Jawan: బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ లేటెస్ట్ 'జవాన్' చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఇటీవలే రిలీజై ముందున్న అంచనాలను మరింత పెంచేస్తోంది. తాజాగా ఈ సినిమాపై లేడీ సూపర్ స్టార్ నయనతర హస్బెండ్, డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ట్వీట్ కు స్పందించిన షారుఖ్.. నయనతారతో జాగ్రత్తగా ఉండాలని, ఇప్పుడామె కొన్ని కిక్ లు, పంచ్ లు నేర్చుకుందంటూ మరో ఇంట్రస్టింగ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం వీరిద్దరి ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
'జవాన్' సినిమాలో షారుఖ్ సరసన నయనతార నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో జవాన్ సినిమాలోని విజువల్స్ ఇంటర్నేషనల్ సినిమాను తలపిస్తుందని, మూవీ టీంకు హ్యాట్సాఫ్ అంటూ విఘ్నేష్ శివన్ ట్వీట్ చేశారు. నయనతార లుక్స్ కూడా బాగున్నాయని.. దాంతో పాటు చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ కూడా చెప్పారు. ఈ ప్రశంసలపై కింగ్ ఖాన్ వెంటనే స్పందించారు. "విఘ్నేష్ శివన్ మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు. నయనతార అద్భుతంగా ఉంది. కానీ ఓహ్ నేను ఎవరికి చెబుతున్నాను... మీకు ముందే తెలుసు కదా" అంటూ షారుఖ్ ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు.
"కానీ భర్తగా మీరు జాగ్రత్తగా ఉండాలని, నయనతార ఇప్పుడు కొన్ని మేజర్ కిక్ లు, పంచ్ లు నేర్చుకుంది" అంటూ షారుక్ ఖాన్ ఈ ట్వీట్ లో రాసుకువచ్చారు. ఇక ఆ ట్వీట్ కు సమాధానంగా విఘ్నేష్ శివన్.. "అవును సార్ చాలా జాగ్రత్తగా ఉన్నాను’’ అని చెప్పడం మరింత ఇంట్రస్టింగ్ గా అనిపిస్తోంది. దీంతో పాటు "జవాన్ సినిమాలో మీ ఇద్దరి మధ్య మంచి రొమాన్స్ ఉందని కూడా నేను విన్నాను" అని విఘ్నేష్ చెప్పుకొచ్చారు. "రొమాన్స్ కి రారాజుగా పేరున్న మీ నుంచి నయనతార అది నేర్చుకుందని, అందుకే ప్రస్తుతం తాను ఆనందంగా.. తన కలల సినిమా ఆరంగేట్రంలో ఉన్నా"నని పేర్కొన్నారు. 'జవాన్' గ్లోబల్ బ్లాక్ బస్టర్ అవుతుంది అంటూ విఘ్నేష్ శివన్ విషెస్ తెలియజేశారు.
ఇక ఈ సినిమాకు సంబంధించి షారుఖ్ ఖాన్ ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ ప్రమోట్ చేయడం మొదలుపెట్టాడు. 'AskSRK' అంటూ ఫ్యాన్స్ తో ఈ సినిమాకు సంబంధించి చర్చిస్తున్నారు. తనను ఆదరిస్తున్న అందరికీ ధన్యావాదాలు చెప్తున్నారు. "నేను ఎవరు? ఎవరిని కాను ? తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా" అంటూ 'జవాన్' సినిమాకు సంబంధించిన ప్రివ్యూ వచ్చేసిందని ఇటీవలే ఆయన ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు .
Read Also : Prem Kumar Teaser : బాబోయ్, 'ప్రేమ్ కుమార్ కథ'ను గుర్తు పెట్టుకోవడం కష్టమే - ట్విస్టులే ట్విస్టులు!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial