రజినీకాంత్‌కు బ్యాక్‌ టు బ్యాక్ ఫ్లాప్‌లు, మనం నోరు మూసుకుని చూడాలి: విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్

ఖుషి మూవీ ప్రమోషన్స్ లో హీరో విజయ్ దేవరకొండ కీలక వ్యాఖ్యలు చేశారు. హిట్లు, ఫ్లాప్‌ల ఆధారంగా నటీనటులను అంచనా వేయకూడని చెప్తూనే... రజనీకాంత్, చిరంజీవిల గురించి విజయ్ దేవరకొండ కొనియాడుతూ వ్యాఖ్యానించారు.

Continues below advertisement

Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ మళ్లీ ఫామ్ లోకి వచ్చినట్టు తెలుస్తోంది. 'లైగర్' తో భారీ అపజయాన్ని మూటగట్టుకున్న ఆయన.. ఇప్పుడు శివ నిర్వాణ దర్శకత్వంలో రాబోతున్న 'ఖుషి' ద్వారా ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమయ్యాడు. సమంత హీరోయిన్ గా నటిస్తోన్న ఈ లవ్ పాన్-ఇండియన్ రొమాంటిక్ డ్రామా సెప్టెంబర్ 1న రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ఇప్పటికే మూవీ టీమ్ ప్రమోషన్స్ ను స్పీడప్ చేసింది. అందులో భాగంగా ఇటీవల తమిళనాడులో 'ఖుషి' సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న విజయ్.. సూపర్ స్టార్ రజనీ కాంత్, మెగా స్టార్ చిరంజీవిల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రజినీకాంత్ నటించిన 5-6 సినిమాలు వరుసగా ప్లాప్ అయ్యాయని, కానీ ఆయన మళ్లీ 'జైలర్' లాంటి బ్లాక్ బస్టర్ తో మళ్లీ తిరికి వచ్చాడని చెప్పాడు. చిరు సార్ ఇండస్ట్రీని మార్చేశారన్న విజయ్ దేవరకొండ.. సరైన దర్శకుడు ఆయన ఎనర్జీని అందుకుంటే భారీ విజయం పక్కా అని తేల్చి చెప్పాడు.

Continues below advertisement

హిట్లు, ఫ్లాప్‌ల ఆధారంగా నటీనటులను అంచనా వేయకూడని విజయ్ దేవరకొండ చెప్పారు. "రజినీకాంత్ 5-6 బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్‌లు ఇచ్చారు. కానీ ‘జైలర్’ లాంటి బ్లాక్ బస్టర్ తో మళ్లీ తిరికి వచ్చారు. అలాంటప్పుడు మనం నోరుమూసుకుని చూడాలి" అని అన్నాడు. ఇక చిరంజీవి గురించి మాట్లాడిన ఆయన. "చిరంజీవి గారికి బ్యాక్ టు బ్యాక్ 6-7 ఫ్లాప్‌లు ఉండొచ్చు. కానీ సరైన దర్శకుడు తన ఎనర్జీని అందుకుంటే, ఈ సంక్రాంతికి చేసినట్లే ఆయన సెన్సేషన్‌ హిట్ తో మళ్లీ వస్తారు. చిరు సార్ ఇండస్ట్రీని మార్చేశారు. ఆయన వచ్చాక అక్కడ ఉండే యాక్షన్, డ్యాన్స్, పర్ఫార్మెన్స్ అన్నీ పూర్తిగా మారిపోయాయి. ఇండస్ట్రీలోకి రావడానికి ఆయన ఎంతో మందిని ప్రేరేపించారు. చాలా మంది ఆయనను చూసే సినిమాల్లోకి వచ్చాం" అని విజయ్ దేవరకొండ అన్నారు.

ప్రతి ఒక్కరూ తమ సినిమాలను ఆస్వాదించేలా, పరిశ్రమలోకి రావడానికి చాలా మందికి స్ఫూర్తిగా ఉన్నందుకు.. వారిని గౌరవించాలని విజయ్ తెలిపాడు. సీనియర్ నటులపై కామెంట్స్ చేయడం అగౌరవంగా భావిస్తున్నానని.. వారంతా గొప్పవారని, మనం వారిని గౌరవించాలని చెప్పాడు. ‘విక్రమ్‌’తో కమల్‌ సర్‌, 'జైలర్‌'తో రజనీ సార్‌ని చూడటం చాలా ఆనందంగా ఉందని ఆనందం వ్యక్తం చేశాడు. తాజాగా విజయ్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారాయి. నటీనటులపై లేని పోని కామెంట్స్ చేసే వారికి విజయ్ ఇచ్చిన సమాధానం చెంపపెట్టులా ఉందని ఆయా స్టార్ ఫ్యాన్స్ అంటున్నారు. 

ఇక 'ఖుషి' సినిమా విషయానికొస్తే.. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన ట్రైలర్, పాటలకు విశేషమైన స్పందన వచ్చింది. దీంతో మూవీపై ఆటోమేటిక్ గా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా లవ్ స్టోరీ బేస్డ్ స్టోరీతో రాబోతోంది.

Read Alsoచిరు ‘మెగా’ కాన్సెప్ట్ - పంచ భూతాలతో చిరంజీవి ప్రయోగం, 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ జోనర్‌లో!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Continues below advertisement
Sponsored Links by Taboola