చాలా రోజులుగా నందమూరి బాలయ్య కొడుకు మోక్షజ్ఞ సినీ అరంగేట్రం గురించి తెలుగు సినిమా పరిశ్రమలో జోరుగా చర్చ జరుగుతోంది. నందమూరి అభిమానులు ఆయన సినీ ఎంట్రీ గురించి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. త్వరలో ఎంట్రీ అంటున్నారు తప్ప, అఫీషియల్ గా ఎలాంటి క్లారిటీ లేదు. ప్రస్తుతం మోక్షజ్ఞ అమెరికాలో యాక్టింగ్ కోర్సు చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఆయన సినిమాల్లోకి అడుగు పెట్టే అవకాశం ఉందనే టాక్ నడుస్తోంది.  


‘భగవంత్ కేసరి’ సెట్ లో బాలయ్య కొడుకు


ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య ‘భగవంత్ కేసరి’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. తాజాగా ఈ షూటింగ్ దగ్గరికి మోక్షజ్ఞ వెళ్లాడు.  బ్లాక్ షర్ట్, కళ్లకు గాగుల్స్ పెట్టుకుని కనిపించాడు. సెట్స్ లో దర్శకుడు అనిల్, హీరోయిన్ శ్రీలీలతో మాట్లాడుతూ కనిపించాడు. ఆ తర్వాత కాసేపు సినిమా షూటింగ్ చూశాడు. అక్కడి వారితో కలిసి మాట్లాడాడు. ప్రస్తుతం ‘భగవంత్ కేసరి’ షూటింగ్ స్పాట్ లో  మోక్షజ్ఞ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ప్రధానంగా శ్రీలీలతో మాట్లాడుతున్న ఫోటోలు బయటకు వచ్చాయి. దీంతో బాలయ్య కొడుకు తొలి చిత్రంలో శ్రీలీల హీరోయిన్ అయితే బాగుటుందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.   






బాలయ్య కొడుకు తొలి చిత్రంలో హీరోయిన్ గా శ్రీలీల!


ప్రస్తుతం టాలీవుడ్ లో శ్రీలీల మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. సీనియర్ హీరోల నుంచి మొదలుకొని కుర్ర హీరోల వరకు అందరితో జోడీ కడుతోంది. బాలయ్య, అనిల్ కాంబోలో వస్తున్న చిత్రంలో బాలకృష్ణ కూతురి పాత్రలో కనిపించబోతోంది. అయితే, ఈ సినిమా షూటింగ్ సమయంలో శ్రీలీల పద్దతి బాలయ్యకు బాగా నచ్చిందట. పెద్దలకు ఆమె ఇస్తున్న గౌరవం పట్ల ఫిదా అయ్యారట. తన కొడుకు తొలి చిత్రంలో హీరోయిన్ నువ్వే ఉండాలని చెప్పారట. డేట్స్ కుదరట్లేదనే సాకులు చెప్పకూడదనే ముందుగా చెప్తున్నా అన్నారట. బాలయ్య అలా అనే సరికి, శ్రీలీల నవ్వుతూ మీరు ఎలా అంటే అలానే అని సమాధానం చెప్పిందట. మొత్తంగా బాలయ్య కొడుకు తొలి చిత్రంతోనే చాకులాంటి అమ్మాయితో నటించబోతున్నాడని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.  నిజంగా శ్రీలీల నటిస్తే బాలయ్య కొడుకు సినిమా హిట్ కావడం ఖాయం అంటున్నారు.


దసరాకు ‘భగవంత్ కేసరి’ విడుదల


ఇక అనిల్ రావిపూడి, బాలయ్య కాంబోలో వస్తున్న ‘భగవంత్ కేసరి’ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో హీరోయిన్ గా కాజ‌ల్ అగ‌ర్వాల్‌ నటిస్తుంది. శ్రీలీల బాలయ్య చెల్లిగా కనిపించబోతోంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఈ చిత్రంలో విలన్ పాత్ర పోషించబోతున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు. థ‌మన్ సంగీతం అందిస్తున్నారు. ‘భగవంత్ కేసరి’ చిత్రం దసరాకు విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.  


Read Also: బొట్టు, సింధూరం, మంగళసూత్రం.. భారతీయ మహిళలకు వీరే స్ఫూర్తి - కంగనా కామెంట్స్


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial