అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది అందాల తార జాన్వీ కపూర్.  ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తోంది. అటు సౌత్ లోనూ అడుగు పెట్టింది.  రీసెంట్ గా తెలుగులోనూ ఓ సినిమా చేస్తోంది. ఎన్టీఆర్ తో కలిసి ‘దేవర’ అనే సినిమాలో నటిస్తోంది. అయితే, ఈ ముద్దుగుమ్మ శిఖర్ పహారియాతో ప్రేమాయణం నడుపుతున్నట్లు కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆ వార్తలు నిజమేనని తేలిపోయింది. ఏకంగా శిఖర్ ను తన అన్న అర్జున్ కపూర్ ఇంటికే తీసుకెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచింది.  రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ కపూర్ తన తొలి ప్రేమ గురించి తొలిసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.  


తొలి ప్రేమ గురించి తొలిసారి స్పందించిన జాన్వీ కపూర్


తనకు సినీ కెరీర్ ఎంత ముఖ్యమో ఫ్యామిలీ కూడా అంతే ముఖ్యం అని చెప్పుకొచ్చింది జాన్వీ. తన ప్రేమ వ్యవహారంలో పేరెంట్స్ చాలా కఠినంగా ఉంటారని వెల్లడించింది. “నేను తొలిసారి ఓ అబ్బాయిని ఇష్టపడ్డాను. దొంగచాటుగా తనని కలిసేదాన్ని. ఇద్దరం కలిసి ఎన్నో విషయాలు చెప్పుకొనేవాళ్లం. ఇంట్లో అబద్దాలు చెప్పేదాన్ని. అందులో ఒక థ్రిల్ ఉండేది. కానీ, నేను చెప్పిన చాలా అబద్దాల కారణంగా ఆ రిలేషన్ షిప్ కు ఎండ్ కార్డ్ పడింది. విషయం ఇంట్లో తెలిసి ఒప్పుకోలేదు. తల్లిదండ్రులు ప్రేమను వదులుకోవాలని చెప్పారు. మా పేరెంట్స్ సంప్రదాయవాదులు. వారి ఆమోదం లేకుండా ఈ రిలేషన్ షిప్ ముందుకు సాగదు అనుకున్నాను. అందుకే తొలి ప్రేమను వదులుకోవాల్సి వచ్చింది” అని జాన్వీ వివరించింది.  


తొలి సినిమా సమయంలో ఎన్నో విమర్శలు


2018లో ‘ధడక్’ అనే చిత్రంతో బాలీవుడ్ అడుగు పెట్టింది జాన్వీ కపూర్. ఈ సమయంలో ఆమె చాలా విమర్శలు ఎదుర్కొంది. బాలీవుడ్ కొన్ని కుటుంబాల చేతిలో కీలు బొమ్మలా మారిందనే మాటలు వినిపించాయి. కానీ, ఆమె నటించిన తొలి రొమాంటిక్ డ్రామా ‘ధడక్’ కమర్షియల్‌గా మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో ఆమె నటన పట్ల ప్రశంసలు లభించాయి. ఆ తర్వాత’ గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్’, ‘గుడ్ లక్ జెర్రీ’, ‘మిలీ’ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇటీవల  ‘బవాల్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చక్కటి నటనతో అలరించింది.   


వరుస చిత్రాలతో జాన్వీ  ఫుల్ బిజీ


ప్రస్తుతం జాన్వీ కపూర్ వరుస సినిమాలు చేస్తోంది.  ప్రస్తుతం రాజ్ కుమార్ తో కలిసి ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ నటిస్తోంది. లో రాజ్‌కుమార్ రావుతో కలిసి కనిపించనుంది. గుల్షన్‌ తో కలిసి  ‘ఉలాజ్‌’ లో నటిస్తోంది. జాతీయ అవార్డు గ్రహీత సుధాన్షు సరియా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను జంగిల్‌ పిక్చర్స్‌ సంస్థ  నిర్మిస్తుంది.  యువ ఐఎఫ్‌ఎస్‌ అధికారి పాత్రలో జాన్వీ కనిపించనుంది. అటు తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘దేవర’ చిత్రంలో హీరోయిన్ గా కనిపించనుంది.  


Read Also: ‘భగవంత్ కేసరి’ సెట్‌లో బాలయ్య కొడుకు మోక్షజ్ఞ, శ్రీలీలతో సీరియస్ డిస్కషన్ - పిక్ వైరల్


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial