో కలిసి 'ఖుషి' మూవీ టీంని ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ, సమంత, వెన్నెల కిషోర్లతో పాటు దర్శకుడు శివ నిర్వాణ పాల్గొన్నారు.
ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూలో విజయ్, సమంత సినిమా గురించి, తమ వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. విజయ్, సమంత లను సుమా రాపిడ్ ఫైర్ లో భాగంగా కొన్ని ప్రశ్నలు అడిగింది. ఇందులో భాగంగానే ఓ సందర్భంలో విజయ్.. 'సమంత చాలా చీటింగ్ చేస్తుందని' షాకింగ్ కామెంట్స్ చేశాడు. "నేను సమంత బోర్డ్ గేమ్స్ ఆడుతుంటే తను చాలా చీటింగ్ చేసి ఆడుతుంది. జెన్యూన్ గా ఒక ఇన్సిడెంట్ లో నాకు సామ్ ఇంటలిజెన్స్ తెలిసింది. నేను చాలా ఇంటలిజెంట్ అని నా ఫీలింగ్. కానీ సామ్ ఇంటెలిజెన్స్ నాకు తెలిసింది. బోర్డ్ గేమ్స్ లో ఎంత చీటింగ్ చేస్తుందంటే, ఆ చీటింగ్ యాక్సెప్ట్ చేసే విధంగా కూడా ఉండదు, అంత చీటింగ్ చేస్తుంది. అంటూ సామ్ పై సరదా కామెంట్స్ చేశాడు విజయ్.
ఇక ఆ తర్వాత సమంత కి నచ్చని ఫుడ్ ఏంటని? సుమా అడిగితే.. 'ఆమెకు మాంసం అంటే అసలు నచ్చదని' విజయ్ ఆన్సర్ ఇచ్చారు. విజయ్ కి నచ్చని ఫుడ్ ఏంటని? సమంతని అడిగితే..' ఎక్కువగా స్వీట్ ఉన్న ఐటమ్స్ విజయ్ కి నచ్చవని సామ్ రిప్లై ఇచ్చింది. ఆ తర్వాత రాపిడ్ ఫైర్ లో భాగంగా సమంతకు ఇష్టమైన హీరో ఎవరు?అని సుమ విజయ్ ని అడిగింది. అందుకు విజయ్ బదులిస్తూ.. ‘‘సమంత ఫేవరెట్ హీరో నేను మాత్రమే’’ అని చెప్పడంతో సమంత కూడా కరెక్ట్ అని బదులిచ్చింది. విజయ్ దేవరకొండ ఫేవరెట్ హీరోయిన్ ఎవరని? సమంతని అడిగితే ఆలియా భట్ అని వెంటనే ఆన్సర్ ఇచ్చింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ ఫేవరెట్ యాంకర్ ఎవరని? సుమ సరదాగా అడిగితే.. ‘‘ఇప్పుడున్న యాంకర్స్ లో నాకు మీరు తప్ప మరెవరూ తెలియదు’’ అని విజయ్ చెబితే సమంత మాత్రం కరణ్ జోహార్ అని సమాధానం ఇచ్చింది.
అలా ఈ రాపిడ్ ఫైర్ ఎంతో సరదాగా సాగింది. దీంతో ప్రస్తుతం వీటికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 'ఖుషి' సినిమా సక్సెస్ అవడం అటు విజయ్ దేవరకొండ కి ఇటు సమంతకి చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ ఇద్దరి గత సినిమాలైన 'లైగర్', 'శాకుంతలం' బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ గా నిలిచాయి. అందుకే ఈ ఇద్దరి ఆశలన్నీ ఈ సినిమాపైనే ఉన్నాయి. విజయ్, సమంత ఇద్దరికీ 'ఖుషి' ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.
Also Read : షారుఖ్ 'జవాన్'లో దళపతి విజయ్ - గట్టిగానే ప్లాన్ చేసిన అట్లీ!